NewsOrbit
హెల్త్

తెల్లారిన దగ్గర నుంచీ మాటిమాటికీ కూల్ డ్రింక్స్ తాగేవాడు చివరికి ఇలా అయ్యింది !

తెల్లారిన దగ్గర నుంచీ మాటిమాటికీ కూల్ డ్రింక్స్ తాగేవాడు చివరికి ఇలా అయ్యింది !

కౌలలాంపూర్‌‌కు చెందిన మహ్మద్ రజీన్ అనే వ్యక్తి కూల్ డ్రింక్ కనపడితే చాలు పూనకం వచ్చినట్లు అయిపోయేవాడు. దాహం వేసిన , ఆకలి వేసిన అతడి కడుపులో కూల్ డ్రింక్ పడిపోవల్సిందే. అలా మొదలైన అలవాటు.. వ్యసనంగా మారిపోయింది.

తెల్లారిన దగ్గర నుంచీ మాటిమాటికీ కూల్ డ్రింక్స్ తాగేవాడు చివరికి ఇలా అయ్యింది !

డ్రగ్స్‌కు అలవాటు పడినవాడిలా డ్రింకులను మాత్రమే తాగుతూ కూర్చునేవాడు. ఫలితంగా అతడి శరీరం డ్రింకులకే అలవాటైంది. ఫలితంగా అతడి కుడి భుజం బాగా నొప్పి పెట్టడం ప్రారంభమైంది. దీంతో అతడు వైద్యులను సంప్రదించాడు. వైద్య పరీక్షల తర్వాత డాక్టర్లు అతడికి డయబెటీస్ ఉన్నట్లు నిర్ధరించారు. తీపి పదార్థాలకు, పానీయాలకు దూరంగా ఉండాలని సూచించారు. అయితే, అప్పటికీ అతడు కూల్ డ్రింక్స్‌పై యుద్ధాన్ని ఆపలేదు. ఏదైతే అయ్యిందని ఆకలి తీర్చుకోడానికి డ్రింక్స్ తాగుతూనే ఉన్నాడు.

తీపి వల్ల అతడి శరీరంలో సుగర్ స్థాయిలు పెరిగిపోయాయి. చివరికి.. అతడి భుజం ఇన్ఫెక్షన్‌కు గురైంది. బాగా కుళ్లిపోయి పుండులా తయారైంది. కొద్ది రోజులు అయ్యేసరికి  చేయి ఊడిపోయేంత దారుణ  స్థితికి చేరింది. దీంతో అతడి కుటుంబికులు రజీన్‌కు చివాట్లు పెట్టి హాస్పిటల్‌లో చేర్చారు. అతడి పరిస్థితి బాగోలేదంటూ వైద్యులు అత్యవసర చికిత్స అందించారు.అతడిని పరీక్షించిన వైద్యులు.. రిపోర్టులు చూసి ఆశ్చర్యపోయారు.

రజీన్ చర్మం, ఎముక కింది భాగం బాగా పాడైపోయిందని, కొద్ది రోజులు అలాగే వదిలేస్తే చేయి.. శరీరం నుంచి వేరయ్యేదని తెలిపారు. చెడిపోయిన చర్మాన్ని తొలగించి.. ఇన్ఫెక్షన్‌కు గురైన ప్రాంతంలోని చీమును తొలగించారు. ఇకపై కూల్ డ్రింక్స్ తాగొద్దని, బుద్ధిగా డైటీషియన్లు సూచించే ఆహారాన్ని మాత్రమే తినాలని వైద్యులు అతడికి సూచించారు.

కూల్ డ్రింక్సును అలవాటుగా మార్చుకుంటే ఇలాంటి ప్రమాదాలే ఎదురుకోవలిసి వస్తుంది . మీ తల్లిదండ్రులు లేదా వారి పూర్వికుల్లో ఎవరికైనా డయబెటిస్ ఉన్నట్లయితే.. మీరు కూడా కూల్ డ్రింక్స్‌కు దూరంగా ఉండండి. ఒక వేళ ఆ నేపథ్యంలో లేకపోయిన మధుమేహం దాడి చేసే ప్రమాదం ఉంది. కాబట్టి.. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి.కూల్ డ్రింక్స్ విషయంలో  చిన్న పిల్లలని బాగా అదుపుచేయవలిసిన

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri