RRR: దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ NTR, మెగా వారసుడు రామ్ చరణ్ హీరోలుగా రూపొందిన ఫిక్షనల్ పీరియాడిక్ డ్రామా RRR. 400 కోట్ల రూపాయలకు పైగా భారీ బడ్జెట్తో విజువల్వండర్గా రూపొందిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రాజమౌళి తెరకెక్కించిన సినిమా కావడంతో తెలుగు చిత్రసీమతో పాటు ఇండియన్ సినీ ఇండస్టీ, విదేశాల్లోని సినీ ప్రేమికులందరూ ఈ సినిమా కోసం ఎంతో ఎగ్జయిట్మెంట్తో సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.
RRR: RRR ప్రమోషన్స్ కోసం రాజమౌళి దేన్నీ క్షమించడంలేదు?
RRR: అడ్వాన్స్ బుకింగ్స్ హౌస్ ఫుల్?
5 భాషల్లో మార్చి 25న RRR మూవీ రిలీజ్ అవుతున్న విషయం తెలిసినదే. అంచనాలకు తగ్గట్టుగానే ఈ మూవీ టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఆన్ లైన్ బుకింగ్ ఓపెన్ చేసిన కొన్ని గంటల్లోనే ఇలా టికెట్స్ను ప్రేక్షకులు రిజర్వ్ చేసుకోవడం ఈ మధ్య కాలంలో అయితే జరగలేదు. దీంతో RRR సినిమాపై ఎంత మేరకు ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇక మంగళవారం అనగా ఈరోజుకి బుక్ మై షో హైదరాబాద్లో RRR మూవీ టికెట్స్ ఎక్కడ దొరుకుతున్నాయో! గమనిస్తే కేవలం 2 చోట్ల మాత్రమే RRR టికెట్స్ అవైలబుల్ ఉన్నట్లు తెలుస్తోంది.
RRR: “ఆర్ఆర్ఆర్” హిందీ.. తెలుగు వెర్షన్ కి తేడా ఇదే..!!
ఎక్కడెక్కడంటే?
ఏషియన్ స్వప్న 35 MM థియేటర్లో రాత్రి 9గంటల 15 నిమిషాల షోకు టికెట్స్ దొరుకుతున్నాయి. అలాగే.. కాచిగూడలోని ఏషియన్ తారక్ రామ్ సినీ ప్లెక్స్లోనూ 4 ఆటలకు సంబంధించిన టికెట్స్ దొరుకుతున్నాయి. ఇవి కూడా కొన్ని గంటల్లో అయిపోయే అవకాశం లేకపోలేదు. కనుక మిత్రులారా తొందరగా త్వరపడండి. RRR మూవీకి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ టికెట్ ధరలను భారీగానే పెంచారు. ఏపీలో అత్యధికంగా రూ.325 టికెట్ ధర.. అలాగే తెలంగాణలో అత్యధిక టికెట్ ధర 400గా నిర్ణయించారు.