అమరావతి: గతంలో వైసిపి అధినేత జగన్మోహనరెడ్డి న్యూజీలాండ్ పర్యటన సమయంలో బంగీ జంప్ చేసిన ప్రదేశంలోనే తాజాగా టిడిపి విజయవాడ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు బంగీ జంప్ చేశారు. అక్కడి ఫోటోలు, వీడియోను బొండ ఉమ తన ఫేస్బుక్ ఖాతా ద్వారా విడుదల చేస్తూ ఆసక్తికరమైన వ్యాఖ్యను చేశారు. జీవితం సాహసోపేతమైనది అంటూ తాను సాహసాన్ని ఎంచుకుంటున్నాను, ఇక్కడ నుండి నా బంగీ జంప్ అంటూ వ్యాఖ్యానించారు. ఈ ఫోటోలతో కూడిన వ్యాఖ్య వైసిపి అధినేత, సిఎం జగన్మోహనరెడ్డిని అనుసరిస్తున్నట్లుగా ఉన్నాయంటున్నారు. బొండ ఉమా పార్టీ మారనున్నారన క్లారిటీ ఇచ్చారనీ, జగన్ దారిలో తాను అన్నట్లుగా ఉన్నాయని భావిస్తున్నారు. ఆయన పార్టీ మారనున్నారని వస్తున్న వార్తలపై ఆయన క్లారిటీ ఇవ్వలేదు కానీ ఫోటోలు, వీడియోలను విడుదల చేశారు.
బొండా ఉమ త్వరలో వైసిపిలోకి చేరనున్నారని వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఈ విషయం విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. విజయవాడ సెంట్రల్ నియోజకవరం నుండి టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన బొండా ఉమా వైసిపి అభ్యర్థి మల్లాది విష్ణుపై స్వల్పఓట్ల తేడాతో ఓడిపోయారు. నాడు ఎన్నికల కౌంటింగ్‌లో రీకౌంటింగ్‌కు డిమాండ్ చేసినా అధికారులు అనుమతించలేదు.
రాష్ట్రంలోనూ టిడిపి ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో ఎన్నికల అనంతరం బొండ ఉమ సైలెంట్‌గా ఉండిపోయారు. కాకినాడలో జరిగిన కాపు నేతల సమావేశంలోనూ బొండ ఉమ పాల్గొన్నారు. అనంతరం సెంట్రల్ నియోజకవర్గంలోని పలువురు టిడిపి ద్వితీయ శ్రేణినాయకుల వ్యవహార శైలిపైనా అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఉమ వైసిపిలో చేరడం ఖాయమనీ అయితే ఆయనకు ఏ నియోజకవర్గ బాధ్యతలు ఇస్తారనే విషయంపైనే చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. బొండా ఉమాతో వైసిపి పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్ (పివిపి) మాట్లాడినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. న్యూజీలాండ్ పర్యటన ముగించుకొని వచ్చిన తరువాత బొండ ఉమా అడుగులు ఎటుపడతాయి అనేది ఆసక్తిగా మారింది.
న్యూజిలాండ్‌లో వైసిపి అధినేత జగన్ బంగీ జంప్ వీడియో….(న్యూస్ టుడే సౌజన్యంతో)…
టిడిపి మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు బంగీ జంప్ వీడియో…..
https://www.facebook.com/BondaUma/videos/347588736179029/