NewsOrbit
న్యూస్ సినిమా

Bheemla nayak: ఛీఫ్ గెస్ట్ గా కె.టి.ఆర్..!

Bheemla nayak: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘భీమ్లానాయక్’. ఈ సినిమా తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుంది. ఫిబ్రవరి 25వ తేదీన భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ మొదలుపెట్టబోతున్నారు. పలు వాయిదాలు పడి ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా మీద ఇప్పటి వరకు వచ్చిన పవన్ కళ్యాణ్, రానాల టీజర్స్‌తో పాటు పాటలు..పోస్టర్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ప్రమోషన్స్ మొదలు పెట్టి ఆ అంచనాలను మరో స్థాయిలో పెంచబోతోంది చిత్రబృందం. ఈ క్రమంలో భారీగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించబోతున్నారు.

ktr is chief guest for bheemla nayak
ktr is chief guest for bheemla nayak

ఈ గ్రాండ్ ఈవెంట్‌కు హైదరాబాద్ పోలీస్ గ్రౌండ్స్ వేదిక కానుంది. అంతేకాదు ఎవరూ ఊహించని విధంగా తెలంగాణ ఐటి మినిస్టర్ కల్వకుంట్ల తారకరామారావు (కె.టి.ఆర్) ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు. కొద్ది సేపటి క్రితం ఈ విషయాన్ని సితార ఎంటర్‌మైంట్స్ వారు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా  భీమ్లానాయక్ పోస్టర్ మీద కె.టి.ఆర్ ఫొటోతో అప్‌డేట్ ఇచ్చారు. ఇక ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఈనె ఫిబ్రవరి 21వ తేది సోమవారం నిర్వహించబోతున్నారు. పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి, నిత్యా మీనన్, సంయుక్త మీనన్‌లతో పాటు ఇతర తారాగణం చిత్రబృందం మొత్తం ఈ ఈవెంట్‌లో సందడి చేయనున్నారు.

Bheemla nayak: మహేశ్ బాబు, ఎస్ ఎస్ రాజమౌళి కూడా..?

అయితే..విశ్వనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం మేరకు ఛీఫ్ గెస్ట్‌గా కె.టి.ఆర్ అలాగే సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కూడా రాబోతున్నట్టు తెలుస్తోంది. మరి ఈ గ్రాండ్ ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్ స్పీచ్ ఎలా ఉంటుందో అని అందరూ ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు. ఇక ఈ ఈవెంట్‌లో సంగీత దర్శకుడు ఎస్ ఎస్ థమన్ లైవ్ మ్యూజికల్ ఈవెంట్ కూడా అదనపు ఆకర్షణగా ఉండబోతుందట. కాగా, ఈ సినిమాను మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుం కోషియం సినిమాకు అధికారికంగా తెలుగులో రీమేక్ చేశారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్,  స్క్రీన్ ప్లే అందివ్వగా, అప్పట్లో ఒకడుండేవాడు ఫేమ్ సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించారు.

Related posts

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?

Brahmamudi May 1 2024 Episode 398: రాజ్ బిడ్డ తల్లిని తెలుసుకునే ప్రయత్నంలో కావ్య. 10లక్షలు తీసుకున్న రాజ్.

bharani jella

ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా గెలిచేందుకు కాదా… ఆమె గేమ్ ప్లాన్ ఇదేనా..?

చిరు ఎంట్రీతో ర‌గులుతోన్న పిఠాపురం… బాబాయ్ కోసం రామ్‌చ‌ర‌ణ్ కూడా ప్ర‌చారం..?

పోలింగ్ బూతుల్లో సీలింగ్ ప్యాన్‌ టీడీపీకి మ‌రో క‌ష్టం వ‌చ్చిందే…?

Nuvvu Nenu Prema May 1 2024 Episode 612: విక్కీ పద్మావతి ల ప్రేమ.. విక్కికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న రాజ్.. కృష్ణ ని తప్పించడానికి దివ్య ఆరాటం..

bharani jella

కొడుకును రెబ‌ల్‌గా పోటీ చేయించుకుంటోన్న వైసీపీ ఎమ్మెల్యే.. ఓట‌మి భ‌యంతోనా ?

Naga Panchami: గరుడ రాజు జ్వాలా గర్భంలోకి ప్రవేశిస్తాడా లేదా.

siddhu

Guppedanta Manasu May 1 2024 Episode 1063: వసుధార మను గురించి శైలేంద్ర చెడ్డగా మాట్లాడాడని వసుధారకు చెబుతాడా మహేంద్ర.

siddhu

Krishna Mukunda Murari May 1 2024 Episode 459: నిజం దాచలేనన్న కృష్ణ.. ఆదర్శ్ కి అబద్దం చెప్పిన ముకుంద.. కృష్ణ సరోగసి నాటకం బయటపడనుందా?

bharani jella

Pawan Kalyan: మే 2న పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ టీజర్…!!

sekhar

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju