NewsOrbit
వ్యాఖ్య

అనైక్యుల ప్రగతి

మీరు ఖాళీ ఖాళీ మాటలతో ఎవరితోనూ యుద్ధం చేయలేరు

ఒకరినొకరు అనుమానించుకుంటూనే కౌగలించుకుంటారు

ఒకరినొకరు అవమానించుకుంటూనే సన్మానించుకుంటారు

ఐక్యంగా ఉన్నామంటూనే అనైక్యతకు మహోదాహరణగా వెలిగిపోతారు

పేరుకు ప్రగతి కాముకులే..ఆశయాలు ఆకాశాలు..నినాదాలు పిడుగులు

కానీ రెండు చేతుల్ని కలిపి రెండు చేతుల్లో కత్తులు పట్టుకుంటారు

విచ్ఛన్నకారుల్ని ఎదుర్కోవాలి..విధ్వంసకారుల్ని ఢీకొనాలి

విద్వేషాలను ఉన్మాదాలను నిలువరించడానికి సాహసించాలి

 

మీరు ఖాళీ ఖాళీ ఉపన్యాసాలతో  నిజాయితీగా నిస్వార్థంగా ఒక వేదిక మీద నిలవలేరు

మీ మధ్య లోయలెన్నో..అగాథాలెన్నో..గుప్పెడు పచ్చగడ్డి వేసినా అది ఎంత తొందరలో మండిపోతుందో

తెలియని అమాయకులు ఎవరున్నారిక్కడ?

వంద గ్రూపుల కమ్యూనిస్టులు ఒక్కటయ్యేదెప్పుడు

లక్ష్యం ఒకటే అయినప్పుడు ఇన్ని దారులు దేనికంటే సమాధానం అందేదెప్పుడు

ఒక విప్లవకారుడు ఎన్‌కౌంటరైతే వాడి కులం చూస్తాం

ఒక విప్లవకారుడు జైలు పాలైతే వాడి కులం మన హృదయోద్రేకాల సరిహద్దులు నిర్ణయిస్తుంది

పేరుకంతా అంబేద్కరిస్టులే దళితుల్లోనే వంద గ్రూపులు

బీసీలు ఎస్సీలను నమ్మరు..ఎస్సీలు వాటాల వంతులకాడకొస్తే నిలువునా చీలిపోతారు

తోడబుట్టినవాడు వాటా అడిగితే వర్గీకరణ ఒక భయంకర కుట్ర అని వాపోతారు

శత్రువు తన వర్గానికి ఎంత మేలు చేశాడో ఎలా చేశాడో చెప్పగలం

మన జాతికి మనమేం చేస్తున్నామో చెప్పలేం

రాజ్యాంగపు ఫలాలు ఇంకా అందని సొంత జాతి వారికి వాటిని అందించే ఎజెండా లేనివాళ్ళు

సొంతలాభం కొంతైనా వీడలేని వారు

ఖాళీ ఖాళీ సభలతో సన్మానాలతో తీర్మానాలతో ఒక జాతిని ఉద్ధరించరు

ఎక్కడో ఎవడో ఆత్మహత్య చేసుకుంటాడు మరోచోట ఎవరో దాడికి గురవుతారు

కొండొకచో ఆత్మగౌరవం నడిరోడ్డు మీద దగ్ధమవుతుంది

ఒకే నోటితో అంతా అయ్యో అంటారు పెద్ద కెరటంలా పైకి లేస్తారు అంతే వేగంగా నేలకరుస్తారు

కులాల లెక్కలు లేకుండా ఏ స్పందనలూ లేని ఏ ఆగ్రహాలూ పుట్టని ఏ ఉద్యమాలూ లేవని

డొంకతిరుగుడు సందర్భాల్లో సమయాల్లో ఉన్నాం

 

మనం ఖాళీ ఖాళీ నిరసనలతో నినాదాలతో ఎవరితోనూ యుద్ధం చేయలేం

ఒళ్ళంతా విషపు కోరలు మొలిచిన శత్రవు విరుచుకుపడుతున్నాడు

నువ్వు ముట్టుకుంటే నేను మైలపడతానని దేవుడింకా అంటున్నాడంటే

ఆ దేవుణ్ణి రహదారి మీద దగ్ధం చేసే తెగువ కావాలి

నువ్వు నాకిష్టమైందే మాట్లాడు అని ఎవడైనా ఆదేశిస్తున్నాడంటే

వాడిని పిడికిళ్ళ మీద ఎత్తి ఖండాలకవతలకి విసిరేసే దమ్ము కావాలి

నా దేవుడికే నువ్వు జైకొట్టు అని ఎవరైనా ఇంకా హూంకరిస్తున్నారంటే

వాడినీ వాడి దేవుడినీ సప్తసముద్రాల్లో ముంచి నీటితోనే దహనసంస్కారం చేసే ధైర్యం కావాలి

