NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ పోల్‌ రాజ‌కీయాలు

AP News: తాంబూలాలు ఇచ్చాం..తన్నుకు చావండి..!!

AP News: “తాంబూలాలు ఇచ్చాం –తన్నుకు చావండి” అన్న సామెత మాదిరిగా కేంద్రం తీరు కనబడుతోంది. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించారు. విభజన చట్టంలోని అనేక హమీలను కేంద్రం అమలు చేయలేదు. ప్రత్యేక హోదా ఇస్తామన్నారు అదీ లేదు. “పాడిందే పాటరా పాటిపళ్ల దాసరా” అన్నట్లు ప్రత్యేక హోదాను కేంద్రాన్ని వైసీపీ సర్కార్ అడుగుతూనే ఉంది, కేంద్రం కూడా అదే మదిరిగా ముగిసిన అధ్యాయమని చెబుతూ వస్తూనే ఉంది. ఏపి, తెలంగాణ మధ్య విద్యుత్ బకాయిల చెల్లింపు వ్యవహారం ఇంత వరకూ తేలలేదు. రాష్ట్ర విభజన జరిగి ఏడున్నర సంవత్సరాలు దాటినా సమస్యలు అన్నీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉన్నాయి.

AP News: central govt suggestions to ap
AP News: central govt suggestions to ap

 

AP News: మీరు మీరు తేల్చుకోండి

తెలంగాణ రాష్ట్రం నుండి ఏపికి రావాల్సిన విద్యుత్ బకాయిలపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్రం షాక్ ఇచ్చేలా సమాధానం చెప్పింది. విద్యుత్ బకాయిల చెల్లింపుల వ్యవహారంలో వివాదాలను రాష్ట్రాలే పరిష్కరించుకోవాలని కేంద్ర విద్యుత్ శాఖ స్పష్టం చేసింది. ఏపి, తెలంగాణ మధ్య నెలకొన్న వివాదం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్నందున సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఉభయ రాష్ట్రాలకు సూచించినట్లు రాజ్యసభలో కేంద్రం వెల్లడించింది. కేంద్ర ఇంధన శాఖ మంత్రి ఆర్కే సింగ్ ఈ మేరకు విజయసాయి రెడ్డికి సమాధానం ఇచ్చారు. అదే విధంగా ప్రత్యేక హోదాపై విజయసాయి అడిగిన ప్రశ్నకు దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయ్యేలా కేంద్రం సమాధానమిచ్చింది.

ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజీ నిధుల లెక్క ఇది

ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజీకి ఒప్పుకుని నిధులు తీసుకున్నారుగా.. మళ్లీ ప్రత్యేక హోదా అంటారేమిటి అన్నట్లుగా కేంద్ర ఆర్ధిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ప్రశ్నించారు. ఏపి ప్రభుత్వం కోరడం వల్లనే ప్రత్యేక హోదా బదులుగా ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజీకి ఇచ్చామంటూ లెక్కలు చెప్పారు. ఏపికి 2015 – 19 మధ్య ప్రత్యేక ప్యాకేజీకి కింద 19,846 కోట్లు, రెవెన్యూ లోటు గ్రాంట్ కింద రూ.22,112 కోట్లు అందించినట్లు వివరించారు. 2020- 21 లో ఏపికి రూ.5,897 కోట్లు ఇచ్చామని కేంద్ర సహాయ మంత్రి పంకజ్ చౌదరి వెల్లడించారు. కాకపోతే గుడ్డిలో మెల్ల బెటర్ అన్నట్లు విభజన చట్టం హామీలు నెరవేర్చే బాధ్యత తమదేనని కేంద్ర మంత్రి వెల్లడించారు.

Related posts

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju

Amit Shah: అమిత్ షా కు తృటిలో తప్పిన హెలికాఫ్టర్ ప్రమాదం

sharma somaraju

Video Morphing Case: అమిత్ షా డీప్ షేక్ వీడియో కేసు.. గాంధీ భవన్ కు ఢిల్లీ పోలీసులు ..సోషల్ మీడియా ప్రతినిధులకు నోటీసులు

sharma somaraju

Supreme Court: ఏపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ ..ఎన్జీటీ తీర్పును యథాతధంగా అమలు చేయాలంటూ ఆదేశం

sharma somaraju

బ‌ల‌మైన నియోజ‌క‌వ‌ర్గాల్లో బ‌ల‌హీన నేత‌లు.. వైసీపీ సాధించేదేంటి..?

దెందులూరులో మా ఓడికి ఓట‌మే నో డౌట్‌… వైసీపీ లీడ‌ర్లే ఒప్పేసుకుంటున్నారే..?

ఏపీలో మేనిఫెస్టో జోష్ తుస్‌.. ఇంత షాక్ ఇచ్చారేంట‌బ్బా…?

పింఛ‌న్లు-ప‌రేషాన్లు.. వైసీపీ ఉచ్చులో టీడీపీ.. !

BRS: బీఆర్ఎస్ కు మరో షాక్ .. కాంగ్రెస్ కండువా కప్పుకున్న మరో కీలక నేత

sharma somaraju