NewsOrbit
రాజ‌కీయాలు

‘రాజధాని తరలింపు సాధ్యం కాదు’

(న్యూస్ ఆర్బిట్ డెస్క్)

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని తరలింపు అంశం జగన్ ప్రభుత్వ పరిధిలో లేదనీ, ప్రజలను గందరగోళ పరిచేందుకే సిఎం మంత్రులు ప్రకటనలు చేస్తున్నారనీ టిడిపి లోక్‌సభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అమరావతిలో హైకోర్టు ఏర్పాటు చేయాలని గతంలోనే నోటిఫికేషన్ ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడు కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తామన్న జగన్ ప్రకటన చట్ట విరుద్ధమని అయన అన్నారు.

హైకోర్టు అమరావతి నుండి తరలించడం ఎవరికీ సాధ్యం కాదని స్పష్టం చేశారు. వైసిపి ప్రభుత్వం నియంతృత్వ విధానాలతో ప్రజల జీవితాలతో ఆటలాడుతోందని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన నిర్ణయాలను పునః సమీక్షించుకోవాలని కనకమేడల సూచించారు. అసలు జిఎస్ రావు కమిటీకి చట్టబద్ధత ఏమిటని ప్రశ్నించారు. అయిదు కోట్ల మంది ప్రజలతో చెలగాటం ఆడేలా జిఎన్ రావు కమిటీ నివేదిక ఉందని ఆయన విమర్శించారు.

బోస్టన్ కమిటీ ఎప్పుడు వేశారో ఎవరికీ తెలియదని అన్నారు. ఇప్పుడు కొత్తగా హైపవర్ కమిటీని వేశారన్నారు. హైపవర్ కమిటీ ఇంత వరకూ సమావేశం జరపలేదు కానీ కమిటీ సభ్యులు మాత్రం ఎవరికి వారు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారనీ ఆయన ఆరోపించారు. ప్రభుత్వం ఇప్పటి వరకూ వేసిన కమిటీలకు చట్టబద్దత ఉన్నదా అని కనకమేడల ప్రశ్నించారు. ప్రభుత్వం ఇటువంటి చర్యలు తీసుకోవడం వల్ల అభాసుపాలు అవుతుందని ఆయన అన్నారు.

Related posts

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Leave a Comment