టాప్ స్టోరీస్

దెయ్యం వేషాలతో ప్రాంక్ వీడియో!

Share

(న్యూస్ ఆర్బిట్ డెస్క్)

యూట్యూబ్‌ ప్రాంక్ వీడియోల పేరుతో రోడ్లపై పడి పిచ్చి వేషాలు వేయడం కొంతమంది యువకులకు అలవాటైపోయింది. తాజాగా బెంగళూరులో కొందరు యువకులు దెయ్యం వేషాలతో రోడ్లపై జనాలను బెంబేలెత్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు వారిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. యశ్వంత్‌పూర్‌లో ఏడుగురు యువకులు ప్రాంక్ వీడియో రూపొందించాలనుకున్నారు. రక్తం మరకలు ఉన్న తెల్ల దుస్తులు వేసుకుని దెయ్యాల వేషంలో రాత్రిపూట రోడ్లపై వెళ్లేవారిని, ఫుట్‌పాత్‌లపై పడుకున్నవారిని భయపెట్టారు. అంతేకాదు రాత్రిపూట రోడ్లపై వెళ్తున్న ఆటోరిక్షాలు, కార్లు, బైక్స్‌ను ఆపి వారిని భయబ్రాంతులకు గురి చేశారు. వారి చూసి భయపడిన ప్రయాణికులు పారిపోయారు. దీనిపై ఓ ఆటోరిక్షా డ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సదరు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. యూట్యూబ్ చానెల్ కోసమే దెయ్యాల వేషం వేసుకుని ప్రజలను భయపెట్టారని నిందితులు చెప్పినట్టు పోలీసులు తెలిపారు. అరెస్టయిన ఏడుగురిలో అంతా 18-25 ఏళ్ల లోపు వారేనని సీనియర్ పోలీసు అధికారి షాహికుమార్ తెలిపారు.

 

Video Courtesy: The News Minute


Share

Related posts

వీరుడా వందనం!

Siva Prasad

ప్రాజెక్టులపై మౌనం ఎందుకు?

somaraju sharma

‘రైస్’ రాజకీయం

somaraju sharma

Leave a Comment