Naa Saami Ranga OTT: తెలుగు చలనచిత్ర రంగంలో ఈ సంక్రాంతి పండుగకు నాలుగు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీపడ్డాయి. జనవరి 12వ తారీకు హనుమాన్, గుంటూరు కారం విడుదలయ్యాయి. తర్వాత వెంకటేష్ “సైంధవ్” రిలీజ్ కావడం జరిగింది. అనంతరం కింగ్ నాగార్జున “నా సామి రంగ” సినిమా విడుదలయ్యింది. ఈ నాలుగింటిలో హనుమాన్ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఆ తర్వాత నాగార్జున “నా సామిరంగ” కూడా ఓ మాదిరి విజయాన్ని అందుకోవటం జరిగింది. ఇప్పటికే ఈ నాలుగింటిలో “సైంధవ్”, “గుంటూరు కారం” సినిమాలు ఓటీటీ బాట పట్టాయి. అయితే ఇప్పుడు నాగార్జున “నా సామిరంగ” కూడా ఓటీటీలో విడుదల కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ సినిమాని తమ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు డిస్నీ హాట్ స్టార్ తాజాగా ప్రకటించింది. ఎప్పుడు అందుబాటులోకి వస్తుందన్న దానిపై మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే ఈ నెల 15 నుంచి ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. విజయ్ బీన్ని దర్శకత్వం వహించిన ఈ సినిమా గత నెల జనవరి 14వ తారీకు రిలీజ్ అయింది. చాలాకాలం తర్వాత నాగార్జున సినిమాకి ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి ఈ సినిమాకి గాని సంగీతం అందించారు.
పల్లెటూరు నేపథ్యంలో యాక్షన్ రొమాంటిక్ తరహాలో తెరకెక్కిన ఈ సినిమాలో నాగార్జునతో పాటు అల్లరి నరేష్ కీలక పాత్ర పోషించారు. రాజ్ తరుణ్ కూడా నటించడం జరిగింది. హీరోయిన్ గా ఆశికా రంగనాథ్ నటించింది. నాజర్, మలయాళ నటుడు షబ్బీర్ కలరక్కాల్, రవి వర్మ, రావు రమేశ్, మధు సూదన్ రావ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఫిబ్రవరి 15 లేదా అదే వారంలో ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వరుసపరాజయాలలో ఉన్న నాగార్జునకి “నా సామిరంగా” ఓ మాదిరి హిట్ ఇవ్వటం జరిగింది.