KCR: కేసీఆర్ భారీ క‌ల‌… అడ్డం ప‌డుతున్న‌ కాంగ్రెస్ పార్టీ

Share

KCR: క‌రోనా క‌ల్లోలం స‌మ‌యంలో తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఓ భారీ నిర్ణ‌యం తీసుకున్నారు. అయితే, కేసీఆర్ క‌ల‌కు అడ్డం ప‌డేలా తెలంగాణ కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. రాష్ట్రంలోని ప్ర‌భుత్వ భూములు అమ్మాలని తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకున్న సంగ‌తి తెలిసిందే. దీనిపై సీఎల్‌పీ నేత‌ భట్టి విక్రమార్క గాటు వ్యాఖ్య‌లు చేశారు. అంతేకాకుండా కేసీఆర్ చ‌ర్య‌ల‌కు అడ్డుప‌డే కార్యాచ‌ర‌ణ సైతం మొద‌లుపెట్టారు.

Read More: Corona: గుడ్ న్యూస్ః150కే హైద‌రాబాద్‌లో క‌రోనా టీకా

కాంగ్రెస్ దారిలోనే కేసీఆర్‌….

ప్ర‌భుత్వ‌ భూముల అమ్మకాన్ని నిలిపి వేయాలని సీఎల్పీ నేత‌ భట్టి విక్ర‌మార్క‌ డిమాండ్ చేశారు. ఉమ్మ‌డి రాష్ట్రంలో భూముల కోల్పోయాం కాబ‌ట్టే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందని ఆయ‌న‌ పేర్కొన్నారు. భూముల అమ్మకాన్ని టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకించిందని ఆయ‌న గుర్తుచేశారు. అప్పుడు వ్యతిరేకించి అదే అమ్మ‌కాల‌ను ఇప్పుడు ఎలా ప్రోత్సహిస్తున్నార‌ని కేసీఆర్‌పై ఆయ‌న ఫైర్ అయ్యారు. సమైక్య రాష్ట్రంలో దోపిడీ జరిగింది కాబ‌ట్టి తాను కూడా అలాగే చేస్తాన‌ని కేసీఆర్ అంటే ఎలా ? అని ప్రశ్నించారు. జనం కూడా కేసీఆర్ ను అలాగే సాగనంపుతారని భ‌ట్టి హెచ్చరించారు. ప్రభుత్వం ఒక‌వేళ‌ మొండిగా భూములు అమ్మితే తాము వేలం అడ్డుకుంటామని ఆయ‌న హెచ్చరించారు.

Read More: corona: క‌రోనా వ్యాక్సిన్ వేసుకుంటే మీకు ఎన్ని డిస్కౌంట్లు, ఆఫ‌ర్లు వ‌స్తాయో తెలుసా?

గ‌వ‌ర్న‌ర్ వ‌ద్దే …

అప్పులు ఓ వైపు ప్ర‌భుత్వం భూముల అమ్మకం ఇంకో వైపు చేయ‌డం ద్వారా రాష్ట్రాన్ని దివాలా తీయించడమే ప్ర‌భుత్వ ఉద్దేశ‌మ‌ని భ‌ట్టి ఆరోపించారు. భూముల కొనుగోలుకు ఎవరూ ముందుకు రావొద్దని భ‌ట్టి విక్ర‌మార్క సూచించారు. 2023లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని తెలిపిన భ‌ట్టి ఇప్పుడు కొన్న వారి ద‌గ్గ‌రి నుంచి తీసుకొని ప్రజలకు ఇస్తామని ప్ర‌క‌టించారు. ప్రజల అవసరాల కోసం ప్ర‌భుత్వ‌ ఆస్తులు ఉప‌యోగించాలి కానీ అమ్మకానికి కాదని అన్నారు. అమ్మకానికి పెట్టిన ప్ర‌భుత్వ భూములు, రాష్ట్ర అప్పుల వివరాలు బ‌హిర్గ‌తం చేయాల‌ని గవర్నర్ ను కలిసి కోరుతామ‌ని భ‌ట్టి తెలిపారు.


Share

Related posts

రాజధాని గ్రామాల్లో రైతులు అరెస్టు

Mahesh

Today Horoscope డిసెంబర్ 1st మంగళవారం రాశి ఫలాలు

Sree matha

టీడీపీకి 23 లక్కీ నెంబర్!

Mahesh