మొన్న మేము మా అమ్మాయి ఇంటికి మలేసియా టౌన్ షిప్కి వెళ్ళేం.
మా మనవడు డ్రైవ్ చేస్తున్నాడు
చుట్టూ తవ్వేసిన కొండలు మధ్యలో కాంప్లెక్స్‌లు
ఎన్ని అంతస్థులో చెయ్యిపెడితే ఆకాశం అందుతుంది అన్నట్టు ఉన్నాయి
ఏవిట్రా ఇవి అడిగేను
ఓన్లీ ట్వంటీ ఫైవ్ ఫ్లోర్లు
పోనీ అవి ఏమన్నా దిట్టంగా ఉంటున్నాయా
కొన్నేళ్ళ కిందట పంజాగుట్టలో గ్రౌండ్ ఫ్లోర్ భూమిలోకి దిగిపోయింది
ఎందుకో తెలుసా
అడుగున గుల్ల
ఇప్పుడు ఓసారి గతం చెప్పక తప్పదు
కొన్నేళ్ళ కిందట కాళహస్తిలో గోపురం కూలిపోయింది
దాని పునాదులు చూసి మనవాళ్ళకి నోట మాట రాలేదు
నాలుగడుగులు కూడా లేదు
అది కట్టి నాలుగు వందల యేళ్ళు ఐంది
అప్పుడు సిమెంట్ వగైరాలు లేవు కేవలం రాళ్లు ఇసక బెల్లంతో కట్టేరు
అందుకే అప్పటి కట్టడాలు ఇంకా ఉన్నాయి
ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది
నాణ్యత తగ్గింది
మెట్రో ప్రారంభించి ఎన్నాళ్ళు ఐంది
అప్పుడే పెచ్చులు ఊడిపోతున్నాయి
మన ఇంజనీర్లు అమెరికాలో చదివి వస్తున్నారు
ఎక్కడుంది లోపం
డబ్బులో ఉంది
నాసిరకం వాడితే పడవా
చెరువులు పూడ్చి కట్టేస్తే ఏవౌతుంది
ఇప్పుడు మనం ఉన్న కాంప్లెక్స్ ఒకప్పుడు చెరువు
ఎదురుగా ఉన్న ఇమేజ్ హాస్పిటల్ చెరువు
అందుకే వానపడితే నీరంతా కంప్లెక్స్లోనే వుంటుంది
అంత ఎత్తులో ఉంటే ఎండకి మాడిపోరూ
పైవాడికి కిందికి చూస్తే కళ్ళు తిరగవూ
నీకు ధర చూస్తే కళ్ళు తిరుగుతాయి నాలుగు కోట్లు మాత్రవే కొంటావా
నోర్ముయ్య్ అన్నికోట్లు ఎలా వస్తాయి
మన డబ్బే
ఇప్పటికి మన దారిద్రశాతం ఎనభై ఉంది
అంటే ఈ ఎనభై మందికి ఇరవైమంది కష్టపడి డబ్బు ఇస్తున్నారు
One man’s gain is another man’s loss
అసలు ఇంతింత కట్టడానికి యెంత నీరు కావాలి
భూమిలో ఉన్న నీరంతా తోడేస్తున్నారు
మరోవైపు పిల్లర్లతో జల్లెడలాగా కన్నాలు పెట్టేస్తున్నారు
మార్బల్కి గ్రానైట్‌కి తవ్వేస్తున్నారు
కొండలు కొట్టి కంప్లెక్స్‌లు కడుతున్నారు
అడవులు కూడా ఉంచడం లేదు
మళ్ళీ పర్యావరణం అని ఉపన్యాసాలు
ఆమధ్య పాము పుట్టలు తవ్వి ఇల్లు కట్టేస్తే పాములు ఉరిలోకి వచ్చేసేయి
చిరుతలు ఊరిలోకి వస్తున్నాయి
మరి వాటిని ఉండనిస్తే కదా
మనిషంత స్వార్ధపరుడు ఎవడూ ఉండదు
ఇలా భూమిని గుల్ల చేస్తూ పొతే కొన్నేళ్ళకి మనకి భూమి మిగలదు
కూర్చున్న కొమ్మని నరుకుతున్నట్టే
ఇప్పటికైనా కాంప్లెక్స్‌లు ఆపితే కొంత బాగుపడుతుంది
జనాభా పెరుగుతోంది అన్నది ఒకసాకు
వలసలు వచ్చేస్తున్నారు అంటారు
వలసలు వచ్చేది పల్లెల్లో పనులు లేనివాళ్లు
వాళ్ళకి అపార్టుమెంట్లు అక్కర్లేదు
గుడారాలు వేసుకొని బస్తీల్లో ఉంటున్నారు
మీకు డబ్బు ఎక్కువైపోతే చక్కగా ఓ పల్లెని బాగుచెయ్యండి
పీహెచ్‌సీలు కూడా లేని ఊర్లు ఎన్నో ఉన్నాయి
నీరు లేని ఊర్లు చాలా ఉన్నాయి
ఇవన్నీ వాళ్ళకి ఇస్తే మీ పేరు చెప్పుకుంటారు
డబ్బు శాశ్వతం కాదు
పేరు శాశ్వతం
మనం బావుంటే చాలదు
మిగిలినవాళ్లు కూడా బావుండాలి
అప్పుడే దేశం బావుంటుంది
ఏమంటారు
బీనా దేవి
ఎల్లో జర్నలిజం నడుమ జాతీయ పత్రికా దినోత్సవం…పత్రికా స్వేచ్ఛ ఒక భ్రమ