(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
ఓ శునకానికి బెస్ట్ యాక్టర్ అవార్డు లభించింది. అయితే ఆ శునకం రీల్ లైఫ్ లో కాకుండా రియల్ లైఫ్ లో నటించినందుకు నెటిజన్లు ఆ అవార్డు ప్రకటించారు. బాగా గోర్లు పెరిగిన కుక్కకి దాని యజమాని గోర్లు తీయబోయింది. ఆ సందర్భంగా ఆ కుక్క.. మూర్ఛపోయినట్లు నటించింది. గోర్లు తీసేందుకు ఓ కాలును దాని యజమాని తన చేతిలో తీసుకుంది. అయితే, అంతలోనే కుక్క స్లో మోషన్ లో కిందకు పడిపోయింది. తన నాలుగు కాళ్లను పైకి లేపింది. గోర్లు తీయించుకోకుండా ఆ కుక్క ఈ విధంగా నటించింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోని మూడు రోజుల క్రితం సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. 5.9 మిలియన్ల వ్యూస్ ని తెచ్చుకుంది. అంతేకాదు వేల సంఖ్యలో నెటిజన్లు కామెంట్లు చేశారు.
The Academy Award for best dramatic performance goes to… pic.twitter.com/ErlQc2JcpQ
— ℝ?????? (@Rashona) September 6, 2019