సినిమా

SVP: హైదరాబాద్ సుదర్శన్ థియేటర్ లో స్పెషల్ షో చూసిన మహేష్ ఫ్యామిలీ..??

Share

SVP: సూపర్ స్టార్ మహేష్ బాబు “సర్కారు వారి పాట” బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో థియేటర్లకు జనాలు పోటెత్తుతున్నారు. రెండు సంవత్సరాల తర్వాత మహేష్ సినిమా రిలీజ్ అయిన నేపథ్యంలో.. ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఫస్టాఫ్ తనదైన కామెడీ పంచ్ డైలాగులతో.. మహేష్ వన్ మాన్ ఆర్మీ టైపు ఆడియన్స్ ని అలరించాడు. హీరోయిన్ కీర్తిసురేష్ తో వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి.

Mahesh babu's family to watch svp at a single screen

ఇక సెకండాఫ్ పూర్తి స్టోరీ లోకి తీసుకెళ్ళి.. అద్భుతమైన ముగింపు డైరెక్టర్ పరుశురాం చూపించడం జరిగింది. ఓవరాల్ గా “సర్కారు వారి పాట” అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. వీకెండ్ కావడంతో..పాటు రెండవ శనివారం కావడంతో శనివారం “సర్కారు వారి పాట” థియేటర్లు హౌస్ ఫుల్ అయిపోతున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ సినిమాని చాలా మంది సెలబ్రెటీలు చూడటం జరిగింది.

 

ఇండస్ట్రీకి చెందిన టాప్ మోస్ట్ డైరెక్టర్ల తోపాటు మరికొంత మంది నటీనటులు సినిమాని చూసి సోషల్ మీడియాలో రియాక్ట్ అవుతున్నారు. మొదటి రోజే నిర్మాతలతో పాటు డైరెక్టర్ హరీష్శంకర్ మహేష్ భార్య నమ్రత.. హైదరాబాద్ లో స్పెషల్ షో చూడటం తెలిసిందే. అయితే మరోసారి శనివారం హైదరాబాద్ మ్యాట్నీ షోకి మహేష్ ఫ్యామిలీ వెళ్ళటం జరిగిందట. హైదరాబాద్ సుదర్శన్ థియేటర్ లో మహేష్ కూతురు సితారతో పాటు నమ్రత మరికొంత మంది కుటుంబ సభ్యులు… ప్రేక్షకులతో కలిసి సినిమాని చూసినట్లు సమాచారం. “సర్కార్ వారి పాట” సినిమా రిలీజ్ అవ్వకముందు పెన్ని సాంగ్ ప్రమోషన్ లో సితార అదరగొట్టే స్టెప్పులు వేసింది. మెసేజ్ ఓరియంటెడ్ టైపులో కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన “సర్కారు వారి పాట” కలెక్షన్ ల పరంగా దూసుకుపోతోంది.


Share

Related posts

Sreemukhi Amazing Images

Gallery Desk

సినీ ప్ర‌ముఖుల సంతాపాలు

Siva Prasad

Siri Hanmanth : ‘ తన పెళ్లి గురించి సిరి హన్మంత్ వైరల్ కామెంట్స్ .. ‘ వాడిని చేసుకుంటా .. కానీ ఒక కండిషన్ ‘ ట్విస్ట్ ఇచ్చిందిగా !

Ram
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar