NewsOrbit
జాతీయం ట్రెండింగ్ న్యూస్ రాజ‌కీయాలు

Yogi adityanath: యోగి సీఎం కుర్చీ ఊడిపోకుండా ఎందుకు ఆగిందో తెలుసా?

Yogi adityanath: బీజేపీ ఫైర్ బ్రాండ్ నేత‌, ఉత్తరప్రదేశ్ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య‌నాథ్‌ ను సీఎం పీఠం నుంచి తొల‌గించ‌డం ఆగిపోయిందా? వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాషాయపార్టీలో మొద‌లైన‌ కలకలం ఓ కొలిక్కి వ‌చ్చిందా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. బీజేపీ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తున్న నేత‌లు యూపీ సీఎం పీఠం నుంచి ఇప్ప‌ట్లో యోగిని త‌ప్పించ‌రు అంటూ అంచ‌నాలు వేస్తున్నారు.

Read More: Modi: మోడీ కి పెద్ద రిలీఫ్‌… క‌రోనా సెకండ్ వేవ్ క‌ష్టాలు తేలేద‌ట‌

బీజేపీ ప‌రిస్థితి…
ఇటీవ‌ల జ‌రిగిన‌ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ దారుణంగా ఓటమి పాలైంది. సాధారణంగా అధికార పార్టీయే అధిక స్థానాలను గెలుచుకుంటుంది. అందుకు విరుద్ధంగా బీజేపీ మూడోవంతు స్థానాలకే పరిమితమైంది. దీంతో యోగి తీరుపై మంత్రులు, ఎంపీలు బహిరంగంగానే విమర్శలకు దిగారు. మ‌రోవైపు కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో యోగి వైఫల్యంపై ప్రతిపక్షాలు విరుచుకుపడ్డాయి. దీనికి కొన‌సాగింపుగా యూపీ నాయకత్వాన్ని మారుస్తారంటూ వచ్చిన వార్తలు సంచలనంగా మారాయి. ఆ వెంట‌నే యోగి ఢిల్లీ పర్యటన కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే, కరోనా నివారణలో విఫలం అయ్యారంటూ యోగిని దించేస్తే ఓట్లు చీలుతాయేమోన్న ఆందోళనలో అధిష్టానం తలలు పట్టుకుంటున్న‌ట్లు స‌మాచారం.

Read More: corona: క‌రోనా వ్యాక్సిన్ వేసుకుంటే మీకు ఎన్ని డిస్కౌంట్లు, ఆఫ‌ర్లు వ‌స్తాయో తెలుసా?

లెక్క‌లు మారిపోతాయా?

ఢిల్లీలో మోడీ నేతృత్వంలో యూపీ పరిస్థితులపై మే చివరి వారంలో ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలతో జరిగిన సమావేశంలో హోం మంత్రి అమిత్‌షా, బీజేపీ అధ్య‌క్షుడు జేపీ నడ్డా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సునీల్‌ బన్సల్‌ మాత్రమే పాల్గొన్నారు. ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్‌ స్వతంత్ర దేవ్‌ సింగ్‌ను కూడా ఆహ్వానించలేదు. యోగికి సైతం ఆహ్వానం లేదు. ఇక‌ ఈ నెల మొదటి వారంలో యూపీ గవర్నర్‌, స్పీకర్‌లతో బీజేపీ ఉపాధ్యక్షుడు, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ రాధామోహన సింగ్‌ భేటీ కావడం కూడా కలకలం రేపుతోంది. ఇదంతా యోగికి ఎస‌రు పెట్టేందుకే అన్న టాక్ వ‌స్తోంది. ప్ర‌స్తుత సమయంలో నాయకత్వ మార్పుతో నష్టం వచ్చే ప్రమాదం ఉందని యోగి మద్దతు దారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు స‌మాచారం. దీంతో సీఎం పదవి నుంచి తప్పిస్తే.. కల్యాణ్‌సింగ్‌, యడియూరప్ప, ఉమాభారతి, కేశూభాయ్‌ పటేల్‌లాగా ఎదురుతిరగవచ్చని అధిష్టానం భావిస్తున్న‌ట్లు స‌మాచారం. అందుకే ఇప్ప‌ట్లో యోగిని క‌ద‌ప‌క‌పోవ‌చ్చున‌ని చెప్తున్నారు.

author avatar
sridhar

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju