NewsOrbit
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Telangana Congress: టీపీసీసీ చీఫ్ ఎంపిక..! అధిష్టానం ఆలోచిస్తోందా.. భయపడుతోందా..?

congress dilemma for tpcc chief selection

Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్ Telangana Congress ‘దేశంలో కాంగ్రెస్ నందు తెలంగాణ కాంగ్రెస్ వేరయా..’ అని కొత్తగా రాజకీయ సామెత రాసుకోవాలేమో. చూస్తుంటే అలానే ఉంది పరిస్థితి. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్.. అని నేతలు ఎంతగా గొంతెత్తి.. ఎలుగెత్తి చాటినా తెలంగాణ ప్రజల చెవికెక్కలేదు. 2014లో ఉమ్మడి ఏపీ నుంచి తెలంగాణ ఇచ్చిన అప్పటి కాంగ్రెస్ పార్టీ.. దేశంలో, ఏపీలో, తెలంగాణలో ఆదరణ కోల్పోయింది. ఏపీలో పరిస్థితి కాంగ్రెస్ కు తెలిసిపోయింది. కానీ.. తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితే అర్ధం కాకుండా ఉంది. ఇందుకు ఉదాహరణ టీపీసీసీ ప్రెసిడెంట్ ఎంపిక. ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా తర్వాత పగ్గాలు చేపట్టే నాయకుడి అన్వేషణ సుదీర్ఘంగా కొనసాగుతూనే ఉంది. దీంతో కాంగ్రెస్ శ్రేణుల్లో నిరుత్సాహం నెలకొంది.

congress dilemma for tpcc chief selection
congress dilemma for tpcc chief selection

నిజానికి తెలంగాణ కాంగ్రెస్ లో పేరున్న నాయకులు కొంతమందే ఉన్నారు. ఉన్న నాయకుల్లో పెద్దోళ్లే చాలామంది టీఆర్ఎస్ కు వెళ్లిపోయారు. మిగిలిన నాయకత్వంలో యూనిటీ లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో అధిష్టానంకు టీపీసీసీ అధ్యక్షుడి ఎన్నిక తలనొప్పిగా మారింది. టీడీపీ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి ఆ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. గత ఫిబ్రవరిలో దాదాపు ఆయన పేరు ఖరారైందనే వార్తలు వచ్చాయి. అయితే.. సీనియర్లు తలోమాట తమ అభిప్రాయంగా చెప్పేసరికి పార్టీ సీనియర్లను కాదని రేవంత్ వైపు వెళ్లలేక ఇష్యూ సైలెంట్ అయిపోయింది. సాగర్ ఉప ఎన్నిక తర్వాతనైనా అధ్యక్షుడి ఎంపిక ఉంటుందని భావిస్తే అదీ జరగలేదు. మరికొన్నాళ్లు ఆగాల్సిందే అని అధిష్టానం సూచించినట్టు తెలుస్తోంది.

Read More: Etala Rajender: ఈటల చేరికను బీజేపీ లైట్ తీసుకుందా? అమిత్ షా, నడ్డా లేరెందుకు?

రేవంత్ రెడ్డితో సహా.. సీనియర్లు కొందరు ఢిల్లీలో మకాం వేసినా ఫలితం లేకపోయిందని తెలుస్తోంది. మొన్నటి కేరళ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతే పీసీసీ చీఫ్ ను మార్చేశారు. కానీ.,. తెలంగాణలో మాత్రం ఆలోచిస్తున్నారు. అసలే పార్టీ పరిస్థతి బాగాలేని సమయంలో అంతో ఇంతో ఉనికి ఉన్న తెలంగాణ విషయంలో ఎవరూ హర్ట్ కాకుండా నిర్ణయం తీసుకోవాలనేది అధిష్టానం ఆలోచనగా తెలుస్తోంది. సీనియర్లను కాదని రేవంత్ ఇవ్వలేక.. రేవంత్ వాయిస్ కాదనుకోలేక ఢిల్లీలో నేతలు మల్లగుల్లాలు పడుతున్నారని అంటున్నారు. అందుకే.. మరికొంత కాలం వేచి చూసే ధోరణిలో అధిష్టానం ఉన్నట్టు సమాచారం. మరి.. తెలంగాణలో కాంగ్రెస్ పగ్గాలు అందుకుని పార్టీని ముందుకు నడిపేది ఎవరో.. వేచి చూడాల్సిందే.

 

 

author avatar
Muraliak

Related posts

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju