NewsOrbit
వ్యాఖ్య

“లలిత” సంగీతం!

 

కొందరికి కొన్నిపేర్లు అతికినట్లు సరిపోతాయి. అలాంటివాళ్లలో భావరాజు లలిత ఒకరు. ఇటీవలే కన్నుమూసిన లలిత మాట లలితం- నవ్వు లలితం- పలకరింపు లలిత లలితం- ఆవిడకి ఇష్టమైన సంగీతమూ లలితమే! దాదాపు మూడున్నర దశాబ్దాలు జర్నలిజంలో గడిపినప్పటికీ లలితలో సినిసిజం ఏ కోశానా కనిపించేది కాదు. మనుషుల్ని -కుల, మత, ప్రాంతీయ, జాతీయ ప్రమాణాలకు అతీతంగా – ఉన్నవాళ్ళని ఉన్నట్లు ప్రేమించే విద్యలో లలిత వైదుష్యం సంపాదించారు. తల్లినీ, తండ్రినీ, తోబుట్టువులనూ, పెళ్ళయ్యాకా భర్తనూ, ఆతర్వాత కూతుర్నీ, ఆమె పెళ్లాడిన వాణ్ణీ ప్రేమించడంలో వింతేముందీ? కాస్తంత ముఖపరిచయం ఉన్నవాళ్లనూ అంతే అభిమానంతో ఆదరించడం లలిత ప్రత్యేకత!
1985 వేసవిలో ఓ ఇరవై ముప్ఫయిమంది జర్నలిస్టులం, పొట్టచేతపట్టుకుని హైదరాబాద్ నుంచి విశాఖ పట్నం బయల్దేరి వెళ్లాం. వాళ్లలో సగం మంది తెలుగు జర్నలిస్టులు- మిగతా వాళ్ళు తెలుగువాళ్లే అయినప్పటికీ ఇంగ్లిష్ జర్నలిస్టులు. మాలో లలిత ఒకరు. ఆమె ఇంగ్లిష్ జర్నలిస్టు- మేము తెలుగు పాత్రికేయులం! ఒకే హాల్లో పని చేసుకునే వాళ్ళం కానీ, పరస్పరం కనిపించని గోడలు ఉండేవి. మాలో కొద్దిమంది ఇంగ్లిష్ బాగా వచ్చిన వాళ్ళూ ఉండేవారు. వాళ్ళతో సహా ఎవరికీ ఇంగ్లిష్ జర్నలిస్టులతో పెద్ద చనువు ఉండేది కాదు. కారణం తెలీదు కానీ మా తరం తెలుగు జర్నలిస్టులకు ఇంగ్లిష్ పాత్రికేయుల మీద సదభిప్రాయం కొంచెం తక్కువే. ఒక కారణం వాళ్లలో ఎక్కువమంది “జింగ్ బాంగ్” స్టైల్ ప్రదర్శించడం అయివుండొచ్చు. మా వాళ్లలో కొందరు 27 టేకుల ఏపీ కాపీని సునాయాసంగా అనువాదం చేసి బ్యానర్ సిద్ధం చెయ్యగలిగే వాళ్ళు. కానీ ఒక్క ఇంగ్లిష్ వాక్యం మాట్లాడ్డానికి వాళ్లకి గొంతు పట్టుకునేది. అలాంటి వాళ్ళతో లలిత సరళమైన తెలుగులో మాట్లాడి జంకు పోగొట్టేవారు. మేం తెలుగు పత్రిక కోసం సిద్ధం చేసుకున్న స్టోరీస్ ఇంగ్లీషులో కూడా వాడుకునే వాళ్ళు. మేమూ అదేపని చేసేవాళ్ళం. విశాఖపట్నం గురించి బాగా తెలిసిన ఓ సీనియర్ జర్నలిస్టు లాంచింగ్‌కి రెండు రోజుల ముందొచ్చి పుంఖానుపుంఖాలుగా స్టోరీస్ ఇంగ్లీషులోనే ఫైల్ చేశారు. వాటిని మేం -తెలుగు వాళ్ళం- ఉపయోగించుకున్నంతగా ఆంగ్లేయులు ఉపయోగించుకోలేక పోయారు. ఆ విషయమే ఓ రోజు లలితతో అన్నాను నేను. ఆమె లలితంగా నవ్వి  “అది మీ అదృష్టం! ఇది మాదురద్రుష్టం!!” అన్నారు. “అంత మాటెందుకు లెండి….” అని నేను కొట్టిపారేయబోతే అప్పుడు ఓ విషయం చెప్పారావిడ. లలిత చక్కని తెలుగు మాట్లాడేవారు గానీ ఆవిడకి తెలుగు చదవడం రాదు. తెలుగులో పనిచేసే హైదరాబాదీ జర్నలిస్టులతో లలిత హిందీలో హాయిగా మాట్లాడేవారు. ఆమెకి తెలుగు రాకపోవడమేంటా అని నేను కొంచెం ఆశ్చర్య పోయా! తర్వాత తెలిసింది- ఆమె బాల్యం ఉత్తరాది రాష్ట్రాల్లో గడిచిందని!!
విశాఖ నుంచి ఉద్యోగరీత్యా మద్రాసు వెళ్లిన తర్వాత ఓ శుభ వార్త -కాస్త ఆలశ్యంగా- అందింది నాకు. నా ప్రియమిత్రుడు సాంబుణ్ణి ఆమె పెళ్లాడారు. లలితది ఓ కులం- సాంబుడిది మరో కులం! పుట్టబోయే పిల్లలకు పెళ్లిళ్లు అవుతాయా కావా అనే బెంగ వాళ్లకి ఏ కోశానా ఉండేది కాదు. ఆమెకి తెలుగు చదవడమే రాదు- మా వాడు కెరీర్ ఆంతా తెలుగు పత్రికలోనే గడిపేశాడు. కానీ వాళ్ళిద్దరి మధ్యా అదో పెద్ద విషయం కాలేదు ఎప్పుడూ! లలిత వివిధ భారతికి మహారాజ పోషకురాలు- సాంబుడి సంగీత ప్రియత్వం ఔరంగజీబ్‌కు అటూఇటుగా ఉండేది. అది కూడా పెద్ద విషయం కాలేదెప్పుడూ! ఆమె తల్లితండ్రులు కోస్తా ప్రాంతం వాళ్ళు- సాంబుడు తెలంగాణ బిడ్డ. పనికిమాలిన ప్రాంతీయ వైషమ్యం వాళ్ళ మధ్యన చొరబడలేకపోయింది! ఏటికి ఎదురీదడానికి సిద్ధపడే వాళ్ళు నినాదభరితమయిన భాషలో ప్రసంగించ వలసిన అవసరం లేదనీ, నిండు నదిలా, నిశ్శబ్దంగా సాగిపోవచ్చుననీ లలిత రుజువు చేశారు!
ఒక్క విషయంలో మాత్రం వాళ్లిద్దరూ ఒకేలా ఉండేవాళ్ళు. ఇద్దరూ సౌమ్యతకి పెట్టింది పేర్లు! నా లాంటి అమితభాషులకి చెవులప్పగించి వినే మితభాషులే ఇద్దరూనూ! స్నేహానికి వాళ్ళిచ్చే విలువ ఏంటో అది అనుభవించినవాళ్లకే తెలుస్తుంది.
లలిత లాంటి మనుషుల గురించి ఆలోచించినప్పుడు ఒక విషయం తట్టి బాధ కలుగుతుంది. ప్రస్తుతం మం సమాజంలో బలిసిపోతున్న అసహనం ఆమెలో అణువంత కూడా కనిపించలేదు ఎప్పుడూ! ఇలాంటి పాడుకాలంలో అలాంటి మంచిమనుషులు మాయమైపోవడం కన్నా విషాదం ఏముంటుంది?