 

మీరు ఉత్తుత్తి కల్లబొల్లి నంగనాచి పోరు పాటలతో ఎవరినీ ఎదిరించలేరు

సమసమాజం కోసం కలలు కంటూనే

మీరెంత అసమ గోళాలుగా గింగిరాలు కొడుతున్నారో మీ శత్రువుకి తెలుసు

మీరు చెప్పే ప్రగతి..మీరు వాదించే ఐక్యత..మీరు ఆశించే లక్ష్యం

మీలో అతికొద్దిమంది భావప్రాప్తితో అణగారిపోవడం చారిత్రక విషాదం

 

మీరు మీ ప్రవచనాలతో..మీ బోధనలతో..మీ స్వీయ కాంక్షా తోరణాలతో

ఏ విప్లవాలూ సాధించలేరు

తలాక్ తలాక్ అంటూ కాశ్మీర్ కాశ్మీర్ అంటూ రామ రామ అంటూ మందిరం మందిరం అంటూ

చివరికి మీ రిజర్వేషన్లు కాకులకూ గద్దలకూ వేసి అన్నీ మూసుకోని పడుకొమ్మంటాడు వాడు

ఎవరి ఒంటి మీద గాట్లు వారు చూసుకుంటూ తెలివితెచ్చుకునే లోగానే విషం మింగేస్తుంది

అప్పుడేం  చేస్తారు?

మీ ఖాళీ ఖాళీ చేతులతో గొంతులతో కాళ్ళతో కలలతో మీరు చివరకు మీలోని లోపాలతో కూడా యుద్ధం చేయలేరు..ఐదేళ్ళకోసారి ఓటు మాత్రం వేస్తారు.

– డా. ప్రసాదమూర్తి

Related posts

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Kia sonet: అతి తక్కువ ధరలో ఇండియాలో లాంచ్ అయిన కియా సోనెట్ కార్.. ఫెసిబిలిటీస్ ఇవే..!

Saranya Koduri

Oscar 2024: కొత్త సంవత్సరంలో ఆస్కార్ గెలుచుకోవడానికి సిద్ధమైన ఇండియన్ 12 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Allu Arjun: బన్నీ కి భారీ షాక్ ఇచ్చిన శ్రీ లీల… ఫుల్ గా ఏకేస్తున్న ఫ్యాన్స్..!

Saranya Koduri

Venkatesh: వెంకీ మామా ఏంటి నీకు ఈ ఘోర అవ‌మానం… ఎంత పెద్ద త‌ప్పు చేశావ్‌..!

Saranya Koduri

Charmi: ” నీ హగ్గులు, లవ్ చాలా మిస్ అవుతున్నా.. తిరిగి మళ్లీ నా లైఫ్ లోకి రా “.. చార్మి సెన్సేషనల్ పోస్ట్..!

Saranya Koduri

Chiranjeevi: చిరు ఫామ్ హౌస్ ఖరీదు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే… సీఎం కి కూడా ఈ రేంజ్ ఉండదేమో..!

Saranya Koduri

Balakrishna: బాల‌య్య ప‌క్క‌న ఆ హీరోయిన్… ప‌ర్‌ఫెక్ట్ ఫిగ‌ర్రా బాబు..!

Saranya Koduri

Junior NTR: నందమూరి ఫ్యామిలీ తారక్ ని అందుకే దూరం పెడుతుందా.. బయటపడ్డ అసలు నిజం..!

Saranya Koduri

Chiranjeevi: ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సినిమా వదులుకున్న చిరు.. ఎందుకో తెలుసా..!

Saranya Koduri

Samantha: జీవితంలో అతిపెద్ద తప్పు చేశాను అంటూ మరోసారి తన ఆవేదనను బయటపెట్టిన సమంత..!

Saranya Koduri

నీ ఓటు…మన ఓటు…ప్రతి ఓటు

Deepak Rajula

Google Discover: గూగుల్ డిస్కవర్ లో పొలిటికల్ కంటెంట్ అంతా రాజకీయ నాయకుల న్యూస్ మీడియా దే…ఎన్నికల తరుణం లో అక్కడా ఇక్కడా వీరే!

Deepak Rajula

ఎల్లో జర్నలిజం నడుమ జాతీయ పత్రికా దినోత్సవం…పత్రికా స్వేచ్ఛ ఒక భ్రమ

Deepak Rajula

TDP ChandraBabu: కార్యకర్తలపై కేసులు.. బాబోరీ వెరైటీ కూతలు..!!

sekhar

Leave a Comment