Kalki 2898 AD: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమాలలో అతిపెద్ద ప్రాజెక్టు “కల్కి 2898 AD”. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా మే 9వ తారీకు రిలీజ్ కాబోతోంది. ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. దాదాపు 500 కోట్లకు పైగానే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం.. హాలీవుడ్ రేంజ్ తరహా కంటెంట్ దాగి ఉందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ప్రభాస్ తో పాటు దీపికా పదుకొనే, దుల్కర్ సల్మాన్, రానా దగ్గుబాటి, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశాపటాని వంటి కీలక నటీనటులు భారీ తారాగణం ఈ సినిమాలో మెండుగా ఉంది.
దీంతో “కల్కి 2898 AD” పై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో నటిస్తున్న నటీనటులు పలు ఇంటర్వ్యూలలో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ స్థాయిని నెక్స్ట్ లెవెల్ లోకి “కల్కి 2898 AD” తీసుకెళ్తుందని కామెంట్స్ చేయడం జరిగింది. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవరు చూపించనీ గ్రాఫిక్స్.. ఈ సినిమాలో ఉండబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి క్లైమాక్స్ ఎపిసోడ్ షూటింగ్ జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించి మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంటుందని కొద్దిరోజుల క్రితం తెలియజేశారు.
ముఖ్యంగా ప్రభాస్ ఇంట్రడక్షన్ సన్నివేశానికి అద్భుతమైన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ వచ్చినట్లు దానిపై స్పెషల్ కేర్ తీసుకోవడం కూడా జరిగిందని వ్యాఖ్యానించారు. ఆ సీన్ సినిమాకే చాలా స్పెషల్ గా ఉంటుందని చెప్పుకొచ్చారు. కాగా లేటెస్ట్ గా “కల్కి” సినిమా బ్యాగ్రౌండ్ మ్యూజిక్ “నేయేలి” మ్యూజిక్ కాన్సెర్ట్ లో ప్రదర్శించడం జరిగింది. దానికి సంబంధించిన వీడియో ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి హాలీవుడ్ రేంజ్ లో “కల్కి” సినిమాకి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అందించారు అంటూ సంతోష్ నారాయణన్ పొగడ్తలతో ముంచేత్తుతున్నారు. పాన్ వరల్డ్ తరహాలో ఈ సినిమా రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం.
Here's the unreleased version of the KALKI Glimpse BGM – a Hollywood Range BGM by @Music_Santhosh for #Prabhas's #Kalki2898AD, revealed at the #NeeyeOli concert today! 🥵🔥 pic.twitter.com/gNYfwZ8XLq
— Prabhas FC (@PrabhasRaju) February 10, 2024