(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ భార్య అనుష్కశర్మకు మాజీ వికెట్ కీపర్ ఫరూక్ ఇంజినీర్ క్షమాపణలు చెప్పారు. వర్డల్ కప్ జరుగుతున్న సమయంలో సెలక్టర్లు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మకి టీ కప్పులు అందించారని ఫరూక్ ఇంజినీర్ తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీంతో అనుష్క శర్మ గురువారం ఒక లేఖ రూపంలో తన పై వస్తున్న విమర్శలకు సమాధానం ఇచ్చారు. అనుష్క లేఖ తర్వాత ఫరూక్ ఇంజినీర్ ఆమెకు క్షమాపణలు చెప్పారు. తాను ఇండియన్ సెలక్టర్లను మాత్రమే తప్పుపట్టాను కానీ అనుష్కను కాదని వివరణ ఇచ్చారు. చిన్న విషయాన్ని పెద్దగా చేసి చూపుతున్నారని, ఈ వివాదంలోకి అనుష్కశర్మను అనవసరంగా తీసుకొచ్చారని తెలిపారు. అనుష్క చాలా మంచి అమ్మాయి అని చెప్పారు. అలాగే విరాట్ కోహ్లీ అద్భుత కెప్టెన్ అని, కోచ్ రవిశాస్త్రి బాగా పనిచేస్తున్నారని తెలిపారు. చిన్న విషయాన్ని పెద్దదిగా చేస్తూ రాద్ధాంతం చేస్తున్నారని పేర్కొన్నారు. తమ బాధ్యతలు సరిగ్గా నిర్వర్తించని సెలక్టర్లపైనే తన కోపమని, విరాట్, అనుష్కలపై కాదని ఫరూక్ స్పష్టం చేశారు.
ఇంగ్లాండ్ లో 2019 వర్డల్ కప్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో సెలక్టర్లు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మకి టీ కప్పులు అందించారని మాజీ వికెట్ కీపర్ ఫరూక్ ఇంజినీర్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఎంఎస్కె ప్రసాద్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ పట్ల 82 ఏళ్ల ఫరూక్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది ‘మిక్కీ మౌస్ సెలెక్షన్ కమిటీ’ అని ఆయన ఎద్దేవా చేశారు. సెలెక్షన్ కమిటీపై కోహ్లీ ప్రభావం ఎక్కువగా ఉందని అన్నారు. ఈ సెలెక్టర్లను ఎలా ఎంపిక చేస్తున్నారో కూడా తనకు అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. ఇటీవల ఓ సెలెక్టర్ ను తాను కనీసం గుర్తు కూడా పట్టలేకపోయానని ఫరూక్ తెలిపారు. ఇండియా బ్లేజర్ వేసుకుని అతను ఉండటంతో… నీవు ఎవరని అడిగానని చెప్పారు. దీనికి సమాధానంగా తాను సెలెక్టర్ నని చెప్పాడని ఫరూక్ తెలిపారు.
ఫరూక్ వ్యాఖ్యలపై కోహ్లీ భార్య అనుష్క ఓ లేఖతో సమాధానం ఇచ్చింది. విమర్శలపై తాను ఎప్పుడు స్పందించకపోవడం వల్లనే ప్రతిసారి తనని టార్గెట్ చేస్తున్నారని అనుష్క ఆవేదన వ్యక్తం చేసింది. ఎప్పుడు ఏమి జరిగినా తన గురించి తప్పుగానే విమర్శలు వినపడుతున్నాయి పేర్కొంది. తన భర్త, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మంచి ప్రదర్శన ఇచ్చినా, ఇవ్వక పోయిన తనపై విమర్శలు చేయడం మంచిది కాదు అని తెలిపింది. తాను ఎప్పుడు విదేశీ పర్యటనకు వెళ్ళినా.. తన సొంత డబ్బులతోనే వెళ్తానని చెప్పింది. ఎలాంటి ఆధారాలు లేకుండా తనను విమర్శించటం మానేయాలని అనుష్క శర్మ లేఖలో పేర్కొంది.
— Anushka Sharma (@AnushkaSharma) October 31, 2019