OTT Movies: కొన్ని సినిమాలను చూసినప్పుడు ఒక వినోదమే కాదు మోటివేషన్ కూడా అందుతుంది. ఒక్కొక్కసారి జీవితాన్నే మార్చేసేలా కొన్ని సినిమాలు మంచి మోటివేషన్ అందిస్తాయి. సాధారణంగా మనుషులు ఏదో ఒక కారణంలో తీవ్ర దుఃఖంలో మరియు బాధలో, ఏం చేయాలో తెలియని స్థితిలో ఉంటారు. అలాంటి సమయంలో కొన్ని మాటలు చాలా ఇన్స్పిరేషన్ గా అనిపిస్తాయి. అడుగు ముందుకు వేసేందుకు ఎంతో దామోదపడతాయి. అలాంటి మోటివేషన్ సినిమాలు ఇప్పటికే మన చిత్ర పరిశ్రమలో ఎన్నో రూపం దాయి. ఇక తాజాగా వచ్చిన బెస్ట్ మోటివేషన్ టాప్ 5 మూవీస్ కూడా ఉన్నాయి. మరి ఆ సినిమాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. గూమర్:
బాలీవుడ్ పాపులర్ డైరెక్టర్ ఆర్ బల్కి దర్శకత్వం వహించిన రీసెంట్ మూవీ నే గూమర్. హీరో గా అభిషేక్ బచ్చన్ నటించగా సయామి ఖేర్ అతి ముఖ్యమైన పాత్రలో నటించిన ఈ మూవీ ఒక స్పోర్ట్స్ డ్రామా. క్రికెట్ లో మంచి పేరు తెచ్చుకోవాలని చాలా విధాలుగా ప్రయత్నించే యువతకి అనుకోకుండా యాక్సిడెంట్ లో చేతిని కోల్పోతుంది. అనంతరం ఇంటర్నేషనల్ క్రికెట్ లో తన లక్ష్యాన్ని ఎలా సాధించుకుందో స్ఫూర్తివంతంగా చెప్పిన సినిమానే ఈ మూవీ.
2. కచ్చే లింబు:
2022లో విడుదలైన ఈ మూవీ మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. శుభమ్ యోగి దర్శకత్వం వహించిన ఈ మూవీలో రాధిక మదన్, రజత బర్మేచా, ఐషా అహ్మద్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. తన సోదరుడు క్రికెట్ జట్టుకు పోటీగా టోర్నమెంట్లో పాల్గొన్న ఓ యువతి చుట్టూ ఈ మూవీ కథ తిరుగుతుంది. అమ్మాయిలకు కట్టు బట్టు ఉండాలని, సామాజిక నిబంధనలతో చేస్తున్న కట్టడిని అడ్డుకొని ఓ యువతి తన గోల్ ఎలా రిచ్ అయిందే చెప్పే స్పోర్ట్స్ డ్రామానే ఇది. ఈ మూవీను జియో సినిమాలో ఫ్రీగా చూడవచ్చు.
3. సలామ్ వెంకీ:
పాపులర్ నటి రేవతి డైరెక్ట్ చేసిన ఈ మూవీ విమర్శికుల నుంచి ప్రశంసలు అందుకుంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్, మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్, విశాల్, రిద్ది కుమార్ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి హిట్గా నిలిచింది. కండరాల బలహీనతతో బాధపడుతున్న కొడుకు జీవితాన్ని మార్చేసిన ఓ ఆదర్శవంతమైన తల్లి కథ నే ఈ మూవీ. ఎమోషనల్ డ్రామా తో ఈ మూవీ జీ5 లో స్ట్రీమింగ్ అవుతుంది.
4. ది స్కై ఈజ్ పింక్:
గ్లోబల్ హీరోయిన్ ప్రియాంక చోప్రా, బాలీవుడ్ యాక్టర్ అండ్ డైరెక్టర్ పర్హాన్ అక్తర్ హీరో హీరోయిన్గా నటించిన రొమాంటిక్ కామెడీనే ఈ మూవీ. సోనాలి బోస్ దర్శకత్వం వహించిన ఈ మూవీ 2019లో రిలీజ్ ఐ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. 19 ఏళ్లకే మరణించిన మోటివేషనల్ స్పీకర్, రైటర్ ఐషా చౌదరి జీవితం కదా ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది.
5. 12th ఫైల్:
ఐపీఎస్ ఆఫీసర్ మనోజ్ కుమార్ శర్మ బయోగ్రఫీ గా వచ్చిన 12 ఫైల్ మూవీ గత ఏడాది థియేటర్లలో సంచలనం సృష్టించిందని చెప్పుకోవచ్చు. రూ. 20 కోట్లతో తెరకెక్కిన ఈ మూవీ 69 కోట్లకు పైగా కలెక్షన్స్ను రాబట్టింది. ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థి ఐపీఎస్ అధికారి ఎలా అయ్యాడు అనే దానిపై ఈ మూవీ రూపొందింది. ఇక ఈ మూవీ ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది.
అలా ఈ ఐదు సినిమాలే కాకుండా గతంలో ఎన్నో సినిమాలు కొందరి జీవితాలను మార్చేసాయని చెప్పుకోవచ్చు. కొన్ని సినిమాలను చూడడం వల్ల వినోదమే కాదు మోటివేషన్ కూడా అందుతుంది.