NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

TDP Internal: టీడీపీలో చంద్రబాబుకు తాజా తలనొప్పులు.. పలువురు సీనియర్ నేతలు రివర్స్..?

TDP Internal: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలకు మరో పది నెలలు ఉన్నప్పటికీ ఎన్నికల వేడి మొదలైంది. ప్రధాన రాజకీయ పక్షాలు ఇప్పటి నుండి ఎన్నికల ప్రణాళికలతో ముందుకు వెళుతున్నాయి. నియోజకవర్గాల్లో నేతలను ఎన్నికలకు పార్టీ సమాయత్తం చేస్తున్నాయి. టీడీపీ ఇప్పటికే మినీ మేనిఫెస్టోను ప్రకటించింది. వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ .. గతంలో ఇచ్చిన హామీలను 95 శాతంకుపైగా అమలు చేశామనీ, ప్రజలకు మేలు జరిగింది అంటే మరో సారి మద్దతు ఇవ్వాలనీ, గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి తేడా గమనించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనకు ఒక సారి అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతానని ప్రకటిస్తున్నారు.

Chandrababu

సీనియర్ నేతల తిరుగుబాట్లు

ఎన్నికల ప్రణాళికలతో ముందుకు వెళుతున్న ఈ తరుణంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు కొత్త తలనొప్పులు ఎదురవుతున్నాయి. సీనియర్ ల నుండి తిరుగుబాట్లు కనబడుతున్నాయి. నియోజకవర్గ ఇన్ చార్జిల విషయంలో నాన్పుడు ధోరణితో వ్యవహరించడం వల్ల ఇప్పుడు తిరుగుబాట్లు ఎదురవుతున్నాయి. ప్రతిపక్షంలో ఈ నాలుగేళ్లలో పలు నియోజకవర్గాల్లో క్లారిటీ ఇవ్వకపోవడంతో ఇప్పుడు నాయకులు రివర్స్ అవుతున్నారు. నియోజకవర్గ టీడీపీ గ్రూపు రాజకీయాలను వైసీపీ అనుకూలంగా మార్చుకుంటోంది. ఉమ్మడి గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్ చార్జిగా రీసెంట్ గా పార్టీ లో చేరిన కన్నా లక్ష్మీనారాయణను నియమించడంతో దివంగత నేత కోడెల శివప్రసాద్ రాజకీయ వారసుడుగా పొలికల్ ఎంట్రీ ఇచ్చిన కోడెల శివరామ్ ఇప్పుడు పార్టీకి రివర్స్ అవుతున్నారు. అవసరం అయితే తాను స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేయడానికి సిద్దమని ప్రకటించారు.

 

మరో పక్క విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని సమయం దొరికినప్పుడల్లా అధిష్టానంకు వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తున్నారు. పార్టీ టికెట్ ఏ పిట్టల దొరకు ఇచ్చినా ఫరవాలేదు, నియోజకవర్గ ప్రజలు కోరుకుంటే స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసి నెగ్గుతాను అని అంటున్నారు. అలానే శ్రీకాళహస్తి నియోజకవర్గంలో వైసీపీకి చెందిన సీనియర్ నేత ఎస్ సీ వీ నాయుడును చంద్రబాబు టీడీపీలో చేర్చుకునే ప్రయత్నం చేయగా, దాన్ని వ్యతిరేకిస్తూ ఆ నియోజకవర్గ నేత బొజ్జల సుధీర్ రెడ్డి వాయిస్ మెసేజ్ విడుదల చేయడం నియోజకవర్గంలో హాట్ టాపిక్ అయ్యింది. దీంతో చంద్రబాబు ఎస్ సీవీ నాయుడు చేరికను వాయిదా వేశారు. అలానే కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ లో భూమా అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డి మధ్య వైరం పార్టీకి ఒక తలనొప్పిగా తయారైంది. అఖిలప్రియకు టికెట్ ఇవ్వనని చెబితే ఆమె కూడా రివర్స్ అయ్యే పరిస్థితి ఉంది. మరో పక్క కొందరు ఎన్ఆర్ఐలు, బడా వ్యాపారవేత్తలు పలు నియోజకవర్గాల్లో టికెట్ లను ఆశిస్తూ సామాజిక కార్యక్రమాలతో ప్రజలకు దగ్గర అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీలో పలువురు ముఖ్యనేతల ద్వారా రాబోయే ఎన్నికల్లో టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది ఆ నియోజకవర్గంలో ఇప్పటి వరకూ ఉన్న ఇన్ చార్జిలకు మింగుడు పడటం లేదు.

రాబోయే ఎన్నికల్లో 40 శాతం సీట్లు యువతకు ఇస్తామని ఇప్పటికే చంద్రబాబు చెప్పారు. దీంతో ఎంత మంది సీనియర్ లను పక్కన పెడతారు.. వారు దానికి ఒప్పుకుంటారా అనేది చూడాలి. తన టికెట్ కు ఎసరు వస్తుందేమోనని ఇటీవల మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు ఎన్ఆర్ఐల వ్యవహారంపై ఓపెన్ అయిపోయారు. ఎన్నికలకు ముందు వచ్చి నియోజకవర్గాల్లో సేవా కార్యక్రమాలు చేస్తున్నామంటూ ముందుకు వచ్చే వారిని చూసుకుంటే వాళ్లు ఎన్నికల తర్వాత మళ్లీ కనబడరని అన్నారు. పార్టీలో ఉన్న నేతలతో సంప్రదింపులు చేయకుండా ప్రత్యర్ధులను పార్టీలోకి చేర్చుకోవడం మూలంగా కర్నూలు జిల్లాకు చెందిన కప్పట్రాళ్ల బొజ్జమ్మ రీసెంట్ గా వైసీపీలో చేరారు. ఈ తాజా తలనొప్పులను టీడీపీ అధినేత చంద్రబాబు ఎలా పరిష్కరించుకుంటారో వేచి చూడాలి.

Kottagudem (Bhadradri Kottagudem): తల్లిని నిర్లక్ష్యం చేసి మరణానికి కారకులైన కుమారులకు జైలు శిక్ష .. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన తీర్పు

Related posts

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju

Amit Shah: అమిత్ షా కు తృటిలో తప్పిన హెలికాఫ్టర్ ప్రమాదం

sharma somaraju

Video Morphing Case: అమిత్ షా డీప్ షేక్ వీడియో కేసు.. గాంధీ భవన్ కు ఢిల్లీ పోలీసులు ..సోషల్ మీడియా ప్రతినిధులకు నోటీసులు

sharma somaraju

Supreme Court: ఏపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ ..ఎన్జీటీ తీర్పును యథాతధంగా అమలు చేయాలంటూ ఆదేశం

sharma somaraju

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి టాలీవుడ్ స్టార్ హీరో స‌తీమ‌ణి.. హీరోయిన్‌గా కూడా చేసింది.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N