Eatela Rajendar: ఈట‌ల చేయ‌లేనిది… చేసి చూపించిన కేసీఆర్ …

Share

Eatela Rajendar: తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ మరోమారు మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ విష‌యంలో ఊహించ‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. టీఆర్ఎస్ పార్టీలో సీనియ‌ర్ నేత‌గా కొన‌సాగిన ఈట‌ల ఇటీవ‌ల త‌న ప‌ద‌వికి , పార్టీకి గుడ్ బై చెప్పేసిన సంగ‌తి తెలిసిందే. అయితే, తాజాగా ఆయ‌న‌కు మ‌రో షాక్ ఇచ్చారు కేసీఆర్‌. ఈట‌ల చేయ‌లేనిది త‌ను చేసి చూపించారు.

Read More: Eatela Rajendar: ఈట‌ల‌కు వెన్నుపోటు రుచి చూపిస్తున్న కేసీఆర్‌


ఈట‌ల ఏం చేయ‌లేక‌పోయారంటే…
మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ గ‌తంలో పౌర స‌ర‌ఫ‌రాల శాఖా మంత్రిగా కూడా ఉన్నారు. ఈ స‌మ‌యంలో ప‌లు స‌మ‌స్య‌లు ఆయ‌న వద్ద రేష‌న్ డీల‌ర్లు ప్ర‌తిపాదించారు. అయితే, అవి ప‌రిష్కారానికి నోచుకోలేదు. మ‌రోవైపు తెలంగాణ రాష్ట్రంలో రేష‌న్ కార్డులు ఇచ్చిన పాపాన పోలేదు. ఈ రెండు స‌మ‌స్య‌లుకు తాజాగా సీఎం కేసీఆర్ ప‌రిష్కారం చూపారు.

Read More: Eatela Rajendar: స్పీక‌ర్ ఫార్మాట్లో ఈట‌ల రాజీనామా చేయ‌నిది ఇందుకేనా?

ఒకే దెబ్బ‌కు…

తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకొని, పెండింగులో ఉన్న 4,46,169 మంది అర్హులకు వెంటనే రేషన్ కార్డులను మంజూరు చేయాలని కేసీఆర్ సార‌థ్యంలో జ‌రిగిన‌ కేబినెట్ స‌మావేశం నిర్ణయించింది. 15 రోజుల్లోగా రేషన్ కార్డులిచ్చే ప్రక్రియను పూర్తి చేయాలని క్యాబినెట్ సంబంధిత అధికారులను ఆదేశించింది. మ‌రోవైపు రాష్ట్రంలోని రేషన్ డీలర్ల కమీషన్ సహా ఇతర సమస్యలు, ప్రజా పంపిణీ వ్యవస్థలోని సమస్యల పరిష్కార మార్గాల సూచనకై క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. పౌర సరఫరాల మంత్రి గంగుల కమలాకర్ అధ్యక్షతన ఏర్పాటైన ఈ సబ్ కమిటీలో మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి సభ్యులుగా ఉంటారు.


Share

Related posts

KCR: కేసీఆర్ తో పేచీ… జాగ్ర‌త్త‌గా డీల్ చేస్తున్న జ‌గ‌న్ టీం

sridhar

దేశంలో మళ్లీ లాక్ డౌన్ పై క్లారిటీ ఇచ్చిన మోడీ..!!

sekhar

పెళ్లి ఆపేయండి.. అత‌ను న‌న్ను ప్రేమించాడు!

Teja