Animal OTT: గత ఏడాది విడుదలైన “యానిమల్” సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అల్లరించటం జరిగింది. హీరో రణబీర్ కపూర్ నీ చాలా వైవిధ్యంగా చూపించారు. తండ్రి కొడుకుల సెంటిమెంట్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం యూత్ నీ ఎంతగానో అలరించింది. గత ఏడాది డిసెంబర్ మొదటి తారీకు విడుదలైన ఈ సినిమా.. జనవరి 26వ తారీకు నుండి ఓటిటిలో స్ట్రీమింగ్ కావడం స్టార్ట్ అయింది. ఈ క్రమంలో ఓటీటీలో కూడా “యానిమల్” దుమ్ము రేపుతుంది. తొలి పది రోజులలోనే 3.93 గంటల వ్యూయర్ షిప్ సాధించింది. దీంతో ఆల్ టైం అత్యధిక వ్యూస్ సాధించిన ఇండియన్ సినిమాగా నిలిచింది.
గతంలో ఈ రికార్డ్ “RRR” పేరు మీద ఉండేది. “RRR” మూవీ తొలి పది రోజుల్లోనే 2.55 కోట్ల గంటల వ్యూయర్ షిప్ సాధించింది. షారుక్ “జవాన్” సినిమాకు కూడా ఇదే స్థాయిలో వ్యూయర్ షిప్ వచ్చింది. కానీ ఈ రెండు సినిమాల రికార్డులను “యానిమల్” సినిమా అధిగమించింది. 2022 మార్చి నెలలో విడుదలైన “RRR” సూపర్ డూపర్ హిట్ అయింది. పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించడం జరిగింది. ఇండియన్ మూవీగా ఇంటర్నేషనల్ స్థాయిలో సత్తా చాటింది.
ప్రపంచ సినీ ప్రతిష్టాత్మక ఆస్కార్ కూడా గెలవడం జరిగింది. ఇంకా అనేక అంతర్జాతీయ సినిమా అవార్డులు “RRR”కి దక్కాయి. ఓటీటీలో కూడా ఊహించని విధంగా రెస్పాన్స్ దక్కించుకుంది. ఈ సినిమాతో ఇండియన్ సినిమాని నెక్స్ట్ లెవెల్ లోకి రాజమౌళి తీసుకెళ్లడం జరిగింది. ఆ తర్వాత గత ఏడాది బాలీవుడ్ ఇండస్ట్రీలో జవాన్ సినిమా అతిపెద్ద హిట్ సినిమాగా నిలిచింది. షారుక్ ఖాన్ కి మంచి బ్రేక్ ఇచ్చింది. ఈ రెండు సినిమాల రికార్డులను ఓటీటీలో “యానిమల్” బ్రేక్ చేయడం విశేషం.