(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
భార్య నిద్ర కోసం విమానంలో 6 గంటలు నిలబడ్డాడో వ్యక్తి. తాను కూర్చొనే సీటును కూడా భార్యకు ఇచ్చేసి హాయిగా నిద్రపోమ్మని చెప్పాడు. భర్త చేసిన త్యాగంతో భార్య హాయిగా విమానంలో నిద్రపోయింది. దీనికి సంబంధించిన ఫొటో ఒకటి ట్విట్టర్ లో తెగ వైరల్ అవుతోంది. కోర్ట్నీ లీ జాన్సన్ అనే వ్యక్తి ట్విట్టర్ ఈ ఫొటోను షేర్ చేశారు. ‘ఈ మనిషి తన భార్య నిద్ర కోసం ఏక ధాటిగా 6 గంటలు అలాగే నిలబడ్డాడు. భార్య అంటే ఎంత ప్రేమో’ అని పోస్ట్ పెట్టాడు.
This guy stood up the whole 6 hours so his wife could sleep. Now THAT is love. pic.twitter.com/Vk9clS9cCj
— Courtney Lee Johnson (@courtneylj_) September 6, 2019
వైరల్ అవుతున్న ఈ ఫొటోలో.. నిద్ర పోతున్న తన భార్య వైపు భర్త ప్రేమగా చూస్తున్నాడు. మొత్తం మూడు సీట్లలో భార్యే నిద్రపోయేసరికి నిద్ర ముంచుకువస్తున్న సరే.. సీటు లేక అతడు అలాగే నిలబడిపోయాడు. ఈ ఫొటోని కోర్ట్నీ లీ జాన్సన్ శుక్రవారం ట్విట్టర్ లో పోస్టు చేశారు. కొద్ది గంటల్లోనే వైరల్ అయింది. ఈ ఫొటోకి 15 వేలపై చిలుకు లైక్స్ తోపాటు వేలాది కామెంట్లు కూడా వచ్చాయి. భర్య కోసం భర్త చేసిన త్యాగాన్ని చూసిన నెటిజన్లు.. ఆదర్శ దంపతులంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. భార్యభర్తలిద్దరిపై నెటిజన్లు తమకు తోచినట్టుగా ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.
She could have still rested her head on his lap.
— Amenenge (@_Sylva_H) September 6, 2019
Selfish pic.twitter.com/464CI5Fjmy
— Maybe: Hummy✨ (@hummytweets) September 6, 2019