They Call Him OG: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో “OG” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మాఫియా బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాలలో బిజీగా ఉండటంతో షూటింగ్ ఆగిపోయింది. అయితే ఈ సినిమాకి సంబంధించి విడుదల తేదీ తెలియజేస్తూ సినిమా యూనిట్ అధికారిక పోస్టర్ విడుదల చేయడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది సెప్టెంబర్ 27వ తారీకు ..”OG” రిలీజ్ కాబోతున్నట్లు స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్ లో పవన్ కళ్యాణ్ టీ తాగుతూ బ్లాక్ స్పెట్స్ పెట్టుకుని స్టైలిష్ లుక్ లో ఉండటంతో పవన్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
ఈ సినిమాలో బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఇమ్రాన్ హష్మీ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కెరియర్ లో సెప్టెంబర్ 27వ తారీకు త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించిన “అత్తారింటికి దారేది” సినిమా రిలీజ్ అయింది. 2013లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు క్రియేట్ చేయడం జరిగింది. సరిగ్గా ఇప్పుడు అదే తేదీకి “ఓజి” విడుదల చేస్తున్నట్లు ప్రకటించడం సంచలనంగా మారింది. దర్శకుడు సుజిత్ పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని. దీంతో ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి విడుదలైన పోస్టర్స్ లో పవన్ కళ్యాణ్ చాలా స్టైలిష్ లుక్ లో కనిపించడం జరిగింది. “OG” గ్లింప్స్ వీడియో కూడా అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ వీడియోలో “అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అం”టే అంటూ బ్యాక్ గ్రౌండ్ మాటలు సినిమాపై అభిమానులకు ఆసక్తిని పెంచేశాయి.
అయితే తాజాగా విడుదల చేసిన పోస్టర్ లుక్ తో సినిమాపై ఉన్న కొద్ది అంచనాలు పెంచేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు ముగిసిన వెంటనే పవన్ కళ్యాణ్ ఈ సినిమా షూటింగ్ సరవేగంగా కంప్లీట్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ కంప్లీట్ చేశారు. మిగతా బ్యాలెన్స్ ఎన్నికల అయిన వెంటనే పూర్తి చేయనున్నట్లు సమాచారం. డివివి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మాత దానయ్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు.