NewsOrbit
రివ్యూలు

రివ్యూ

 

గత ఏడాది ప్రేమలో విఫలమైన యువకుడి మనోవేదనకు అద్దం పట్టేలా తెరకెక్కిన చిత్రం ‘ఆర్‌.ఎక్స్‌ 100’ విడుదలైంది. ఘన విజయం సాధించింది. దాంట్లో మోసపోయిన ప్రేమికుడిగా నటించి ఆకట్టుకున్నాడు హీరో కార్తికేయ. తన నటనతో తొలిసినిమాతోనే మెప్పించిన కార్తికేయ ‘హిప్పీ’ అనే సినిమాను అనౌన్స్‌ చేయడంతో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఆసక్తికరమైన విషయమేమంటే తమిళ దర్శకుడు టి.ఎన్‌.కృష్ణ, నిర్మాత కలైపులి థాను తెలుగులో సినిమా చేయడం. రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన హిప్పీ ప్రేక్షకులను ఏ మేర ఆకట్టుకుందో తెలుసుకోవాలంటే సినిమా కథలోకి వెళదాం.

నిర్మాణ సంస్థ: వి క్రియేషన్స్‌
తారాగణం: కార్తికేయ, దిగంగన సూర్యవన్షీ, జెజ్‌బా సింగ్‌, జె.డి.చక్రవర్తి, వెన్నెలకిషోర్‌, బ్రహ్మాజీ, సుదర్శన్‌, శ్రద్ధాదాస్‌ తదితరులు
ఆర్ట్‌: మిలన్‌ ఫెర్నాండేజ్‌
మాటలు: టి.ఎన్‌.కృష్ణ, కాశీ నడింపల్లి
ఎడిటర్‌: ప్రవీణ్‌ కె.ఎల్‌
సంగీతం: నివాస్‌.కె.ప్రసన్న
సినిమాటోగ్రాఫర్‌: ఆర్‌.డి.రాజశేఖర్‌
నిర్మాత: కలైపులి థాను
దర్శకత్వం: టి.ఎన్‌.కృష్ణ

కథ:
హిప్పీ(కార్తికేయ) పెద్ద బిల్డింగ్‌ పైనుండి దూకి ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడు. హిప్పీ బావ(బ్రహ్మాజీ), స్నేహితులు చెప్పినా వినిపించుకోడు. లవర్‌ ఆముక్త మాల్యద(దిగంగన సూర్యవన్షీ) చెప్పగానే వెంటనే దిగిపోతాడు. అసలు హిప్పీ ఆత్మహత్య చేసుకోవాలనుకోవడానికి కారణం ఆముక్త మాల్యదే కారణం. అప్పటి వరకు ఎలా పడితే అలా ఉంటూ, ప్లేబోయ్‌గా, కిక్‌బాక్సర్‌గా జీవితాన్నిఎంజాయ్‌ చేస్తుంటాడు హిప్పీ. ఆముక్తను చూసి ఆమెతో ప్రేమలో పడతాడు. కానీ అప్పటికే హిప్పీ ఆముక్త స్నేహితురాలు స్నేహ(జెజ్‌బా సింగ్‌)తో ప్రేమలోఉంటాడు. ఫ్రెండ్‌ లవర్‌ను ప్రేమించడం తప్పనే భావంతో ఆముక్త, హిప్పీని దూరంగా పెడుతుంది. అయితే హిప్పీ తననే మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాడని, స్నేహ ద్వారానే తెలుసుకుని అతని దగ్గరవుతుంది. అయితే తన లవర్‌ను కంట్రోల్‌ను పెట్టుకోవాలనుకుంటుంది. దాన్ని ఇబ్బందిగా ఫీలైన హిప్పీ బ్రేకప్‌ అయిపోవాలనుకున్నా, ఆముక్త వినకుండా అతనితో లివ్‌ ఇన్‌ రిలేషన్‌ షిప్‌ స్టార్ట్‌ చేస్తుంది. చివరకు కొన్ని కారణాలతో ఇద్దరూ విడిపోతారు. చివరకు ఆముక్త తన బాస్‌(జె.డి.చక్రవర్తి)నే పెళ్లి చేసుకోవాలనుకుంటుందని తెలుస్తుంది. అయితే ఆముక్త, హిప్పీ ప్రేమ వ్యవహారం తెలుసుకున్న జె.డి.చక్రవర్తి ఇద్దరి మధ్య ఎలాంటి ప్రేమ లేదని ప్రూవ్‌ చేసుకోడానికి ఓ పరీక్ష పెడతాడు. ఇంతకు ఆయన పెట్టే పరీక్ష ఏంటి? ఆ పరీక్షలో తేలే విషయమేంటి? చివరకు ప్రేమికులు కలుసుకున్నారా? విడిపోయారా? అనే సంగతి తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

