తన టాలెంట్ తో టాలీవుడ్ లో మంచి సినిమాలలో అవకాశాలను అందుకుంటూ స్టార్ హీరోయిన్ అవడానికి ప్రయత్నాలు చేస్తోంది నివేదా థామస్. స్కిన్ షో కి, లిప్ లాక్స్ కి దూరంగా ఉంటూనే సక్సస్ లు అందుకుంటోంది. ప్రస్తుతం ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో “వి” అనే సినిమాలో నటించింది. నేచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు, అదితీ రావు హైదరీ ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాలో నివేదా థామస్ సుధీర్ బాబు కి జంటగా నటిస్తుంది. ఈ సినిమాని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్ కి సిద్దంగా ఉంది.
ఇక శ్రీ వెంకటేశ్వర క్రియోషన్స్ బ్యానర్ లో ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాతగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న సినిమా వకీల్ సాబ్. బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. పింక్ సినిమాకి అఫీషియల్ రీమేక్ గా వకీల్ సాబ్ తెరకెక్కుతుండగా… అమితాబ్ బచ్చన్ .. అజిత్.. పోషించిన పాత్రల కంటే ఇంకా పవర్ ఫుల్ లాయర్ గా వకీల్ సాబ్ లో పవన్ కళ్యాణ్ ని చూపించబోతున్నాడు దర్శకుడు వేణు శ్రీరాం.
ఈ సినిమాలో కూడా నివేదా థామస్ ఒక ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తర్వాత నివేదా థామస్ పోషించే పాత్ర బాగా పాపులర్ అవుతుందని చిత్ర యూనిట్ చెబుతున్నారు. ఇక ఈ ఇయర్ ప్రారంభంలో రజనీకాంత్ నటించిన దర్బార్ లోను నటించి మెప్పించింది నివేదా. హీరోయిన్ గా నటిస్తూనే సీనియర్ స్టార్ హీరోల సినిమాలలో పేరొచ్చే ముఖ్య పాత్రలు పోషిస్తుంది. ఇక టాలీవుడ్ లో మరో రెండు సినిమాలలో కూడా నటించబోతుందని వార్తలు వస్తున్నాయి. అయితే నివేదా థామస్ గనక హీరోయిన్ కాకపోయి ఉంటే ఇంత పాపులారిటీని సాధించుకునే దాన్ని కాదని వెల్లడించింది. ఏదో స్కూల్ లో పాఠాలు చెప్పుకుంటూ ఉండేదట. అదృష్టం బావుండి హీరోయిన్ అయి ఇంత ఫేమస్ అయ్యానని లేదంటే నివేదా థామస్ ఎవరో ఎవరికీ తెలిసేది కాదని వెల్లడించింది. ఈ లెక్కన నివేదా కష్టాలు తప్పించుకుందనమాట.