NewsOrbit
టాప్ స్టోరీస్

ఎవ్వరినీ వదిలేది లేదు

జోరుగా శశి థరూర్ ఎన్నికల ప్రచారం
పిలవని పెళ్లికి వెళ్లి.. అక్కడ పలకరింపు
రోడ్డు పక్కన ఆటో డ్రైవర్లతో ‘చాయ’ సేవనం
తిరువనంతపురం: ఎన్నికలు వచ్చాయంటే రాజకీయ నాయకులు వేసే వేషాలు అన్నీ ఇన్నీ కావు. నిన్న మొన్నటి వరకు విలాసవంతమైన ఏసీ కార్లలో ప్రయాణిస్తూ కనీసం రోడ్డువైపు కూడా చూడకపోయినా.. ఎన్నికలు వస్తే పూర్తిగా రోడ్ల మీదకే వస్తారు. ఆటో డ్రైవర్లతో కలిసి రోడ్డు పక్కన ‘చాయ’ తాగడం, రాజ కుటుంబ సభ్యులను కలవడం, తర్వాత అమ్మతో కలిసి భోజనం చేయడం.. అన్నీ ఇలాంటివే. తిరువనంతపురం ఎంపీ, కాంగ్రెస్ నాయకుడు శశి థరూర్ ఇవన్నీ చేయడంతో పాటు ఏకంగా ఓ పిలవని పెళ్లికి వెళ్లి అక్కడ నవ వధూవరులతో పాటు అందరినీ పలకరించి ఓట్లు వేయమని అడిగారు. ట్విట్టర్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న శశి థరూర్.. తన ప్రచారానికి సంబంధించిన కొన్ని ఫొటోలను ట్వీట్ చేశారు. ఎక్కడకెళ్లినా ఏవో జోకులు వేయడం థరూర్ అలవాటు. దాంతో ఆయన ఏమన్నారో గానీ పెళ్లివాళ్లంతా నవ్వడం మాత్రం ఫొటోలో కనిపించింది.

‘‘ఎన్నికలు వచ్చాయంటే ఎవరినీ వదలం.. చివరకు పెళ్లికొడుకు, పెళ్లికూతురు కూడా. ఓట్ల కోసం ఎంపీ వచ్చినపుడు వాళ్లు పాపం భోజనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు’’ అని ఆయన ట్వీట్ చేశారు. అంతకుముందు ఉదయమే ట్రావన్ కోర్ రాజకుటుంబ సభ్యులను కలిశారు. 2009లో తొలిసారి లోక్ సభకు ఎన్నికైన థరూర్, ఆ తర్వాత 2014లో కేవలం 15వేల ఓట్ల తేడాతో బయటపడ్డారు. ఈసారి ఆయనతో మిజొరాం మాజీ గవర్నర్ కుమ్మనం రాజశేఖరన్ పోటీ పడుతున్నారు. ఆయన ఆర్ఎస్ఎస్ సభ్యుడిగా జీవితం ప్రారంభించి, 2015 నాటికి కేరళ బీజేపీ అధ్యక్ష స్థాయికి ఎదిగారు. అయినా ఈసారి గతం కంటే ఎక్కువ మెజారిటీ సాధిస్తానని థరూర్ ధీమా వ్యక్తం చేశారు. మోదీ సర్కారుపై ఆయన తరచు విమర్శలు చేస్తుంటారు.

https://twitter.com/ShashiTharoor/status/1110164272435195905

https://twitter.com/ShashiTharoor/status/1110086073642684416

Related posts

Ayodhya : జ‌న‌వ‌రి 22 : అయోధ్య రామ‌మందిరం ఓపెనింగ్‌.. మీ గ్రామాల్లో ఈ ప‌నులు చేయండి..!

Saranya Koduri

Subrata Roy: సుబ్రతా రాయ్ ఇక లేరు…సహారా గ్రూప్ స్థాపకుడుకి 75 సంవత్సరాలు, దీర్ఘకాలిక అనారోగ్యం తో కన్ను మూత.

Deepak Rajula

International Girl Child Day: అంతర్జాతీయ బాలికా దినోత్సవంపై స్పెషల్ స్టోరీ.. 2023 థీమ్ ఏంటి? దీని చరిత్ర..

siddhu

Amaravati Capital Case: అమరావతి రాజధాని కేసు డిసెంబర్ కు వాయిదా వేసిన సుప్రీం కోర్టు .. ఏపీ సర్కార్ కు షాక్ | Supreme Court Shocks AP Govt in Amaravti Case 

sharma somaraju

Kuno National Park: కునో నేషనల్ పార్కుకు మరో 12 చిరుతలు.. ఈ పార్కుకు వెళ్లాలని అనుకుంటున్నారా? హైదరాబాద్, విజయవాడ నుంచి ఇలా వెళ్లండి!

Raamanjaneya

Mughal Gardens: అమృత ఉద్యాన్‌గా మొఘల్ గార్డెన్.. దీని చరిత్ర.. ప్రత్యేకతలు!

Raamanjaneya

థార్ డెసర్ట్‌లో ఇసుక తిన్నెలు నడుమ అద్భుతమైన ఆహారం,  ప్రదర్శనలు, కచేరీలు!

Raamanjaneya

KCR’s BRS: నూతన శాతవాహన సామ్రాజ్యం దిశగా పావులు కదుపుతున్న నయా శాతవాహనుడు సీఎం కేసీఆర్

sharma somaraju

ఆ ఇద్దరూ ఒకే వేదికపై ..! బీజేపీ భారీ ప్లాన్స్, సక్సెస్ అవుతాయా..!?

Special Bureau

Why Lawrence Bishnoi wants Salman Khan Dead? నాలుగు సంవత్సరాల నుండి సల్మాన్ నీ చంపడానికి ప్లాన్ చేస్తున్న దుండగులు..!!

Siva Prasad

PK Team: పీకే టీమ్ – 1500మంది రెడీ ..! వైసీపీ కోసం భారీ ప్లాన్స్..!

Special Bureau

YSRCP: ఈ విషయాలు గమనిస్తే దటీజ్ జగన్ అనాల్సిందే(గా)..?

sharma somaraju

Rahul Gandhi: వరంగల్ సభలో టీఆర్ఎస్ పై రాహుల్ సీరియస్ కామెంట్లు..!!

sekhar

Telangana Crime: భాగ్యనగరంలో అమానవీయ ఘటన! పదహారు మంది బాలల బట్టలూడదీసి కొట్టినా కిమ్మనని పోలీసులు,కెసిఆర్ సర్కారు!

Yandamuri

TDP ChandraBabu: కార్యకర్తలపై కేసులు.. బాబోరీ వెరైటీ కూతలు..!!

sekhar

Leave a Comment