సమీక్ష:
ముందుగా నటీనటుల విషయానికి వస్తే.. కార్తికేయ ఆర్‌.ఎక్స్‌ 100 కంటే చక్కగా నటించాడు. కొత్త లుక్‌, బాడీ లాంగ్వేజ్‌తోఆకట్టుకున్నాడు. తన పాత్ర పరిధి మేర చక్కగా నటించాడు కార్తికేయ. ఇక తొలి సినిమానే అయినా హీరోయిన్‌ దిగంగన సూర్య వన్షీ చక్కటి నటన ప్రదర్శించింది. పాత్ర పరంగా నటననే కాదు.. రొమాంటిక్‌ సన్నివేశాల్లో కూడా చక్కగా నటించింది. జెజ్‌బా సింగ్‌ పాత్ర చాలా పరిమితం. కీలకమైన పాత్రలో జెడి.చక్రవర్తి సునాయసంగా నటించేశాడు. తెలంగాణ స్లాంగ్‌లో నేటి యూత్‌ లవ్‌కు కనెక్ట్‌ అయ్యేలా డైలాగ్స్‌ను పలికించారు.
వెన్నెలకిషోర్‌ పాత్ర కామెడీ సినిమాలో కాస్త బెటర్‌. ఇక బ్రహ్మాజీ పాత్ర కూడా ఏదోకామెడీని పండించే ప్రయత్నం చేసింది. శ్రద్దాదాస్‌ పాత్ర జస్ట్‌ ఓకే. దర్శకుడు టి.ఎన్‌.కృష్ణ విషయానికి సినిమాను ఆసక్తికరంగా తెరకెక్కించడంలో విఫలమయ్యాడు. హీరో హీరోయిన్‌ గొడవ పడి కలిసిపోయే కథాంశంతో చాలా సినిమాలు వచ్చాయి. అదే కథాంశంతో సినిమాను తెరకెక్కించిన టి.ఎన్‌.కృష్ణ సన్నివేశాలను ఆసక్తికరంగా తెరకెక్కిండంలో విఫలమయ్యాడు.
నివాస్‌ కె.ప్రసన్న అందించిన సంగీతంలో ఓ శాడ్‌ సాంగ్‌ ట్యూన్‌ బావుంది. మిగిలిన ట్యూన్స్‌ గొప్పగా ఏమీ లేవు. బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ అస్సలు బాలేదు. ఆర్‌.డి.రాజశేఖర్‌ సినిమాటోగ్రఫీ బావుంది. నిర్మాణ విలువలు బావున్నాయి. సినిమాలో గొప్పగా ట్విస్టులు,మనసుకు హత్తుకునే సన్నివేశాలేం లేవు. యూత్‌ ఆలోచనలు ప్రేమ విషయంలో ఎలా ఉన్నాయనేదే సినిమా. రొమాంటిక్‌ సీన్స్‌, ఏరోటిక్‌ డైలాగ్స్‌తో సినిమాను తెరెక్కించారు.

బోటమ్‌ లైన్‌: ‘హిప్పీ’ .. చప్పగా సాగే రొమాంటిక్‌ డ్రామా
రేటింగ్‌: 2.25/5

author avatar
Siva Prasad

Related posts

‘బహుముఖం’ మూవీ రివ్యూ..

The Mother First Review: ది మదర్ ఫస్ట్ రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లోకి వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..!

Saranya Koduri

Kajal Karthika OTT Review: కాజల్ కార్తీక ఫస్ట్ రివ్యూ.. సెకండ్ ఇన్నింగ్స్ లో కాజల్ హిట్టా? ఫట్టా?

Saranya Koduri

Kismat First Review: కిస్మత్ ఫస్ట్ రివ్యూ… ఓటీటీలోకి సైలెంట్ గా వచ్చేసిన ఈ క్రైమ్ కామెడీ ఏ విధంగా ఉందంటే..!

Saranya Koduri

Bhoothakaalam Review: భూతకాలం ఫస్ట్ రివ్యూ.. ప్రేక్షకులను భయానికి గురి చేసే ఈ మలయాళం మూవీ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Lambasingi movie review: ‘లంబసింగి’ మూవీ రివ్యూ..

siddhu

Bhimaa: థియేట‌ర్స్ లో దుమ్ములేపుతున్న భీమా.. సినిమాలో మెయిన్ హైలెట్స్ ఇవే!

kavya N

Valari Movie Review: వళరి రివ్యూ.. ఓటీటీలో ద‌డ పుట్టిస్తున్న ఈ దెయ్యాల సినిమా ఎలా ఉందంటే?

kavya N

Laapataa Ladies Review: ‘లాపతా లేడీస్’ అద్భుత నటనతో విమెన్ పవర్ నేపథ్యంతో అదిరిపోయే సినిమా…కిరణ్ రావ్ డ్రామా ఎలా ఉందొ మీరే చూడండి!

Saranya Koduri

Chaari 111 review: ” చారి 111 ” మూవీ రివ్యూ వచ్చేసిందోచ్.. వెన్నెల కిషోర్ హీరోగా హిట్టా? ఫట్టా?

Saranya Koduri

Sandeep: ఊరు పేరు భైరవకోన ట్విట్టర్ రివ్యూ.. మనోడు యాక్టింగ్ ఇరగదీసాడుగా..!

Saranya Koduri

Lal Salam: రజిని ” లాల్ సలాం ” రివ్యూ… వామ్మో ర‌జ‌నీ నీకో దండం…!

Saranya Koduri

Eagle: రవితేజ “ఈగల్ ” ట్విట్టర్ రివ్యూ.. మాస్ మ‌హరాజ్ బొమ్మ హిట్టా…ఫ‌ట్టా…!

Saranya Koduri

యాత్ర 2 ఫ‌స్ట్ రివ్యూ… గూస్‌బంప్స్ మోత‌… గుండెలు పిండే సెంటిమెంట్‌..!

Saranya Koduri

Naa Saami Ranga Review: సంక్రాంతికి తగ్గట్టు నాగార్జున.. “నా సామిరంగ” మూవీ రివ్యూ..!!

sekhar

Leave a Comment