NewsOrbit
రాజ‌కీయాలు

‘ధైర్యం ఉంటే మీడియా ముందుకు రా’

విజయవాడ: నీటి పారుదల శాఖలో ఐదేళ్లు అవినీతికి, అరాచకాలకు పాల్పడ్డారంటూ వైసిపి నేత విజయసాయిరెడ్డి ఆరోపణలు చేయడంపై మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. విజయసాయిరెడ్డికి ధైర్యం ఉంటే మీడియా ముందుకు వచ్చి మాట్లాడాలని ఉమా సవాలు విసిరారు.

నాలుగు వారాలు ఓపిక పడితే అన్నీ బయటపడతాయని విజయసాయిరెడ్డి ట్విట్టర్‌ వేదికగా చేసిన వ్యాఖ్యలపై విజయవాడ టిడిపి కార్యాలయంలో ఉమా మీడియా సమావేశం నిర్వహించారు. అధికారులు, గుత్తేదారులు తమకు దస్త్రాలు తెచ్చి ఇస్తున్నారంటూ విజయసాయిరెడ్డి చెబుతున్నారనీ, తమ సంగతి చూస్తానంటూ బెదిరింపు ధోరణిలో వ్యాఖ్యలు చేస్తున్నారనీ ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలను న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుంటే అతని బెయిల్‌ రద్దు కావడం ఖాయమని ఎద్దేవా చేశారు. రాజ్యాంగేతర శక్తిగా విజయసాయిరెడ్డి బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఉమా దుయ్యబట్టారు.

2014లో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి 11,273 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని ఉమా తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకా 4,546 కోట్ల రూపాయలు రావాల్సి ఉన్నా వాటి గురించి ప్రతిపక్ష పార్టీ ఒక్కసారి కూడా మాట్లాడలేదని ఉమా విమర్శించారు. అవినీతిలో కూరుకుపోయిన వారు పోలవరంపై మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని ఉమా ఎద్దేవా చేశారు.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అనేక అవార్డులు వచ్చిన విషయాన్ని ఉమా గుర్తు చేశారు. పులివెందులకు నీళ్లు ఇచ్చినా వైసిపి అధ్యక్షుడు జగన్‌ ఏనాడు స్పందించకపోవడం దారుణమని ఉమా అన్నారు.  రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖ రాస్తే వైసిపి నేతలకు ఉలుకు ఎందుకని ఉమా ప్రశ్నించారు. జగన్‌,విజయసాయిరెడ్డిలకు ప్రజా క్షేత్రంలో తిరిగే అర్హత లేదనీ, వీరు ఉండాల్సింది తీహార్‌ జైలులోనేనని ఉమా ఎద్దేవా చేశారు.

Related posts

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

Leave a Comment