“చరిత్ర స్మరించుకుంటుంది. ఝాన్సీ లక్ష్మీభాయ్, చంద్రశేఖర ఆజాద్, భగత్సింగ్లాంటి ఎందరో మహనీయుల ప్రాణ త్యాగాలని. కానీ ఆ చరిత్ర పుటల్లో కనుమరుగయ్యాడు ఒక వీరుడు. ఆంగ్లేయులపై తొలిసారి యుద్ధ భేరి మోగించిన రేనాటి సూర్యుడు… “ అని పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ చెప్పిన వాయిస్ ఓవర్‌తో మొదలైంది `సైరా నరసింహారెడ్డి` టీజర్. ఈ నెల 20న టీజర్ విడుదల చేస్తామని ముందే కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ రామ్‌చరణ్ ప్రకటించారు. దీనికి సంబంధించి పిడికిలి నుంచి జారుతున్న మట్టితో కూడిన ఫొటోను ఆయన ఇన్‌స్టాలో షేర్ చేశారు. తీరా ఆయన చెప్పిన రోజు రానే వచ్చింది. మంగళవారం మధ్యాహ్నం `సైరా` టీజర్ విడుదలైంది. ఆద్యంతం భారీతనం, అశేషప్రజానీకం, కనుచూపుమేరా ధగధగలాడుతున్న దీపపు కాంతుల్లో కోట, శత్రుసైన్యాన్ని చీల్చి చండాడిన మెగాస్టార్ కత్తి పదును… చూపరులను కళ్లు తిప్పుకోనివ్వలేదు. దానికి తోడు హీరోయిజాన్ని మరింత ఎలివేట్ చేసిన డైలాగులు టీజర్‌కు అదనపు ఆకర్షణ.
ఆ డైలాగు యథాతథంగా…
బ్రిటిషర్: హూ ఈజ్ దిస్ నరసింహారెడ్డి…
బ్రిటిషర్కు అనుచరుడు (భారతీయుడు): సింహంలాంటోడు దొర.. అతడే వాళ్ల ధైర్యం దొరా…
బ్రిటిషర్: హంట్ హిమ్…
ఈ డైలాగులు పొడిపొడిగా ఉండొచ్చు. కానీ చరిత్రకు సజీవసాక్ష్యాలు. ఈ సంభాషణతోనే నరసింహారెడ్డి ఎవరో ప్రజలకు తెలిసేది. చేతికి కెంపు ఉంగరం ఒకటి, సింహముఖంతో ఉన్న ఉంగరం ఒకటి పెట్టుకున్న నరసింహారెడ్డి ఆహార్యం కూడా చూపరులను కట్టిపడేసే అంశం. దానికి తోడు తమ వీరులను సమాయత్తం చేస్తూ నరసింహారెడ్డి చెప్పే…“రేనాటి వీరులారా.. చరిత్రలో మనం ఉండకపోవచ్చు. కానీ చరిత్ర ఈ రోజు మనతోనే మొదలవ్వాలి “ అనే డైలాగు బాక్సాఫీస్ దగ్గర సరికొత్త కలెక్షన్ల రికార్డును రాయడానికి శ్రీకారం చుట్టినట్టు అనిపిస్తోంది.
కొణిదెల ప్రొడక్షన్ పతాకంపై శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని రామ్‌చరణ్ నిర్మిస్తున్నారు. సుష్మిత కాస్ట్యూమ్ డిజైనర్. అమిత్ త్రివేది సంగీత దర్శకుడు. పవన్ కల్యాణ్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. నీహారిక ఇందులో ఓ కీలక పాత్రలో కనిపించనుంది.
అమితాబ్‌బచ్చన్, సుదీప్, విజయ్ సేతుపతి, నయనతార, తమన్నా, జగపతిబాబు, రవికిషన్‌కు సంబంధించిన గ్లింప్సస్ ఇటీవలి మేకింగ్ వీడియోలో కనిపించాయి.
అక్టోబర్ 2న భారీగా తెరపైకి ఐదు భాషల్లో విడుదల కానుంది. `సైరా నరసింహారెడ్డి`.
previous post
next post