NewsOrbit
మీడియా

సున్నితత్వం లోపించింది

వర్తమాన చరిత్రను పునర్లిఖించమని మీడియా గురజాడలెవరూ  మన ఆధునిక మీడియా ప్రముఖులను కోరిన దాఖలాలు లేవు. అయినా అటువంటి గురుతర బాధ్యతను తమ భుజస్కంధాలపై తెలుగు ఛానళ్లు తమకు తెలియకుండానే మోస్తున్నాయా అని సందేహం కలుగుతోంది. ఏరోజు కారోజు మీడియాలో స్వైరవిహారం చేసే ఏ అంశమైనా పరిశీలించండి, దీనికి సంబంధించిన వార్తలు, వ్యాఖ్యానాలు, విమర్శలూ, హరికథలూ గమనించండి, బోధపడుతుంది.

కడప జిల్లాకు చెందిన వై.ఎస్.వివేకానంద రెడ్డి మరణవార్త చాలా ఉదయమే వెలువడింది. దాని తర్వాత వివిధ ఛానళ్ల వార్తలు, వ్యాఖ్యలు, విశ్లేషణలు చెప్పనలవి కాదు. అప్పటికి ఎన్నికల పోలింగ్ తేదీ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లో శాసనసభ, లోక్‌సభ ఎన్నికలు జరుగుతాయి, తొలివిడత లోనే. ఎక్కువ సమయం లేదు. రాజకీయపార్టీల కార్యాలయాల కన్నా ఛానళ్ల ఆఫీసులలోనే హడావుడి ఎక్కువగా ఉందా అనిపిస్తోంది.

సమాచారం సేకరించి, దానికి సంబంధించి అందుబాటులో ఉన్న వర్తమాన చరిత్రను పరిశీలించి వార్తగా మలుస్తారు. టెలివిజన్‌లో దృశ్యం ప్రధానం. మౌఖిక సమాచారం అనుషంగికం. కనుక కెమెరా ఆధారంగా తయారయిన విశేషాలు ప్రధానంగా ఉండాలి. కెమెరా చెప్పజాలని సంగతులను వాచ్యంగా దృశ్యానికి జోడించాలి. ఇదీ స్థూలంగా టెలివిజన్ జర్నలిజం డిమాడ్ చేసే మేళవింపు. అయితే నడుస్తున్న టెలివిజన్ ఛానళ్ల వార్తల తీరు వ్యవహారం మరోలా ఉంటోంది. కొంత సమాచారం రాగానే దానికి తమ సంస్థ పాలసీకి తగిన ధోరణిలో మిగతా విషయాలు కలిపి కార్యక్రమాలు సాగుతున్నాయి. టివి స్టూడియోలో ఇద్దరుముగ్గురు అంశాల నిపుణులు ఉంటారు. టెలిఫోన్ లైన్‌లో ఛానల్ ప్రతినిధి ఉంటాడు. యాంకర్ చెవిలో ఛానల్  పాలసీ తాలూకూ సూచనలు నిరంతరాయంగా అందుతుంటాయి. అంతే, ఈ పరిమిత వనరులతో పద్దెనిమిది గంటల ప్రసారాన్ని ఒకే వార్తావాహినిగా రూపాంతరం చెందించగలరు.