-మందలపర్తి కిషోర్

 

Related posts

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Kia sonet: అతి తక్కువ ధరలో ఇండియాలో లాంచ్ అయిన కియా సోనెట్ కార్.. ఫెసిబిలిటీస్ ఇవే..!

Saranya Koduri

Oscar 2024: కొత్త సంవత్సరంలో ఆస్కార్ గెలుచుకోవడానికి సిద్ధమైన ఇండియన్ 12 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Allu Arjun: బన్నీ కి భారీ షాక్ ఇచ్చిన శ్రీ లీల… ఫుల్ గా ఏకేస్తున్న ఫ్యాన్స్..!

Saranya Koduri

Venkatesh: వెంకీ మామా ఏంటి నీకు ఈ ఘోర అవ‌మానం… ఎంత పెద్ద త‌ప్పు చేశావ్‌..!

Saranya Koduri

Charmi: ” నీ హగ్గులు, లవ్ చాలా మిస్ అవుతున్నా.. తిరిగి మళ్లీ నా లైఫ్ లోకి రా “.. చార్మి సెన్సేషనల్ పోస్ట్..!

Saranya Koduri

Chiranjeevi: చిరు ఫామ్ హౌస్ ఖరీదు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే… సీఎం కి కూడా ఈ రేంజ్ ఉండదేమో..!

Saranya Koduri

Balakrishna: బాల‌య్య ప‌క్క‌న ఆ హీరోయిన్… ప‌ర్‌ఫెక్ట్ ఫిగ‌ర్రా బాబు..!

Saranya Koduri

Junior NTR: నందమూరి ఫ్యామిలీ తారక్ ని అందుకే దూరం పెడుతుందా.. బయటపడ్డ అసలు నిజం..!

Saranya Koduri

Chiranjeevi: ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సినిమా వదులుకున్న చిరు.. ఎందుకో తెలుసా..!

Saranya Koduri

Samantha: జీవితంలో అతిపెద్ద తప్పు చేశాను అంటూ మరోసారి తన ఆవేదనను బయటపెట్టిన సమంత..!

Saranya Koduri

నీ ఓటు…మన ఓటు…ప్రతి ఓటు

Deepak Rajula

Google Discover: గూగుల్ డిస్కవర్ లో పొలిటికల్ కంటెంట్ అంతా రాజకీయ నాయకుల న్యూస్ మీడియా దే…ఎన్నికల తరుణం లో అక్కడా ఇక్కడా వీరే!

Deepak Rajula

ఎల్లో జర్నలిజం నడుమ జాతీయ పత్రికా దినోత్సవం…పత్రికా స్వేచ్ఛ ఒక భ్రమ

Deepak Rajula

TDP ChandraBabu: కార్యకర్తలపై కేసులు.. బాబోరీ వెరైటీ కూతలు..!!

sekhar

Leave a Comment