NewsOrbit
రాజ‌కీయాలు

‘మూడు రాజధానులు ఎక్కడున్నాయో చెప్పండి’

(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)

అమరావతి: దేశంలో ఆరు రాష్ట్రాల్లో మాత్రమే కౌన్సిళ్లు ఉన్నాయనీ, మిగతా రాష్ట్రాల్లో లేవని చెబుతున్న జగన్..దేశంలో మూడు రాజధానులు ఎక్కడ ఉన్నాయో చెప్పాలని టిడిపి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు కోరారు. సోమవారం ఆయన మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా మండలి విషయాలపై అసెంబ్లీలో చర్చ జరుగుతోందని వ్యాఖ్యానించారు. బిఎసి సమావేశం గురించి ఒక్క రోజు ముందు కాకుండా అప్పటికప్పుడు ఫోన్ చేసి చెప్పారనీ దీంతో తాను హెలికాఫ్టర్ పంపితే వస్తానని చెప్పాననీ ఆయన వెల్లడించారు.

ఏడు నెలల కాలంలో శాసనమండలికి 32 బిల్లులు పంపితే ఒక్క బిల్లునయినా తమ సభ్యులు వ్యతిరేకించారా అని ప్రశ్నించారు. ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా ఉన్నందునే పరిపాలనా వికేంద్రీకరణ బిల్లను సెలెక్ట్ కమిటీకి పంపారని ఆయన వివరించారు. ప్రతిపక్షాలకు అవకాశం లేకుండా మండలి రద్దు బిల్లును సభలో పెట్టారని అచ్చెన్నాయుడు ఆరోపించారు.

మూడు రాజధానులు తమకు వద్దంటూ ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంటే విలువలు లేని కమిటీలు వేసి రాజధాని తరలించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు. బిల్లును మండలి సెలెక్ట్ కమిటీకి పంపితే జగన్‌కు నిద్రపడ్డటం లేదని అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు.  కేసులు పెడతామని భయపెట్టి ఎమ్మెల్సీలను పార్టీలోకి లాక్కోవడం మంచి పద్దతా అని ఆయన ప్రశ్నించారు.

Related posts

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

Leave a Comment