NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Neelam Sahni: నిమ్మగడ్డ వెళ్లినా జగన్ కి ఆగని ఎన్నికల కమీషనర్ గండం..!!

petition filed against neelam sahni in high court

Neelam Sahni: నీలం సాహ్ని Neelam Sahni ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదాలో పనిచేశారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆమె పదవీ విరమణ కాలాన్ని కూడా కేంద్రాన్ని విజ్ఞప్తి చేసి రెండుసార్లు పొడిగించారు. మొత్తంగా ఆమె పదవీ విరమణ అనంతరం.. సీఎం జగన్ ఆమె సేవలను మళ్లీ ఉపయోగించుకోవాలని భావించారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నియమించారు. ఆమె ఆ పదవిలోకి వచ్చిన వెంటనే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ నిర్ణయాన్ని హైకోర్టు తప్పుబట్టడమే కాదు.. తీవ్ర వ్యాఖ్యలు చేసి నోటిఫికేషన్ ను కొట్టేసింది. ఈ అంశం రాష్ట్రంలో సంచలనం రేపింది. అయితే.. ఇప్పుడు ఆమె ఎన్నికే తప్పు అంటూ హైకోర్టులో పిల్ దాఖలవడం సంచలనం రేపుతోంది.

petition filed against neelam sahni in high court
petition filed against neelam sahni in high court

ఏపీ ఎన్నికల కమిషనర్ గా ఆమె నియామకాన్ని సవాల్ చేస్తూ జి. రామకృష్ణ పేరుతో పిటిషన్ దాఖలైంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామకానికి సంబంధించి ముగ్గురి పేర్లతో ప్రభుత్వం తయారు చేసిన ప్యానెల్ కూడా రాజ్యాంగ విరుద్ధమైనదిగా ప్రకటించాలంటూ పిటిషనర్ తన పిటిషన్ లో కోరారు. ఈ పిటిషన్ ను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ ఎన్.జయసూర్యలతో కూడిన ధర్మాసనం విచారణకు స్వీకరించింది. పూర్తి వివరాలు అందించేందుకు కొంత గడువివ్వాలని పిటిషన్ తరపు న్యాయవాది కోరారు. దీనిపై ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. పూర్తి వివరాలు లేకుండా పిల్ ఎందుకు వేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. పిల్ వేయడం ఆషామాషీ అయిపోయిందంటూ వ్యాఖ్యానించింది.

Read More: Mp: ‘ఎంపీ’లో టెన్షన్ మొదలైందా..? స్పీకర్ ని కలిసింది అందుకేనా..?

మొత్తానికి న్యాయవాది అభ్యర్ధనతో వచ్చే వారానికి వాయిదా వేసింది. అయితే.. ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ పై సుప్రీంకోర్టు తీర్పు చదవకుండా నోటిఫికేషన్ ఇచ్చారా? సీఎస్ గా చేసిన వ్యక్తికి ఇంగ్లీషు చదవడం వచ్చే ఉంటుంది కదా? అంటూ గతంలో హైకోర్టు చేసిన వ్యాఖ్యలే సంచలనం రేపాయి. ఇప్పుడు ఆమె నియామకంపైనే ఓ పిటిషన్ దాఖలైంది. విజయవంతమైన సీఎస్ గా.. గౌరవప్రదంగా పదవీ విరమణ చేసిన నీలం సాహ్నికి ఇవన్నీ వ్యక్తిగతంగా బాధించేవే. మరోవైపు.. ఎన్నికల కమిషనర్ అయిన తర్వాత జరిగిన పరిణామాలతో ప్రభుత్వ పెద్దల మాటలు వినడంలేదనే వార్తలూ లేకపోలేదు. ఈనేపథ్యంలో ఆమెపై దాఖలైన పిటిషన్ పై హైకోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి.

 

author avatar
Muraliak

Related posts

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N