NewsOrbit
సెటైర్ కార్నర్

తెలు’గోడు’!

 

 

తెలుగదేలయన్న దేశంబు తెలుగు..ఏను తెలుగు వల్లభుండ..తెలుగొకండ ..పద్యం గుర్తుకొస్తోంది. పద్యంతో పాటు తెలుగు వల్లభుడు కృష్ణరాయలు కూడా గుర్తుకొస్తున్నాడు. ఆహా అని భుజాలెగరేయాలనుకుంటే దీనంగా తెలుగోడు ముందు నిల్చున్నాడు. నేను వెంటనే పాటందుకుందామనుకున్నా. చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా..

“అయ్యా కవిగారూ దయచేసి పాటలు పాడకండే.”  ఇక్కడంత సీను లేదు అన్నాడు తెలుగు బ్రదరు. ఇక మా సంభాషణ ఇలా సాగింది.

“ ఏమిరా నీకేమైంది? ఇక్ష్వాకులు..పల్లవులు..శాతవాహనులు..కాకతీయులు..నీ వైభవం ఘనం..నీ గతం కీర్తిమయ కాంతిమంతం. “

“వద్దు స్వామీ వద్దు. అందరూ నా గతాన్ని కీర్తించేవారే. నా భవిష్యత్తును భూతద్దంలో చూపించేవారే. నా వర్తమానమే చిందరవందర గందరగోళ డోలాయమానం బాబూ.”

“అదేంట్రా..బాబుగారు నీకు ప్రత్యేక హోదాకోసం అహోరాత్రాలు అగ్నితాండవం చేస్తుంటే నువ్వలా డీలా పడిపోతావేంటి?”

“అయ్యబాబోయ్..అంతమాటనొద్దు గురువా. ఒక్క బాబుగారే కాదు. ఇప్పుడంతా నా హోదా కోసమే బాధాతప్త హృదయంతో రగిలిపోతున్నారు. ఎంత ప్రేమ..ఎంత ప్రేమ నేనంటే. రాష్ట్రాన్ని ఇడగొట్టేసినప్పుడు  చప్పట్లు కొట్టినోళ్ళే కదా  వీరంతా. నా బాధ..నా గాథ..ఏం చెప్పమంటావు? ఇప్పుడు నా ప్రత్యేక హోదాకోసం ధర్నాలు చేస్తున్నారు..సభలు పెడుతున్నారు..నినాదాలిస్తున్నారు. కేంద్రాన్ని నిలదీస్తున్నామని మనల్ని మాత్రం నిలువు కళ్ళేసుకుని చూసే నీరసరాయుళ్ళని చేసేస్తున్నారు. “

“ అదేమిట్రా సోదరా. నీ హోదా కోసం వీర తిలకం దిద్దుకోని అంతా విప్లవిస్తుంటే నీకీ దిగులెందుకురా సామీ. ఇంతకీ నువ్వు తెలుగోడివా? తెగులోడివా? “

“ ఏమయ్యా కవీ.. నాకు తెలియక అడుగుతాను. జుట్టు పట్టుకోవాల్సినప్పుడు వదిలేసి ..ఇప్పుడు కాళ్ళు పట్టుకుంటే ఏమన్నా ప్రయోజనం వుందంటావా? అందరికీ నా బాగోగులే కావాలి అన్నప్పుడు మరిన్ని పార్టీలెందుకు? మరిన్ని జెండాలెందుకు? అసలెన్నికలే ఎందుకంటావ్? మాకు ఎన్నికలూ వద్దు..గిన్నికలూ వద్దు. ప్రత్యేక హోదా ఇవ్వండి అని తెగేసి చెప్పేసి  అప్పటిదాకా మనమంతా ఒక్కటిగా ఒకచోట కూర్చుని హోదా కోసం సదా సమూహ గీతాలాపన చేసుకుంటూ కాలక్షేపం చేసుకోవచ్చుగా.”

“ ఏంటి? ఎన్నికలు మానేయాలంటావా? తెలుగోడికి తెలివుందనుకోవడం నా బుద్ధి తక్కువరా నాయనా. “

“అవును మరి. మీ అందరి ప్రతినిధిని కదా నాకెందుకుంటుంది ఆ తెలివి చెప్పు?”

“ అదేంట్రా అబ్బాయ్ అంత మాటనేశావు? అంటే మనోళ్ళకెవరికీ తెలివే లేందంటావా?”

“స్వార్థానికి తెలివికీ పడదంటాను. స్వార్థమే తెలివిగా తర్జుమా అయినచోట తెలివికి ప్రత్యేక ఉనికి వుండదంటాను.

