NewsOrbit
బిగ్ స్టోరీ

విశాఖలో మరొక గ్యాంగ్ వార్ .. రంగంలోకి దూకిన DGP సవాంగ్!

ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రధాన రాజధానిగా చెప్పబడుతున్న విశాఖపట్నం లో రౌడీషీటర్లు కత్తులు దూసుకోవడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. తీర ప్రాంతంలో విచక్షణరహితంగా ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న తీరు చూసి అక్కడి ప్రశాంత వాతావరణం కాస్తా ఒక్కసారిగా భగ్గుమంది. ఒక పుట్టినరోజు వేడుకల్లో రౌడీషీటర్లు కత్తులతో దడి చేసుకోవడంతో పోలీసులు రంగంలోకి దిగి వెంటనే పరిస్థితిని శాంతపరిచే ప్రయత్నం చేశారు.

 

Six Persons Held In Vizag Gang War

వివరాల్లోకి వెళితే గాజువాక సమీపంలోని పెదగంట్యాడ మండలం సీతానగరం లో జరిగిన గ్యాంగ్ వార్ లో ఒక వివాదం చెలరేగి రెండు వర్గాలు కత్తితో పరస్పరం దాడులకు ప్రయత్నించారు. సీతానగరం ఆర్ హెచ్ కాలనీలో మొల్లి మహేష్ అనే యువకుడు నిర్వహించిన పుట్టినరోజు వేడుకలలో రౌడీషీటర్ మొల్లి సంతోష్ కూడా పాల్గొన్నాడు. అదే వేడుకకి వడ్లపూడి చెందిన మరొక రౌడీషీటర్ గందవరపు తరుణ్ కూడా వచ్చాడు. క్రమంలోనే అంతా బాగా వేడుకలో ఉన్న సమయంలో వీరిద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

ఇక ముందు నుంచే పోలీసులకి వీరిద్దరూ కలిసి ఒక పార్టీ కి వెళ్ళబోతున్నారని సమాచారం వచ్చిందట. దానితో వారిపై ఒక కన్ను వేసి ఉండగా…. వీరిద్దరి మధ్య పాత గొడవలు కూడా ఉండటంతో డిజిపి సవాంగ్ నేతృత్వంలోని పోలీసు శాఖ చాలా అప్రమత్తంగా ఉన్నారు. అనుకున్నట్టే ఇద్దరికీ మాట మాట పెరిగి అదికాస్తా ఘర్షణకు దారితీసింది. ఒకరిపై ఒకరు దాడులకు దిగి చివరికి కత్తులతో ఇరువర్గాలు పరస్పరం దాడులకు ప్రయత్నించారు.

దీనితో వెంటనే డీజీపీ సవాంగ్ అతన్ని బృందాన్ని అలెర్ట్ చేసి వారందరిని అదుపులోకి తీసుకున్నారు. నేపథ్యంలో ఇరు వర్గాల ఫిర్యాదుల మేరకు న్యూ పోర్టు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. గొడవ లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు రిమాండ్ కు తరలించారు.

ఇకపోతే సినిమాటిక్ స్టైల్ లో జరిగిన గొడవకు గతంలో సబ్బవరం మండలం లో చెలరేగిన వివాదం కారణమని పోలీసులు చెబుతున్నారు. గాజువాక, పెదగంట్యాడ, సబ్బవరం మండలాల పరిధిలో అసాంఘిక కార్యక్రమాలు, సెటిల్మెంట్లు, భూకబ్జాలు మరియు కత్తులతో దాడులు చేసుకోవడం మొల్లి సంతోష్ అలియాస్ సోనాసంత్ కి అలవాటు అనే అంటున్నారు. ఒక్క న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్ లోనే ఇతని పై 12 కేసులు ఉన్నట్లు సిఐ తెలిపారు.

అలాగే వడ్లపూడికి చెందిన గందవరపు తరుణ్  బిటెక్ చదివి కూడా నేరాల బాట పట్టినట్లు పోలీసులు తెలిపారు. అతడు హత్య కేసులో ప్రధాన ముద్దాయి, అంతేకాకుండా స్తెబర్ నేరాలు చెయ్యడంలో దిట్ట అని తెలిపారు. అలాగే తరుణ్‌పై ఐదు కేసులున్నట్లు సీఐ పేర్కొన్నారు.

Related posts

Telangana Lok Sabha Elections 2024: ఆ మూడు స్థానాల్లో కొనసాగుతున్న సస్పెన్స్ .. మరో సీఎం రేవంత్ హస్తినకు పయనం

sharma somaraju

ర‌ఘురామ సీటుకు ఎర్త్ పెడుతోందెవ‌రు… పాపం ఏమైపోతాడో …!

ఈ టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్‌కు టిక్కెట్‌…. మంత్రి ప‌ద‌వి కావాలి.. అయినా బాబు కంటే జ‌గ‌నే ఇష్టం…!

బొత్స త‌న భార్య ఝాన్సీని విశాఖ ఎంపీని చేస్తాడా.. చేతులెత్తేస్తారా…?

Chandrababu: ఢిల్లీ వెళుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు .. అమిత్ షాతో కీలక భేటీ..? ఎన్డీఏలో చేరికకు మార్గం సుగమం అయినట్లే(గా)..!

sharma somaraju

YSRCP: ప్రత్యర్ధులకు అందని జగన్ వ్యూహం .. ఎంపీ ఆర్ఆర్ఆర్ కు ప్రత్యర్ధిగా మహిళా అడ్వకేట్ ఉమాబాల .. ఎవరీ ఉమాబాల..?

sharma somaraju

TDP: ఆ వాగ్ధాటి ఉన్న నేతకు టీడీపీలో టికెట్ టెన్షన్ .. బాబు గారు ఎక్కడ సర్దుబాటు చేస్తారో..!

sharma somaraju

JD Lakshminarayana: జేడీ కంఠశోష .. జగన్, చంద్రబాబుకు జేడీ కీలక సూచన

sharma somaraju

TDP – Janasena: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు పెద్ద తలనొప్పిగా మారిన కడప అసెంబ్లీ సిగ్మెంట్ .. టీడీపీ కా ..? జనసేనకా..? మాధవి రెడ్డి వర్సెస్ సుంకర శ్రీనివాస్

sharma somaraju

YSRCP: ఎంపీ వద్దు .. ఎమ్మెల్యే సీటు ముద్దు.. వైసీపీ నేతల వేడుకోలు

sharma somaraju

YSRCP – Allagadda: ఆళ్లగడ్డలో అఖిలప్రియకు పోటీగా అవంతి ..? ఎవరీ అవంతి..?  

sharma somaraju

YS Sharmila: ఏపీలో వైఎస్ షర్మిల ఆపరేషన్ స్టార్ట్స్ .. రేపే పీసీసీ బాధ్యతల స్వీకరణ .. వెంటనే ఆ ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు చేరిక..?

sharma somaraju

Janasena TDP: జనసేనలోకి మాజీ మంత్రి కొణతాల ..? అయ్యన్న ఆశలపై నీళ్లు..!

sharma somaraju

TDP Vs Janasena: టీడీపీకి బిగ్ ఝలక్ .. తిరగబడుతున్న తెనాలి తెలుగు తమ్ముళ్లు

sharma somaraju

YSRCP Vs TDP: ముందరి కాళ్లకు బంధం అంటే ఇదే కదా..? సంకటంలో టీడీపీ..!

sharma somaraju