హై బ్లడ్ ప్రజర్ సమస్యతో బాధపడేవారు రిఫైన్డ్ ఫ్లోర్స్ ను వాడే బదులు, హోల్ గ్రైన్ ఫ్లోర్స్ వాడాలి. ఇప్పుడు బెస్ట్ హోల్ గ్రైన్ ఫ్లోర్స్ కు సంబంధించిన విషయాల గురించి తెలుసుకుందాం..సాధారణంగా, హైపర్టెన్షన్ తో బాధపడే వారు సోడియమ్ తక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలని సూచిస్తారు. అంటే, వీరు ఉప్పును తక్కువగా తీసుకోవాలి. అలాగే, రిఫైన్డ్ ఫ్లోర్స్ బదులు హోల్ గ్రైన్ ఫ్లోర్స్ ను వాడితే మంచిది. అలాగే, వారు తమ డైట్ లో ఎక్కువగా పండ్లు ,కూరగాయలకు ప్రాధాన్యతనివ్వాలి. హై బ్లడ్ ప్రెజర్ డైట్ లో గనక హోల్ గ్రెయిన్స్ కు స్థానమిస్తే అద్భుతాలు జరుగుతాయి.
2010లో అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ లో పబ్లిషైన ఓ స్టడీ ప్రకారం, హోల్ గ్రెయిన్స్ తో కూడిన డైట్ అనేది హైపర్టెన్షన్ కు ప్రిస్క్రైబ్ చేసిన మెడికేషన్స్ తో సమానంగా పనిచేస్తుంది. అంటే, హైపర్టెన్షన్ కు వాడే మెడిసిన్స్ ఎంత ఎఫెక్టివ్ గా పనిచేస్తాయో, హోల్ గ్రెయిన్స్ కూడా దాదాపు అదే రేంజ్ లో సమస్య తగ్గేందుకు హెల్ప్ చేస్తాయి. దాంతో, బ్లడ్ ప్రెజర్ కంట్రోల్ లో ఉంటుంది. దాంతోపాటు, గుండె వ్యాధులు, స్ట్రోక్, హార్ట్ ఫెయిల్యూర్ వంటి సమస్యల బారిన పడే ప్రమాదం కూడా తక్కువే.గోధుమ పిండిలో ఫైబర్ అలాగే ప్రోటీన్స్ సమృద్ధిగా లభిస్తాయి. హైపర్టెన్షన్ వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. హోల్ గ్రైన్ ఓట్స్ లో బెస్ట్ వెరైటీస్ గా రోల్డ్ ఓట్స్ ను పరిగణలోకి తీసుకోవచ్చు. కాబట్టి, హైపర్టెన్షన్ తో బాధపడేవారు రోల్డ్ ఓట్స్ ను ఎంపిక చేసుకుంటే సమస్య తగ్గుతుంది. బక్వీట్ అనేది హోల్ గ్రైన్ లలో ఒక రకం. ఇందులో డైటరీ ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. అలాగే, ప్రోటీన్స్ కు కొరతేమీ లేదు. ఇది గ్లూటెన్ ఫ్రీ కూడా. అలర్జీలున్నవారు కూడా దీన్ని నిస్సందేహంగా తినవచ్చు.బార్లీ రిఫైన్డ్ గ్రెయిన్స్ కు హెల్తీ ఆల్టర్నేటివని చెప్పుకోవచ్చు. 100 గ్రాముల పొట్టు ఉన్న బార్లీలో దాదాపు 17 గ్రాముల డైటరీ ఫైబర్ అలాగే 12 గ్రాముల ప్రోటీన్స్ ఉంటాయని యూఎస్డీఏ డేటా చెబుతోంది.
ఇలా రిఫైండ్ ఫ్లోర్స్ నుంచి హోల్ గ్రెయిన్ ఫ్లోర్స్ కు షిఫ్టవడం మంచిదని నిపుణులంటున్నారు. రిఫైండ్ ఫ్లోర్ కే అలవాటు పడిపోతే అనేక సమస్యలు రావచ్చని వారు హెచ్చరిస్తున్నారు. వీటిలో పోషకాలు తగినన్ని లభించవు. పైగా, వీటిలో హానికర అడిటివ్స్ కూడా ఉంటాయి. అలాగే, వెయిట్ గెయిన్ సమస్య కూడా ఎదురుకోవాల్సి వస్తుంది.బరువు పెరుగుతున్న కొద్దీ బ్లడ్ ప్రెజర్ సమస్యలు తీవ్రమవుతాయి. కాబట్టి, హైపెర్టెన్షన్ ట్రీట్మెంట్ లో భాగంగా రిఫైండ్ ఫ్లోర్స్ ను ఆహారం గా తప్పించడం ఉత్తమం. హోల్ గ్రెయిన్స్ కు హై ప్రయారిటీ ఇవ్వడం శ్రేయస్కరం.
ఎప్పుడైనా ఆహారంలో మార్పులూ చేర్పులూ చేసుకునేటప్పుడు ఆహారాన్ని కొద్దీకొద్దిగా అలవాటు చేసుకుంటూ,బాడీ ఇచ్చే సూచనలను గమనించి అందుకు తగినట్టుగా ముందుకు వెళ్ళాలి అని నిపుణులు సూచిస్తున్నారు.