NewsOrbit
5th ఎస్టేట్

కోటరీ కొంప ముంచుతోందా?

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యూహాల ముందు పార్టీ ఇరుకునపడుతోందా… అంటే అవుననే చెప్పాల్సి ఉంటుంది. ఆర్థికంగా సంపన్నుడిగా… వ్యాపారవేత్తగా… రాజకీయాలను దగ్గరగా చూస్తూ… దూరంగా ఉన్నరఘురామకృష్ణరాజు ఇప్పుడు ఒకటో గేర్ లో హైస్పీడ్ బుల్లెట్ ట్రైన్ నడుపుతున్నట్టుగా బండిని నడిపిస్తున్నారు. అంతా నా ఇష్టం… అన్నట్టుగా చెలరేగిపోతున్నారు. అందుకు కారణాలను కూడా విడమర్చి మరీ చెప్పేస్తున్నారు.

 

 

 

దేవుడి భూములు అమ్మొద్దనడం నేను చేసినా… తప్పా… నేరమా? అంటూ ప్రశ్నిస్తున్నారు. అంతటితో ఆగిపోకుండా తనపై విమర్శలు చేసిన జిల్లా నేతలను చెడుగుడాడేసుకుంటున్నారు. పార్టీలో తనకు వ్యతిరేకంగా కొందరు కావాలని చెలరేగిపోతున్నారని వారందరూ పార్టీ హైకమాండ్ అండదండలతో రెచ్చిపోతున్నారని అధినేతకు తప్పుడు సమాచారం ఇస్తూ… పార్టీని భ్రష్టుపట్టించేస్తున్నారంటూ రాజు గారు వాయిస్ రెయిజ్ చేస్తున్నారు.

 

ఒక్కసారి సీఎం జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ ఇస్తే మొత్తం వ్యవహారం సెట్ అయిపోతుందంటున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డిపై పొగడ్తలు కురిపిస్తూనే అదే సమయంలో ఆయనకు అన్ని విషయాలు తెలియవంటూ చెబుతూ పార్టీ అధినేతను ఇరికిం చేస్తున్నారు. మొత్తంగా తానే మాష్టర్ బ్లాష్టర్ పొలిటిషన్ అంటూ మీడియా ముఖంగా హరికథలు చెప్పేస్తున్నారు. తన బాధను అర్థం చేసుకోవడానికి సీఎంకు మనసు లేదా అంటూ చెప్పడం వెనుక… జగన్మోన్ రెడ్డిని ఫిక్స్ చేసేయడమే అనుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ గ్యాప్ మొత్తానికి కారణమైన అసలు సీక్రెట్ ను ఇటీవల చానెల్స్ డిబేట్లో చెప్పారు రాజు గారు. తనను పార్టీలో లేకుండా చేయాలని రెడ్డివర్గం నేతలు ప్లాన్ చేశారని… అందుకు విజసాయిరెడ్డి కారణం అన్నట్టుగా చెబుతూ వచ్చిన రాజుగారు తర్వాత అసలు వ్యక్తిని కనిపెట్టానన్నారు.

తనతో నిత్యం మాట్లాడుతూ ఆ విషయాన్ని… ఈ విషయాన్ని పార్టీ పెద్దలకు రాంగ్ ఫీడ్ బ్యాక్ పార్టీలో తాను యాక్టివ్ గా ఉంటే మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరికి నచ్చడం లేదని… ఆయన మొత్తంగా పొగపెట్టారంటూ మీడియా ముందుకు వచ్చి మరీ చెప్పేశారు రాజుగారు.
మొత్తంగా రాజుగారు ప్రశ్నలకు పార్టీ బదులివ్వాల్సిందే. ఎందుకంటే దేశంలోనే అతిపెద్ద పార్టీగా ఉన్న వైసీపీ తీసుకునే నిర్ణయాలు చాలా ప్రాధాన్యత కలిగిఉంటాయ్. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరుతో లేఖ ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని రాజుగారు చెప్తున్నప్పుడు దానికి పార్టీ బదులివ్వాలి కదా… ఆ లేఖ సాక్షిగా తనపై సస్పెన్షన్ వేటు వేసినా ఉపయోగం ఉండదని మీడియా ముఖంగా రాజుగారు గంటల కొద్దీ లెక్చర్లిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎంపీ కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేరని… సాక్షాత్తూ విజయసాయిరెడ్డి స్పీకర్ పోస్టులో కూర్చున్నా నిర్ణయం తీసుకోవడం అసాధ్యమంటూ కొత్త వర్షన్ విన్పిస్తారు.

