ముద్దు ఎంత తీయనో అనే భావనలో విజయ్ దేవరకొండ ఏ మాత్రం అవకాశం దక్కినా హీరోయిన్స్‌తో పెదాలను కలపడానికి వెనక్కాడం లేదు. రీసెంట్గా ఈ యన నటించిన `డియర్ కామ్రేడ్` సినిమా టీజర్ విడుదలైంది. ఇందులో కూడా హీరోయిన్ రష్మికతో లిప్ లాక్ చేశాడు విజయ్ దేవరకొండ. ఈ సీన్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే ఇప్పుడు ఈ ముద్దు కన్నడనాట డియర్ కామ్రేడ్‌కు ఇబ్బందులు తెచ్చేలా కనపడుతున్నాయట. ఎందుకంటే విజయ్‌దేవరకొండతో గీత గోవిందం విడుదల సమయంలోనే.. అప్పటికే ప్రేమించి నిశ్చితార్థం చేసుకున్న కన్నడ హీరో రక్షిత్‌తో రష్మిక తెగదెంపులు చేసుకుంది. రక్షిత్ఫ్యాన్స్ రష్మికపై గుర్రుగానే ఉన్నారు. ఇలాంటి సమయంలో డియర్ కామ్రేడ్ ముద్దు సన్నివేశంలో వారిలో కోపాన్ని మరింత పెంచుతుందట. క్రేజ్ వచ్చింది కాబట్టి రక్షిత్‌ను వదిలేసిందంటూ రక్షిత్ అభిమానులు రష్మికపై సోషల్ మీడియాలో విరుచుకుపడుతున్నారు. లిప్‌లాక్‌తో రష్మిక గీత గోవిందం సమయంలో తరహాలోనే తలనొప్పులు ప్రారంభమయ్యాయట.
previous post
next post