వారం క్రితం డేటా చోరీ గురించి సాక్షి ఛానల్‌లో ఫోర్త్ ఎస్టేట్ కార్యక్రమం లైవ్ సాగుతోంది. ఈ తతంగం క్షేత్రస్థాయిలో ఎలా ఉంటోంది, ఏ రకంగా ఉపయోగించుకుంటున్నారు అని ఛానల్ యాంకర్ అడిగితే విశాఖపట్నం నుంచి ఒక నాయకుడు సాధికారికంగా సహేతుకంగా వివరిస్తున్నాడు. యాంకర్ అడ్డుతగిలి, పార్టీ మనిషిలా ప్రశ్నలు కురిపించాడు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను అడగాల్సిన ప్రశ్నను ఆయన మీద తోసి ఆయన చెప్పగలిగిన విషయం వెలికిరాకుండా కృషి   చేశాడు. టివి9లో కె.ఎ.పాల్‌ను లైవ్‌లో నాలుగు ప్రశ్నలు ఒకేసారి అడిగి  ఆయన సరిగా నాలుగు మాటాలు మాట్లాడే లోపు మరో రెండు ప్రశ్నలు వేశాడు. కె.ఎ.పాల్ మాట్లాడేది సమ్మతమా, సహేతుకమా అన్నది వేరే విషయం. టిఆర్‌పి కోసం మీరు అతనిని ఆహ్వానించారు. ఆయన తేగల టిఆర్‌పిలు యాంకర్ ఒక్కడే తేలేడు. ఇది గమనించకుండా ఇష్టారాజ్యంగా కార్యక్రమం సాగదీయడం, తమకు లాభం చేకూరుతుందన్న రీతిలో ముందుకు పోగడం ఇప్పుడు అలవాటుగా స్థిరపడిపోతోంది.

సహనం, నమ్రత, జిజ్ఞాస, మానవీయ విలువల పట్ల గౌరవం లేకుండా ఛానళ్లు సున్నితత్వ రాహిత్యంలో తలమునకలవుతున్నాయి.

డా. నాగసూరి వేణుగోపాల్

Related posts

Bigg Boss 7: రతిక రోజ్ గుండెలో ఇంత భారాన్ని మోస్తుందా? ఆ కారణం వల్లే రాహుల్‌తో బ్రేకప్ అయ్యిందా? నిజాలు బయటపెట్టిన పెద్దయ్య!

Raamanjaneya

MS Dhoni: డోనాల్డ్ ట్రంప్ తో ధోని గోల్ఫ్…

Deepak Rajula

ABN Andhra Jyothi: ఏబీఎన్ – ఆంధ్రజ్యోతి సంస్థను కేసిఆర్ సర్కార్ వెలి వేసినట్లేనా..!

sharma somaraju

Mahesh: ఎమోషనల్ అయిన మహేష్‌బాబు పోస్ట్ వైరల్.!

Deepak Rajula

Petrol : కేవలం రు.1/-కే లీట‌ర్ పెట్రోల్‌ దొరకడంతో పోటెత్తిన జనం.. రంగంలోకి పోలీసులు!

Deepak Rajula

Iliyana: టాప్ హీరోయిన్ ఇలియానా సూసైడ్.. కారణాలు తెలిస్తే మైండ్ బ్లాక్!

Deepak Rajula

Sherbet: బ్రిటీష్ వారి నుండి రక్షణ కోసం మొదలెట్టిన షాప్…. ఇప్పుడు కలకత్తా ఫేమస్ ‘పారమౌంట్ షర్బత్’

arun kanna

CJI Ramana: మీడియా తీరుపై హ‌ర్ట‌యిన సీజేఐ ర‌మ‌ణ‌.. సుతిమెత్త‌గా క్లాస్ తీసుకొని…

sridhar

Revanth Reddy: ఇప్పుడుంటుంది అస‌లు మ‌జా… పీసీసీ ర‌థ‌సార‌థిగా రేవంత్‌!

sridhar

Breaking News: మైనర్ బాలిక ప్రేమించడం లేదని నాటు తుపాకీతో కాల్చాడు – చిత్తూరు జిల్లాలో ఘటన..!!

Srinivas Manem

Raghurama krishnamraju: ఖాళీగా ఉండ‌లేక ర‌ఘురామరాజు ఏం చేస్తున్నాడంటే…

sridhar

Corona: వాట్సాప్ తో క‌రోనా టెస్ట్ … ఎంత ఈజీగా చేసుకోవ‌చ్చంటే…

sridhar

Times Indu Jain: మహమ్మారి కాటుతో దేశంలోని మీడియాధిపతి.., కుబేర వనిత కన్నుమూత..!

Srinivas Manem

KCR: బ్రేకింగ్ః తెలంగాణ సీఎం కేసీఆర్‌కు క‌రోనా

sridhar

Tv Debates : మీడియా చర్చల్లో ముష్టియుధ్దాలే మిగిలాయా..!? చానెల్స్ చేసేది ఇదేనా..?

Muraliak

Leave a Comment