Karthika Deepam: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. గత ఎపిసోడ్ లో హిమకు క్యాన్సర్ అని తెలియడంతో తనని ఒక భర్తలాగా దగ్గర ఉండి తనని చూసుకుంటా అని అందరితో చెబుతాడు నిరూపమ్. అందరు ఒక్కసారిగా షాక్ కు గురి అవుతారు. అంతేకాకుండా హిమను ఎలాగయినా పెళ్లి చేసుకుని తిరతాను అని కూడా అంటాడు. ఈ క్రమంలోనే నేటి కధనం మరింత ఆసక్తిగా ముందుగా సాగిందనే చెప్పాలి. ఈరోజు ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయో ముందుగానే తెలుసుకుందామా..
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
నిరూపమ్, హిమ మాటలను. దొంగ చాటుగా వింటున్న శోభ:
హిమ, నిరుపమ్లు ఒకచోట కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే వీళ్ళు కలిసిన విషయాన్ని శాంతబాయ్ శోభకు చెప్పడంతో శోభ అక్కడకు వచ్చి వాళ్ళ మాటలను చాటుగా వింటూ ఉంటుంది. హిమ ఏమో బావా ప్లీజ్ నా మాట విను.. నేను కూడా నిన్ను ప్రేమించాను.. కానీ ఆ దేవుడు మనల్ని కలపాలని అనుకోవడం ఇష్టం లేకనే ఇలా చేశాడు. మనిషి ప్రాణం పోయిన తర్వాత కళ్లు, గుండెను ఎలా అయితే దానం చేస్టార్ అలానే నా ప్రేమని కూడా మరో వ్యక్తి ద్వారా నీకు అందిస్తాను బావ. దానికి నువ్వు అంగీకరించాలి అంటుంది. అందుకు బదులుగా నువ్వు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి’ అంటుంది. హిమ మాటలను విన్న నిరూపమ్ కోపంతో..హిమా ఏం మాట్లాడుతున్నావ్’ అంటాడు.వేరే అమ్మాయిలో నేను నీ ప్రేమని చూసుకోవాలా? ఇంతకీ ఎవరా అమ్మాయి’ అంటాడు నిరుపమ్. ‘నువ్వు తనని పెళ్లి చేసుకుంటాను అంటేనే నేను చెబుతాను అంటుంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
జ్వాలను పెళ్లి చేసుకోమని నిరూపమ్ ను అడిగిన హిమ :
నా మీద నీకు నిజంగా ప్రేమ ఉంటే నే చెప్పిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని నాకు మాట. ఇవ్వు బావ అంటుంది.హిమ నాకు నువ్వు ఏమి చెబుతున్నావో ఏం అర్థం కావట్లేదు’ అంటాడు నిరుపమ్. వెంటనే హిమ తన చేతుల్లోకి నిరుపమ్ చేతులని లాక్కుని ‘బావా నాకు ప్రామిస్ చేస్తున్నావ్ నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకో బావా.. ఆ అమ్మాయి నీకు కరెక్ట్’ అంటుంది హిమ. వెంటనే తన చేతుల్ని వెనక్కి లాక్కుంటూ‘ఇంతకీ ఎవరో చెప్పు హిమా’ అంటాడు నిరుపమ్. ఆ అమ్మాయి మరెవరో కాదు జ్వాల’అంటుంది హిమ. నిరుపమ్తో పాటు శోభ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
జ్వాలను చీప్ గా చూసిన నిరూపమ్ :
హిమా ఏం మాట్లాడుతున్నావ్? జ్వాలని నేను పెళ్లి చేసుకోవడం ఏంటీ?’ అంటాడు నిరుపమ్.తను నిన్ను చాలా బాగా చూసుకుంటుంది. తను నిన్ను ఇష్టపడుతుంది బావ అంటుంది..హిమ మాటలు విన్న శోభ ఆ ఇచ్చే అవకాశం ఏదో నాకు ఇవ్వచ్చు కదే హిమా పోయి పోయి నిరూపమ్ ను ఆ ఆటో దానికి కట్టబెడతానంటావేంటే?’ అని మనసులో తిట్టుకుంటుంది. ‘బావా నేను ఎటు చనిపోతాను. ఇంకా ఎన్నాళ్ళు. బ్రతికి ఉంటానో కూడా నాకు తెలియదు. ఎప్పటికయినా నా మాట విను’అంటుంది హిమ. అసలు ఏంటి నువ్వు హిమ జ్వలను పెళ్లి చేసుకోవడం ఏంటి.. అసలు తనేంటీ? నేనేంటీ?’ అంటాడు నిరుపమ్.బావా ప్లీజ్.. నా మీద ప్రేమ ఉంటే.. నేను చెప్పినట్లు జ్వాలనే పెళ్లి చేసుకో బావా’ అంటూ కళ్లు తిరిగి పడిపోతుంది హిమ.
నిరూపమ్ కు శోభతో రెండో పెళ్లి :
సీన్ కట్ చేస్తే హిమ మాటలు విన్న శోభ ఆవేశంతో రగిలిపోతు ఉంటుంది. వెంటనే వెళ్లి స్వప్నను కలుస్తుంది. ఇంతలో స్వప్న మా నిరుపమ్ ఆ హిమనే పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టాడు శోభ అది ఎలాగో చనిపోతుంది. అది చనిపోయిన తర్వాత నీతోనే నిరుపమ్ పెళ్లి చేస్తా అని శోభకు మాటిస్తుంది స్వప్న. ‘అయ్యో ఆంటీ.. మీకు అసలు నిజం తెలియదు. అది చెప్తే మీరు ఆవేశంలో అడిగినా అడిగేస్తారు అలా జరగకూడదు.. పూర్తిగా విషయం తెలుసుకోవాలి అని మనుసులోనే అనుకుంటుంది శోభ.
హిమ, జ్వాలల మధ్య రిలేషన్ శోభకు తెలుస్తుందా..?
ఇంతలో స్వప్న ఆ హిమ నిజంగానే ఒక నష్టజాతకురాలు. తల్లి తండ్రులను పొట్టనబెట్టుకున్నది అదే.మా కార్తీక్, దీపలు దాని వలనే చనిపోయారు. ఆ తర్వాత దానితో పుట్టింది కూడా దీని మీద కోపంతో ఇంట్లోంచి ఏటో పారిపోయింది’ అని మొత్తం కథను శోభకు చెబుతుంది స్వప్న.దాంతో శోభ ఆలోచనలో పడుతుంది. కొంపతీసి జ్వాల చేతి మీద ఉన్న హెచ్ అనే పచ్చబొట్టు గుర్తొచ్చి దానికి దీనికి ఏమన్నా రిలేషన్ ఉందా అనే కోణంలో ఆలోచిస్తుంది.ఈ హిమేమో ఆ జ్వాల కోసం ఇంత చేస్తోంది. అసలు వీరి మధ్య గల సంబంధం ఏంటి.. జ్వాల చేతి మీద ఉన్న హెచ్ అంటే హిమ కాదు కదా? అని శోభ ఆలోచిస్తుంది.