NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Chandrababu: టీడీపీ మేనిఫెస్టోపై వైసీపీ సోషల్ మీడియాలో సెటైర్ లు .. ఇవన్నీ ఇస్తే రాష్ట్రం శ్రీలంక అవ్వదా సార్..?

Chandrababu: ఓట్ల కోసం ఉచిత పథకాలను అమలు చేయాలనుకోవడం దేశానికి ప్రమాదకరమని ప్రధాని మోడీ గతంలో హెచ్చరించిన సంగతి తెలిసిందే. ప్రధాని మోడీ అభిప్రాయం అలా ఉంటే వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు ఓటర్లను ఆకట్టుకునేందుకు ఉచిత పథకాలను అమలు చేస్తూనే ఉన్నాయి. దేశంలో ఇతర రాష్ట్రాలను పోల్చుకుంటే ప్రస్తుతం ఏపీలో జగన్మోహనరెడ్డి సర్కార్ నవరత్నాల పేరుతో పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను అమలు చేస్తొంది. కోట్లాది రూపాయలను లబ్దిదారుల ఖాతాల్లో జమ చేస్తొంది. అయితే ఈ పథకాల అమలునకు ప్రభుత్వం పెద్ద ఎత్తున అప్పులు చేయాల్సి వస్తొంది. అప్పులు చేస్తూ లబ్దిదారులకు పంపిణీ చేస్తుండంపై రాష్ట్రం శ్రీలంక మాదిరిగా తయారు అవుతోందంటూ గతంలో ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి. అయితే ఇప్పుడు తాజాగా టీడీపీ మహానాడులో ఆ పార్టీ అధినేత చంద్రబాబు మినీ మ్యానిఫేస్టో విడుదల చేశారు. భవిష్యత్తుకు భరోసా పేరుతో ప్రస్తుతం జగన్మోహనరెడ్డి అమలు చేస్తున్న పథకాలకు ఏ మాత్రం తక్కువ కాకుండా అదే స్థాయిలో హామీలు ప్రకటించారు టీడీపీ అధినేత చంద్రబాబు.

Chandrababu

 

మహిళల కోసం మహాశక్తి కార్యక్రమం కింద 18 – 59 ఏళ్ల మహిళలకు ఆడబిడ్డ నిధి కింద అడబిడ్డకు నెలకు రూ.1500 ఖాతాలో వేస్తామని, తల్లికి వందనం కింద ప్రతి బిడ్డ తల్లికి ఏటా రూ.15వేలు అందజేస్తామన్నారు. ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలెండర్ లు అందిస్తామనీ, జిల్లా పరిధిలో మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం కల్పిస్తామని హామీ ఇచ్చారు. నిరుద్యోగ యువత కోసం యువగళం నిధి కింద నిరుద్యోగులకు నెలకు రూ.3వేల భృతి అందిస్తామని చెప్పారు. ప్రతి రైతుకు ఏడాదికి రూ.20వేలు ఆర్ధిక సాయం అందిస్తామని ప్రకటించారు. ఇంటింటికి మంచినీరు పథకం కింద ఉచితంగా నల్లా కనెక్షన్లు ఇస్తామన్నారు. చంద్రబాబు ప్రకటించిన ఈ పథకాలపై వైసీపీ సోషల్ మీడియాలో సెటైర్ లు పేలుతున్నాయి. అమ్మ ఒడిని – అమ్మకు వందనంగా మార్చి ఏడాదికి రూ.15వేలు ఇస్తాడట, వైఎస్ఆర్ చేయూతను అడబిడ్డ నిధిగా మార్చి నెలకు రూ.1500లు ఇస్తాడట, నిరుద్యోగ భృతి రూ,3 వేలు అంట (2014లో రూ.2వేలు ఇస్తా అని యగొట్టాడు) ఇవన్నీ ఇస్తే రాష్ట్రం శ్రీలంక అవ్వదా సార్ అంటూ అయినా నిన్ను నమ్మం బాబు  అని ప్రజలు అంటున్నారు అంటూ పోస్టును వైరల్ చేస్తున్నారు.

చివరి ఎన్నికలకు కదా.. కేజీ బంగారం .. ఇంటికి కారు, ప్రతి మండలానికి బుల్లెట్ ట్రైన్, పెన్షన్ 5000, ప్రతి మండలం లో AIMS హాస్పిటల్, నెలకు 10 వేల టీచర్ పోస్తుల భర్తీ, హెలికాప్టర్ అంబులెన్స్ లు, రైతులకు పంటలకు కానిస్టేబుల్ తో కాపలా.., పిల్లల కు చదివే పని లేకుండా డైరెక్ట్ ఇంటికి 2 ఉద్యోగాలు,  ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు 100 సంవత్సరాలు, ఇలాంటివి 1000 హామీలు ఇస్తాడు నక్క జిత్తుల చంద్రబాబు.. నమ్మి ఓటేస్తే 2014 నుండి 2019 వరకు ఎలా ఉందో చూశాం కదా.. దానికి 10 రెట్లు బాధలు అనుభవిస్తాం…! తస్మాత్ జాగ్రత్త…?? అంటూ కూడా సోషల్ మీడియా వైసీపీ శ్రేణులు పోస్టులను వైరల్ చేస్తున్నారు.

పార్లమెంట్ డిజైన్ శవపేటికలా ఉందంటూ ఆర్జేడీ ట్వీట్ .. బీజేపీ ఫైర్

author avatar
sharma somaraju Content Editor

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju