ట్రెండింగ్

Russia Ukraine War: మూడో ప్రపంచ యుద్ధం అంటూ రష్యా మీడియా సంచలన కథనం..!!

Share

Russia Ukraine War: దాదాపు ఆరు వారాలకు పైగా ఉక్రెయిన్- రష్యా దేశాల మధ్య యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని.. యుద్ధం ఆపాలని.. ఇరు దేశాల నాయకులను ప్రపంచ దేశాలు కోరుతున్న గాని ఎవరు వెనక్కి తగ్గడం లేదు. ఇదిలా ఉంటే కొద్ది రోజుల క్రితం యుద్ధ సామాగ్రిని తరలించే రష్యా యుద్ధనౌక మాస్కోవా నల్ల సముద్రంలో భారీ పేలుడకి సముద్రంలో మునిగిపోయిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని రష్యా మిలటరీ అధికారి అధికారికంగా తెలియజేశారు. చిన్నపాటి అగ్నిప్రమాదం వల్ల యుద్ధనౌక సముద్రంలో మునిగి పోయినట్లు తెలిపారు. అయితే ఈ ఘటనపై ఉక్రెయిన్ మాత్రం నెఫ్ట్యూన్ క్షిపణి ద్వారా యుద్ధనౌక ని ముంచివేసినట్లు చాలా గర్వంగా ప్రకటించుకోవడం జరిగింది. Russia-Ukraine conflict: Past, present and future - News Analysis Newsదీంతో ఈ ఘటనను ఉద్దేశిస్తూ రష్యా అధికారిక ప్రభుత్వ ఛానల్ ‘రష్యా 1’ న్యూస్ రిపోర్టర్ ఒక డిబేట్ లో… యుద్ద నౌక ప్రమాదాన్ని గురించి మాట్లాడుతూ.. మూడో ప్రపంచ యుద్ధం ఘటనతో అధికారికంగా స్టార్ట్ అయ్యిందని ప్రకటించడం ఇప్పుడు అంతర్జాతీయంగా సంచలనంగా మారింది. ‘‘నాటోకు పూర్తి వ్యతిరేకంగా ఇప్పుడు మనం  పోరాడుతున్నాము. నాటో గుర్తించకపోయినా.. ఇప్పుడు మనం అది గుర్తించాల్సిందే. ముఖ్యమైన ప్రకటన.. ఇది మూడో ప్రపంచ యుద్ధం.. ఆల్రెడీ మొదలైపోయింది’’ అంటూ టీవీ వీక్షకులను ఉద్దేశించి కామెంట్లు చేయడం జరిగింది. What's Behind The Russia-Ukraine War Fears -- And What Might Actually  Happen?ఇదే తరుణంలో ప్రపంచ పెద్దన్న అమెరికా…ఉక్రెయిన్ కి సైనిక పరంగా ఇంకా ఆయుధాల పరంగా సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. ప్రకటించడంతో రష్యా అగ్గిమీదగుగ్గిలంగా.. ఉక్రెయిన్ తో తాడోపేడో తేల్చుకోవడానికి రెడీ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా ప్రపంచంలో ఒకపక్క కరోనా తీసుకొచ్చిన కష్టాలు, మరోపక్క శ్రీలంకలో కరువు.., రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధంతో… ప్రపంచ దేశాల జనాలు భయంతో ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు.


Share

Related posts

మొత్తానికి బాలయ్యను ఆహ్వానించిన చిరంజీవి!

Teja

Diabetes: భోజనం చేసిన తరువాత ఐదు నిమిషాలు నడిస్తేనే షుగర్ తగ్గుతుందా..!?

bharani jella

Anchor Ravi – Lasya: లాస్యకు ఎప్పుడూ అదే ఆలోచన అదే అంటున్నా రవి..!! 

bharani jella
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar