Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం “పుష్ప 2” సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఆల్రెడీ వచ్చే ఏడాది ఆగస్టు 15వ తారీకు సినిమా విడుదల కాబోతున్నట్లు ప్రకటన కూడా చేయడం జరిగింది. దీంతో షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. 2021లో డిసెంబర్ నెలలో “పుష్ప” సినిమా విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ప్రపంచ స్థాయిలో విజయం సాధించింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎలాంటి ప్రమోషన్ కార్యక్రమాలు చేయకపోయినా అక్కడ 100 కోట్లు కలెక్ట్ చేయడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ప్రయోగాత్మకంగా పాన్ ఇండియా నేపథ్యంలో “పుష్ప” విడుదల చేయగా ఎవరు ఊహించని విజయం సాధించింది.
“పుష్ప” సినిమా మేనరిజం డైలాగులు మరియు పాటలు స్టెప్పులు అన్నీ కూడా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడం జరిగింది. ఈ సినిమాకి గాను ఇటీవల ఉత్తమ జాతీయ నటుడు అవార్డు కూడా అల్లు అర్జున్ కి రావడం జరిగింది. దీంతో ఇప్పుడు “పుష్ప” రెండో భాగం చాలా ప్రతిష్టాత్మకంగా చిత్రీకరిస్తున్నారు. మొదటి భాగం కంటే ఎక్కువ భాషలలో విడుదల చేయబోతున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు “పుష్ప” సెకండ్ పార్ట్ లో… బన్నీ కూతురు అల్లు అర్హ కూడా నటించబోతున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
విషయంలోకి వెళ్తే పుష్పరాజ్ మరియు శ్రీవల్లికి ఒక బిడ్డ పుడుతుందట. ఆ బిడ్డకు సంబంధించిన పాత్రలో అల్లు అర్హ కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ నటించిన “అలా వైకుంటపురంలో” ప్రమోషన్స్ కి సంబంధించిన సాంగ్ లో అల్లు అర్హ అయాన్ కనిపించారు. ఓ మై గాడ్ డాడీ అనే సాంగ్ లో అయాన్ మరియు అర్హ… తమదైన స్టెప్పులతో అలరించడం జరిగింది. ఆ తర్వాత శకుంతలం సినిమాలో నటించింది. ఈ క్రమంలో ఇప్పుడు “పుష్ప” సెకండ్ పార్ట్ లో అల్లు అర్హ నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దర్శకుడు సుకుమార్ ముందుగా బన్నీతో మాట్లాడి అర్హకి.. సంబంధించిన పాత్రను చాలా చక్కగా డిజైన్ చేసి స్క్రిప్ట్ లో పెట్టినట్లు టాక్. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీ లో షూటింగ్ జరుగుతుంది.