Balakrishna: తమిళ నటి విచిత్ర బాలకృష్ణపై చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. అర్ధరాత్రి తాగి తనని రూమ్ దగ్గరికి రమ్మన్నారని.. వెళ్లకపోతే ఆయనే తన రూమ్ దగ్గరికి వచ్చి తలుపులను గట్టిగ బాదాడు… టార్చర్ చేశాడు అంటూ తమిళ బిగ్ బాస్ హౌస్ లో విచిత్ర సంచలన వ్యాఖ్యలు చేసింది. అంతేకాదు అడవులలో షూటింగ్ జరుగుతున్న సమయంలో తాకరానిచోట పదే పదే తాకుతూ.. అనేక ఇబ్బందులకు గురి చేసాడని.. బాలయ్య పై విచిత్ర కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. విచిత్ర చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ఇండస్ట్రీ పరంగా చర్చనీయాంశంగా మారాయి. దీంతో మామూలుగానే బాలకృష్ణకు మహిళలంటే గౌరవం లేదన్న విమర్శలు వస్తున్నాయి.
అందువల్లే పబ్లిక్ గా మైక్ లో ఆడది కనపడితే కడుపు అయినా చేయాలి ముద్దు అయినా పెట్టాలి అనే వ్యాఖ్యలు అప్పట్లో చేశారని చాలామంది అంటున్నారు. పరిస్థితి ఇలా ఉంటే ఇండస్ట్రీలో హీరోయిన్ల విషయంలో బాలకృష్ణ బాధితురాల లిస్ట్ చాలానే ఉన్నట్లు కొత్త కొత్త వార్తలు ఇప్పుడు బయటపడుతున్నాయి. గతంలో బాలీవుడ్ హీరోయిన్ రాధిక ఆప్టే కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. దక్షిణాది సినిమా ఇండస్ట్రీకి చెందిన ఓ ప్రముఖ హీరో తనని ఇబ్బంది పెట్టాడంటూ బయట పెట్టింది. అయితే సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో రాధిక ఆప్టే తెలుగులో బాలకృష్ణతో ప్రజెంట్ అనే సినిమాలో నటించడం జరిగింది.
దీంతో అప్పట్లో రాధిక ఆప్టే చేసిన వ్యాఖ్యలకు బాలయ్యనే అని అందరూ అనుకున్నారు. బాలయ్య హీరోయిన్ లను టార్చర్ చేస్తాడు అంటూ సోషల్ మీడియాలో అప్పట్లో కూడా వైరల్ చేశారు. దీంతో ఇండస్ట్రీ పరంగా హీరోయిన్ల విషయంలో బాలయ్య టార్చర్ బాధితురాల లిస్ట్ చాలానే ఉందని కామెంట్లు వస్తున్నాయి. ఏది ఏమైనా విచిత్ర… చేసిన వ్యాఖ్యలు బాలకృష్ణ ఇమేజ్ ని భారీగా డామేజ్ చేస్తూ ఉన్నాయి. ఒకపక్క స్టార్ హీరోగా మరోపక్క ఎమ్మెల్యేగా.. ప్రజాక్షేత్రంలో ఉండటంతో.. బాలయ్య పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.