వరుసపరాజయాలలో ఉన్న విజయ్ దేవరకొండ “లైగర్” పైనే చాలా ఆశలు పెట్టుకోవడం జరిగింది. ఏకంగా ఈ సినిమా షూటింగ్ రెండున్నర సంవత్సరాల పాటు జరగటంతో.. పైగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ సినిమా దర్శకుడు కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఒకపక్క డైరెక్టర్ పూరీకి మరోపక్క హీరో విజయ్ దేవరకొండ కి “లైగర్” ఫస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్. ఆగస్టు 25వ తారీకు ఈ సినిమా విడుదల అవుతున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు భారీ ఎత్తున జరుగుతున్నాయి. శనివారమే గుంటూరులో “లైగర్” ప్రీ రిలీజ్ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. బాగా తాజాగా డైరెక్టర్ పూరీతోపాటు హీరో విజయ్ దేవరకొండ స్పెషల్ ఇంటర్వ్యూ ఇవ్వటం జరిగింది.
ఈ ఇంటర్వ్యూలో “లైగర్” కోసం చాలా శాక్రిఫైజ్ చేసినట్లు విజయ్ దేవరకొండ తెలియజేశారు. సినిమాలో కఠినమైన వర్కౌట్స్ చేసి బాక్సర్ గా కనిపించడం జరిగింది. దీంతో ఆ ఫిజిక్ పోకుండా ఉండటానికి.. ఒకపక్క పాండమిక్ అయినా షూటింగ్ లేకపోయినా గాని .. ఎక్కడ ఫిజిక్ పాడవకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నాను. ఈ క్రమంలో నాకు ఇష్టమైన మందు కూడా తాగటం మానేశాను. ఆల్కహాల్ జోలికి వెళ్లలేదు అంటూ విజయ్ దేవరకొండ షాకింగ్ కామెంట్ చేశారు.
అంతకుముందే ప్రతిరోజు చికెన్ తినాల్సి వచ్చింది. మామూలుగా చికెన్ అంటే ఇష్టం. “లైగర్” కోసం భారీగా వర్కౌట్ చేయటంతో రోజు.. చికెన్ కెనాల్సిన పరిస్థితి ఉండటంతో చికెన్ పైనే చిరాకు వచ్చేసింది. అయినా గాని సినిమా కోసం తినాల్సి వచ్చింది అంటూ చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఏకంగా ఓ ఇంటర్వ్యూలో ఆల్కహాల్ ఇష్టమైన గాని సినిమా కోసం మానేయాల్సి వచ్చింది అని.. విజయ్ దేవరకొండ చెప్పటం సంచలనంగా మారింది.