జగన్ గారు కొటరీ పాలిట్రిక్స్ వ్యవస్థలను భ్రష్టు పట్టించాయ్. సుధీర్ఘ పాదయాత్రతో ప్రజల హృదయాలు గెలుచుకున్న మీరు పార్టీలో ఇలాంటి పరిస్థితులను ఎంత మాత్రం సహించకూడదు. మీరు ఏరికోరి తెచ్చుకున్న ఎంపీ తప్పు చేస్తుంటే మందలించాలి కదా… మీ దారిలోకి రాకుండా గట్టిగా చెప్పొచ్చు కదా.. చిల్లర విమర్శలు చేసేలా అవకాశం ఎందుకు ఇస్తున్నారు. ఈ తప్పు జరగడానికి కారణమేంటి…? చివరన రెడ్డి లేకపోవడం వల్లే ఇదంతా అంటూ చెప్పుకొచ్చిన రాజు గారు ఇప్పుడు కాపు సామాజికవర్గం ఎంపీ వల్ల తనకు ఇబ్బందులు ఎదురవుతున్నాయంటూ బాలశౌరి పేరు నేరుగా ప్రస్తావిస్తున్నారు. ఇలాంటి పరిస్థితిని పార్టీలో రాకుండా చేయాల్సింది మీరే కదా… 20 ఏళ్లు రాజకీయాలు చేస్తానంటూ మీరు కార్యాచరణ మొదలుపెట్టారు. వాలంటీర్ వ్యవస్థ నుంచి ఎన్నో సాహసోపేత నిర్ణయాలతో దేశానికే ఆదర్శంగా నిలిచారు. కరోనా సమయంలో సంక్షేమ సంతకంతో ప్రజలకు ఆర్థిక భరోసా ఇచ్చి… భవిష్యత్ పై నమ్మకం కలిగించారు.
ఇప్పటికే పార్టీలో కీలకంగా ఉన్న విజయసాయిరెడ్డి, రామకృష్ణారెడ్డి మధ్య గ్యాప్ వచ్చిందని… నెంబర్ 2 నేనంటే నేనంటూ ఇద్దరు నేతలు పోటీపడుతూ ఎవరికి వారు సొంత ఎజెండాతో పనిచేస్తున్నారని అటు వైజాగ్ లోనూ, ఇటు తాడేపల్లిలోనూ పుకార్లు షికారు చేస్తున్నాయ్. దీని కోసం రెండు టీంలు కూడా పనిచేస్తున్నాయంటున్నారు. వారి సంగతి ఇంకోసారి చెప్పుకోవచ్చు గానీ… అసలు విషయమేమంటే… ఢిల్లీ స్థాయిలో ప్రధాని మోదీ, జగన్మోహన్ రెడ్డిపై ఉన్న ఇంప్రషన్ మారిపోయే అవకాశం ఉంది కదా… మొత్తంగా రాజుగారి ఎపిసోడ్ చాలా చిన్నదే… కానీ అది బ్లాస్ట్ అయితే పార్టీకి అనవసరమైన తలనొప్పులు తీసుకురావడం ఖాయం. మొత్తంగా గోటితో పోయేదాన్ని గొడ్డలిదాక తెచ్చుకుంటున్నారని కన్ క్లూడ్ చేయోచ్చు.

Related posts

Nagari: రోజా చుట్టూ ముళ్లు.. భానుకి కూడా ఔట్ ..!? నగరి మళ్లీ కష్టమే..!?

Special Bureau

Munugode Bypoll: టీడీపీ ఓట్లు పక్కా లెక్క ..! గెలుపునీ డిసైడ్ చేసేది వీళ్లే.. కానీ..?

Special Bureau

Vijayawada TDP: కేశినేని నాని Vs టీడీపీ కోవర్టులు ..! కృష్ణాజిల్లాలో టీడీపీ బ్లాస్టింగ్..!

Special Bureau

Amaravati Clarity: క్లారిటీ మిస్ అయిన రాజధాని రాజకీయం ..! లీగల్, లాజికల్ అనాలసిస్..

Special Bureau

అమిత్ షా – జూనియర్ ఎన్టీఆర్ భేటీలో కొత్త కోణం ..? తెర వెనుక జగన్ ఉన్నట్లా..!?

Special Bureau

ఆ ఇన్ చార్జిలకు బాబు సీరియస్ క్లాస్ ..!? రెండు నెలల్లో టీడీపీ లో భారీ మార్పులు..!

Special Bureau

చిరంజీవి తప్పు చేశారు..పవన్ షాకింగ్ కామెంట్స్..!? ప్రజారాజ్యం ఉంటే వేరేలా ఉండేది..!

Special Bureau

మోడీ కబురు..రామోజీ.. జూనియర్ ఎన్టీఆర్ చెవిలో..అమిత్ షా మీటింగ్ సీక్రెట్స్ ఇదేనా..!?

Special Bureau

గంజి చిరంజీవికి బిగ్ ఆఫర్..!? నారా లోకేష్ కి ఇక కష్టమేనా..!?

Special Bureau

కేసీఆర్ కౌంట్ డౌన్ మొదలు..!? బీజేపీ టాప్ 5 బిగ్గెస్ట్ ప్లాన్స్..!

Special Bureau

క్యాజినో ఆట – బీజేపీ వేట..! “పొలిటికల్ హవాలా”లో బలయ్యేది వైసీపీ/ టీఆరెస్ ప్రముఖులు!?

Special Bureau

పోలవరం ముంపు – వైసీపీకి ముప్పు..!

Special Bureau

చంద్రబాబు – మోహన్ బాబు: కమ్మ తనం ఇద్దరినీ కలిపిందా..!?

Special Bureau

ఏబీఎన్ ఆర్కే సెన్పేషన్: జగన్ ఓటమి ఖాయం..!? పీకే ఎం చెప్పారు – ఆర్కే ఏం రాశారు..!?

Special Bureau

కేశినేని కుటుంబంలో చిచ్చు..! అసలు కారణం, చిన్ని సైలెంట్ వర్క్ ఎందుకు..!?

Special Bureau