Veera Simha Reddy: హోస్ట్ గా విజయవంతం కావడంతో బాలకృష్ణకి ఇమేజ్ ఉన్న కొద్ది పెరిగిపోతోంది. హీరోగా మామూలుగానే మాస్ ఫాలోయింగ్ బాలయ్యకి ఎక్కువ అందరికి తెలుసు. ఆయనలో హోస్ట్ కోణం అందరికీ విపరీతంగా నచ్చింది. ఆయనను విమర్శించే వాళ్ళు సైతం అన్ స్టాపబుల్ షో చూసిన తర్వాత మెచ్చుకోక తప్పదు. ఆ రీతిగా విజయవంతంగా రాణిస్తున్నారు. ఈ టాకీ షోలోకీ వచ్చే సినిమా సెలబ్రిటీలను రాజకీయ నాయకులకీ తనదైన శైలిలో ప్రశ్నలు వేస్తూ కామెడీ పండిస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం బాలయ్య డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో “వీరసింహారెడ్డి” అనే సినిమా చేయడం తెలిసిందే.
సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 12వ తారీకు ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి కొన్ని పాటలు రిలీజ్ కావడం జరిగింది. మంచి రెస్పాన్స్ రావడం జరిగింది. బాలయ్య లుక్…కి సంబంధించి రిలీజ్ వీడియోలో డైలాగులు అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో ఇటీవల ఈ సినిమాలో విడుదలైన “మా బావ మనోభావాలు” అనే సాంగ్ యూట్యూబ్ నీ షేక్ చేసేస్తోంది. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అదిరిపోయే మాస్ బిట్స్ అందించాడు. ఏడు మిలియన్ ల వ్యూస్…1.26 లక్షల లైక్స్ ఒక్కరోజులో రావడం సంచలనం సృష్టించింది. యూట్యూబ్లో నెంబర్ వన్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది.
ఈ సాంగ్ లో బాలయ్య మాస్ స్టెప్ లకు ఫాన్స్ ఫిదా అవుతున్నారు. సినిమా రిలీజ్ దగ్గర పడుతూ ఉండటంతో జనవరి ఆరవ తారీకు ఒంగోలులో “వీరసింహారెడ్డి” ప్రీరిలీజ్ వేడుక జరపనున్నట్లు సమాచారం. ఇక అదే రోజు ట్రైలర్ కూడా రిలీజ్ చేయమన్నారు. బాలయ్య కెరియర్ లో భారీ బ్లాక్ బస్టర్ “ఆఖండ” తర్వాత.. ఏడాది గ్యాప్ తర్వాత వస్తున్న ఈ “వీరసింహారెడ్డి” పై అభిమానులు చాలా అంచనాలు పెట్టుకున్నారు. గోపీచంద్ మలినేని… సమరసింహారెడ్డి సినిమాకి రెండు వందల రెట్లు ఈ సినిమా ఉంటుందని.. చెప్పటంతో.. “వీరసింహారెడ్డి” బాక్సాఫీస్ వద్ద ఇటువంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో అనేది ఆసక్తికరంగా మారింది.