టాలీవుడ్ లో రామ్ గోపాల్ వర్మ సంచలనాలకు మారుపేరు. వారం రోజుల్లోనే ఒక సినిమా తీసి రిలీజ్ చేసిన ఘనత ఆయనది. అలాంటి వర్మ లాక్ డౌన్ లో కూడా తన సినిమాలతో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. కరోనా తో సంబంధం లేకుండా ఇప్పటికే మూడు ప్రాజెక్టులను లైన్ లో పెట్టిన వర్మ తనకంటూ ఒక వెబ్ సైట్ క్రియేట్ చేసుకొని అందులో తనకు ఇష్టం వచ్చిన సినిమాలను తీసి విడుదల చేస్తున్నాడు. తాజాగా ఆర్జివి విడుదల చేసిన కొత్త చిత్రం ‘నగ్నం’ NAKED రిలీజ్ కాగా…. ఈ చిత్రం ఎలా ఉంది అన్న విషయానికి వస్తే….
కథ: శ్రీ రాపాక (స్వీటీ) ఇంట్లోని పనివాడు (జమల్) తో అక్రమ సంబంధం పెట్టుకుంటుంది. ఇక భర్త దీపక్ భార్య అక్రమ సంబంధం విషయం దృష్టికి వస్తుంది. ఆమె చేసిన పనికి ఆగ్రహం చెందిన దీపక్ భార్యపై దాడి చేస్తాడు. ఈ క్రమంలో అతనిని శాంతపరిచేందుకు మధ్యలో జమాల్ రాగా జరిగిన గొడవలో దీపక్ మరణిస్తాడు. అంతే…. దీపక్ మరణించిన తర్వాత భార్య శ్రీ రాపాక ఏం చేస్తుంది? అక్రమ సంబంధం, హత్యా వ్యవహారం మరియు హత్య లో ఇరుక్కుపోయిన జమల్ పరిస్థితి ఏమిటి… తర్వాత ఏం జరిగాయి అనే ప్రశ్నల కి వర్మ ఏమని సమాధానం ఇచ్చాడు?
పర్ఫార్మెన్సెస్, సాంకేతికత
నగ్నం లాంటి చిత్రంలో పర్ఫార్మెన్స్ కు స్కోప్ ఉంటుంది అని ఆశించడమే పెద్ద తప్పు. స్వీటీ పాత్రలో శ్రీ రాపాక అందాల ఆరబోతకే పరిమితమైంది. ఆమెకు నటించాలని ఆసక్తి ఉన్నా ఆ కథలో నటనకు స్కోప్ ఉన్న సన్నివేశాలు మరియు సీన్లు లేక పోవడంతో ఏమీ చేయలేకపోయింది. ట్రైలర్లో మించిన హాట్ సన్నివేశాలు ఈ చిత్రంలో ఆశించలేము. మిగిలిన రెండు పాత్రలు కూడా ఉన్నా లేనట్టే.
రామ్ గోపాల్ వర్మ తనలోని క్రియేటివిటీని ఏమాత్రం నగ్నచిత్రం లో చూపించచలేదు. బూతు మరియు కెమెరా యాంగిల్స్ పై పెట్టిన శ్రద్ధ కథ పైన పెట్టి ఉంటే కనీసం సినిమా పర్వాలేదనిపించేది. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, ఎడిటింగ్ కి పెద్దగా పనేమీ లేదు… అవసరం కూడా లేదు. వర్మ బూతుని రకరకాల యాంగిల్స్ లో ఆవిష్కరించడానికి మాత్రం బాగా కష్టపడ్డాడు అన్నది కళ్ళకు కట్టినట్లు కనిపిస్తోంది. మ్యూజిక్ తో పాటు ఇతర సాంకేతిక అంశాలలో ఈ చిత్రం కనీస ప్రమాణాలకు చాలా దూరంగా ఉంటుంది
విశ్లేషణ : ఈ చిత్రంలో మర్డర్ మరియు హాట్ సీన్స్ ఉన్నా కథలో ఎలాంటి ట్విస్ట్ లు మరియు టర్నులు ఉండవు. ఇది ఏదో ఒక షార్ట్ ఫిలిం కన్నా కూడా తక్కువ స్థాయి సినిమా. సినిమా లో ఎటువంటి జోష్ ఉండకపోవడం గమనార్హం. ఇక కథ ఏంటి అన్న ప్రశ్న వస్తే మనకు ఈ సినిమా చూసిన తర్వాత కూడా సమాధానం దొరకదు. హాట్ సీన్లు తప్ప మాట్లాడుకోవడానికి మరేం లేదు.
కన్క్లూజన్ : సినిమా మేకింగ్ లో అపారమైన మెళకువలు తెల్సిన వర్మ మరియు ఒక విప్లవం క్రియేట్ చేసిన రామ్ గోపాల్ వర్మ నుండి ఇటువంటి సినిమాలు రావడం నిజంగా దురదృష్టకరం. అయితే ఈ సినిమా మొదటి రోజే లాభాలు రాబట్టిన విధానం చూసి డబ్బు సంపాదన కోసమే వర్మ ఇలాంటి దర్శకుడిగా మారిపోయాడా అన్న అనుమానాలు వచ్చేశాయి. వర్మ అంటే ఒక బ్రాండ్ కానీ ఇప్పుడు వర్మ అంటే ఏంటి అన్న విషయం ఎవరైనా చెప్పాలన్నా ఏమీ అర్థంకాని పరిస్థితి. ఈ సినిమా పైరసీ లో దొరికినా చూడక పోవడం మంచిది. దానితో టోటల్ గా డబ్బులు, ఎనర్జీ, పీస్ ఆఫ్ మైండ్ అన్నీ సేవ్ అవుతాయి.
రేటింగ్ : 0.5/5