Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు కెరియర్ పరంగా విజయవంతంగా రాణించటంలో భార్య నమ్రత పాత్ర ఎంతో ప్రాముఖ్యమైనది. సినిమాల పరంగా మహేష్ తన పని తాను చేసుకుంటూ అభిమానులను అలరిస్తూ విజయాలు అందుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో ఇంట్లో విషయాలు మిగతా అన్ని సంగతులు భార్య నమ్రత దగ్గరుండి చూసుకుంటారు. మహేష్ బాబు పేరిట అనేక సేవా కార్యక్రమాలు ఇంకా వ్యాపార లావాదేవీలు అన్ని కూడా బాధ్యతగా చూసుకుంటారు. ఒకపక్క పిల్లలను కనిపెడుతూనే మరోపక్క మహేష్ పై ఎటువంటి భారం లేకుండా.. భార్యగా బాధ్యతాయుతంగా కుటుంబంలో ప్రాముఖ్య పాత్ర పోషిస్తారు. కుటుంబాన్ని విజయవంతంగా నడిపించడంలో నమ్రత ఎంతో శ్రద్ధ తీసుకుంటారు.
ఈ క్రమంలో ఫిబ్రవరి 10వ తారీకు పెళ్లి రోజు కావడంతో.. 19వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా నమ్రత.. మరియు మహేష్ తమ ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో ఒకరికొకరు విషెస్ చెప్పుకుంటూ స్పెషల్ పోస్టులు పెట్టారు. నమ్రత గతంలో మహేష్ కి బుగ్గపై ముద్దు పెడుతున్న ఒక పాత ఫోటోని షేర్ చేసి ప్రేమ నవ్వుల్లో జీవితంలో ఎన్నో అందమైన అనుభవాలలో మనమిద్దరం భాగస్వామ్యం హ్యాపీ యానివర్సరీ నమ్రత అని మహేష్.. రాసుకురావడం జరిగింది. నమ్రత కూడా గతంలో మహేష్ బాబుతో క్లోజ్ గా దిగిన ఫోటో ని షేర్ చేసి ఇంకో సంవత్సరం ప్రేమ సంతోషం.. నీతో సెలబ్రేట్ చేసుకుంటున్నాను. ఇది నిత్యం ఉంటుంది అని మహేష్ బాబుకి తెలియజేయడం జరిగింది.
దీంతో మహేష్….నమ్రత వివాహ వార్షికోత్సవం సందర్భంగా బంధువులు అభిమానులు కూడా విషెస్ తెలియజేస్తున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో చేయబోయే సినిమా ప్రీప్రొడక్షన్ పనులలో బిజీగా ఉన్నారు. వచ్చే నెలలో సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన చేయనున్నట్లు సమాచారం. పాన్ వరల్డ్ తరహాలో సినిమా రాబోతుందని అంటున్నారు. దాదాపు 1,000 కోట్ల భారీ బడ్జెట్ తో సినిమాని నిర్మించబోతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. మొన్ననే ఈ సినిమాకి సంబంధించి జర్మనీలో మహేష్ పర్యటించడం జరిగింది.