ఏంటో కవిని నేనో నువ్వో అర్థం కావడం లేదురా తెలుగోడా!”

“అవును తెలుగోడినే అందుకే నా గోడు నీ దగ్గర వెళ్లబోసుకుంటున్నాను. వీళ్ళందరికీ నా హోదా అవసరం వచ్చిందంటావా నిజం చెప్పు కవీ. హోదా నాదా..నీదా..వారిదా…వీరిదా..? ఎవరి హోదాలు వాళ్ళు కొట్టేయడానికి నా హోదా అవసరమైంది కవీ. అదే ప్రత్యేకం. గెలిచిన వాడికి పాలక హోదా దక్కుతుంది. ఓడిన వాడికి ప్రతిపక్ష హోదా దక్కుతుంది. నాకేం దక్కుతుంది నా పిండాకూడు!”

“అయ్యో ఎంతమాటన్నావు మిత్రమా. అంటే నీ గురించి కాదన్నమాట ఈ పోరాటాలు..ఈ ఆరాటాలు..ఈ ఆందోళనలు..?”

“నీకు మాత్రం తెలియదా కవీ. అంతా ఎన్నికల వ్యూహరచన. ఎవరి వ్యూహాలు వారివి. ఎవరి దాహాలు వారివి. విసయం ఏంటంటే ఇప్పుడందరి చేతుల్లో ఉన్న అస్త్రాన్ని నేనే. అసహాయుణ్ణీ నేనే. ఒంటరి వాణ్ణి. ఇన్ని కోట్ల తెలుగు సోదరుల ఆత్మగౌరవ ప్రతీకనై..చివరికి ఆత్మనే కోల్పాయాను. నిజంగా నన్ను పట్టించుకునే వాడెవడున్నాడిప్పుడు. నన్ను వాడుకునే వాడే తప్ప. ఇంతటి విషాదం ఏ జాతి చరిత్రలోనూ నువ్వు చదవలేదేమో కదా. అవును. నేనే విషాదం. నా మీద నడుచుకుంటు తెలుగు నాయకులు జైత్రయాత్రలు చేస్తున్నారు.”

“తెలుగదేలయన్న దేశంబు తెలుగు..తెలుగొకండ..ఖండ ఖండాల ఛిద్ర చరిత్రకు తార్కాణం ఇప్పుడు నా జీవితం.

హతవిధీ తెలుగోడికి ఎంత దయనీయ స్థితి దాపురించింది? ఈ తెలుగోడు కనేవాడు వినేవాడు ఎవడు?

ప్రసాదమూర్తి

8499866699

ReplyForward

 

author avatar
Siva Prasad

Related posts

Raghurama krishnamraju: ఖాళీగా ఉండ‌లేక ర‌ఘురామరాజు ఏం చేస్తున్నాడంటే…

sridhar

KCR: ఆ ఇద్ద‌రు `లేడీ లీడ‌ర్లు` కేసీఆర్ ను ఎలా ఇరికిస్తున్నారంటే…

sridhar

Pawan Kalyan :డియర్ పవన్ కల్యాణ్… ఆంధ్రుడి లేఖ మీకు అందిందా?

sridhar

బాలకృష్ణ‌ పై టీడీపీ నేత‌ల్లో అసంతృప్తి …. చంద్ర‌బాబు విష‌యంలో ఇలాగేనా చేసేది?

sridhar

సూపర్ స్టార్ రజనీకాంత్ ‘గెటప్’లో సెహ్వాగ్!

Teja

ఎంత ప‌ని చేశావు జ‌గ‌న్‌… పార్టీ నేత‌లే త‌ట్టుకోలేక పోతున్నారు

sridhar

Dhivya Bharathi Joshful Photos

Gallery Desk

వామ్మో… ఫేస్‎బుక్‎లో గొడవయ్యిందని చంపేస్తావా…!!

sekhar

బాబు గారు..!! మీకర్ధమవుతుందా..??

Srinivas Manem

ఓయ్, నీకర్థమౌతోందా..

Srinivas Manem

ట్రిప్పుల ట్రిక్కులు, తిప్పలు…!

Srinivas Manem

విందుకు పిలుపు రాలేదెందుకు?

Srinivasa Rao Y

యోగి ‘బద్ LAW’

Srinivasa Rao Y

ఆనియన్ ఛాలెంజ్!

Srinivasa Rao Y

అవర్ టెల్గు మదర్!

Srinivasa Rao Y

Leave a Comment