Balakrishna Unstoppable: బాలయ్య బాబు ఒక సినిమా యాక్టర్ గా మాత్రమే రాణిస్తారు అని అనుకున్న సమయంలో ఆహా “అన్స్టాపబుల్” షోలో హోస్ట్ గా చేసి అందరి ఆలోచనలను తల్లకిందులు చేశారు. బాలకృష్ణ కంటే ముందే తన తోటి హీరోలు.. నాగార్జున, చిరంజీవి లాంటి వాళ్లు పలు రియాల్టీ షోలకు యాంకరింగ్ చేయడం… బుల్లితెరపై రాణించడం జరిగింది. ఇటువంటి తరుణంలో బాలయ్యబాబు ఓటీటీ ఆహా ప్లాట్ ఫామ్ లో అన్స్టాపబుల్ లో… ఇండస్ట్రీకి చెందిన టాప్ మోస్ట్ సెలబ్రిటీలను… వారి పర్సనల్ విషయాలను అడిగి తెలుసుకోవటం తో పాటు మరో పక్క కామెడీ పండించడం.. చూసే ప్రేక్షకులను ఎంతగానో ఎంటర్టైన్ అందించినట్లు అయింది.
ఇండస్ట్రీ నుండి టాప్ మోస్ట్ సెలబ్రిటీలు మహేష్ బాబు, సుకుమార్, బన్నీ, రష్మిక మందన, మోహన్ బాబు, రాజమౌళి, నాని, పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ ఇంకా చాలా మంది టెక్నీషియన్లు అన్స్టాపబుల్ లో పాల్గొన్నారు. బాలలకు సంబంధించిన పర్సనల్ విషయాలు అడిగి తెలుసుకుంటున్న మరో పక్క వాళ్ళ పై వచ్చిన రూమర్ల గురించి కూడా బాలకృష్ణ ప్రశ్నలు వేసి క్లారిటీ తీసుకోవడం జరిగింది.
“అన్స్టాపబుల్” కి బాలయ్య చేసిన హోస్టింగ్ నెక్స్ట్ లెవెల్ లో షోని తీసుకెళ్ళింది. తాజాగా ఈ షో సరికొత్త రికార్డు సృష్టించింది. ఏకంగా 40 కోట్ల నిమిషాలు ఓటిటి లో స్ట్రీమింగ్ అయినట్లు ఇండియాలో ఏ టాక్ షోకి… ఇటువంటి ఆదరణ రాలేదని… చెప్పుకొస్తున్నారు. ఇటీవలే ఫస్ట్ సీజన్ ముగియగా త్వరలోనే అన్స్టాపబుల్ సెకండ్ సీజన్ స్టార్ట్ చేసే ఆలోచనలో ఆహా టీం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం బాలయ్య బాబు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా అయిన వెంటనే జూలై నుండి సెకండ్ సీజన్ స్టార్ట్ చేయడానికి బాలయ్య రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి.