purse: మందు తాగడం, సిగరెట్ కాల్చడం మాత్రమే చెడు అలవాట్లను కుంటారు చాలా మంది . మన ఆరోగ్యానికి హాని చేసే ఏ అలవాటు అయినా కూడా చెడు అలవాట్ల కిందకే వస్తాయి. నిజం చెప్పాలంటే అవి చెడ్డ అలవాట్లు అని కూడా మనకు తెలియదు. ఇలాంటి వాటి గురించి తెలుసుకుందాం.
పర్స్ వెనుక జేబులో పెట్టుకుని నడవడం వలన ఇబ్బంది ఉండదు. కానీ పర్స్ అలాగే ఉంచి కూర్చోవడం వలన మాత్రం వెన్నెముక కచ్చితం గా బెండ్ అవ్వాల్సి ఉంటుంది. దీనివలన మీ వెన్నెముక వంగిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. సియాటిక్ నెర్వ్ నొప్పి కి ఇది కూడా కారణం గా ఉంటుంది . ఇలా చేస్తే భవిష్యత్తులో ఇబ్బందులు పడవలసి ఉంటుంది. కూర్చున్నప్పుడు వెనుక జేబులో పర్సు అస్సలు ఉంచకండి..
సాధారణంగా ముఖ్యమైన మీటింగ్ లో ఉన్న సమయంలో.. లేదా పక్కన మరెవరైనా ఉన్నప్పుడు మనలో చాలామంది తుమ్మును ఆపేస్తారు. ఇది చిన్న విషయంగా అనిపిస్తుంది కానీ దానివల్ల వచ్చే ఇబ్బంది మాత్రం పెద్దగా ఉంటుంది. మనం తుమ్మినప్పుడు మన నోరు లేదా ముక్కు నుంచి గంటకు 160 కి.మీ. వేగంగా గాలి బయటకు వస్తుంటుంది. తుమ్ములు ఆపడం వలన ఈ గాలి చెవుల వైపు గా వెళ్లి కర్ణభేరి దెబ్బతినేలా చేస్తుంది. కొన్ని సార్లు కళ్ళు, మెదడు లో రక్తనాళాలు పగిలి పోవడం వంటివి కూడా జరుగుతాయి. కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడా తుమ్మును ఆపుకోకపోవడం మంచిది. చీకటిలో మొబైల్ వాడడం వలన మొబైల్ నుండి వచ్చే కాంతి అనేక కంటి సమస్యల కు కారణం అవుతుంది. కంటి చూపు తగ్గిపోవడం , తాత్కాలిక అంధత్వం, కంటి కింద మచ్చలు,నిద్ర లేమి వంటి సమస్యలు వస్తాయి.