Kalki 2898 AD: “సలార్” సినిమా విజయంతో ప్రభాస్ మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కటం జరిగింది. “బాహుబలి 2” తర్వాత ప్రభాస్ నటించిన మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. హిట్టు కొట్టి ఐదు సంవత్సరాలు కావడంతో కెరీర్ డేంజర్ జోన్ లో ఉన్న సమయంలో “కేజిఎఫ్” దర్శకుడు ప్రశాంత్ నీల్ తో “సలార్” చేసి విజయం సాధించాడు. ప్రభాస్ సినిమా హిట్ అయితే కలెక్షన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో “సలార్” నిరూపిస్తుంది. 2023 ఏడాదిలో వచ్చిన అన్ని సినిమాల్లో కంటే “సలార్” సినిమాకి అత్యధికమైన రికార్డ్ స్థాయి ఓపెనింగ్స్ కలెక్షన్స్ రావడం జరిగాయి. దీంతో ఇప్పుడు “కల్కి 2898 AD” సినిమా కోసం… ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.
జనవరి 24వ తారీకు ఈ సినిమా రిలీజ్ కాబోతుందని కొన్ని నెలల క్రితం అధికారిక ప్రకటన చేయడం జరిగింది. కానీ సినిమా షూటింగ్ ఆలస్యం కావడంతో “కల్కి 2898 AD” రిలీజ్ వాయిదా పడటం జరిగింది. కొత్త విడుదల తేది ఇంకా ప్రకటించలేదు. ఇదిలా ఉంటే ఇటీవల ఈ సినిమా దర్శకుడు నాగ్ అశ్విన్ బాంబే ఐఐటీలో ఈ సినిమాకి సంబంధించి టెక్ ఫెస్ట్ లో సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. సినిమా గురించి విద్యార్థులు అడిగిన అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం జరిగింది. ఏప్రిల్ నెలలో సినిమా విడుదల అన్నట్టు వ్యాఖ్యానించారు. ఈ సినిమా భవిష్యత్తులో భారత్ ఎలా ఉంటుంది అనే కోణంలో ప్రత్యేక ప్రపంచంలో రూపొందించడం జరిగింది.
“కల్కి 2898 AD” కోసం దాదాపు 5 సంవత్సరాలు నుండి కష్టపడుతున్నారు. ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేసి కొత్త ప్రపంచాన్ని సృష్టించాం. ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుంది. ఈ సినిమాకి కాన్సెప్ట్ ఆర్టిస్ట్ లు, ప్రొడక్షన్ డిజైనర్స్.. వాడే టెక్నాలజీ మరియు ఆయుధాలు, ట్రోప్స్, కాస్ట్యూమ్స్ ప్రతిదీ భారతీయ మూలంతో ముడిపడి ఉంటుంది అని తెలియజేయడం జరిగింది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో వాడిన గన్స్ మరియు ఆయుధాలు వాటికి సంబంధించిన వీడియో లేటెస్ట్ గా మేకర్స్ విడుదల చేశారు. ఈ వీడియోలో చాలా వెరైటీ గాన్స్ ఉన్నాయి. హై రేంజ్ లో సినిమా తీసినట్లు చూపిస్తున్న ఆయుధాలు బట్టి తెలుస్తోంది.