NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Krishna Mukunda Murari April 2 2024 Episode 434: భవాని దేవి ఇంట్లోకి అడుగు పెట్టిన ఆడపడుచు.. రజనీ మీద విరుచుకుపడ్డ కృష్ణ.. ఆదర్శకి సంగీతని దగ్గర చేయాలనుకున్న రజిని..

Krishna Mukunda Murari Today Episode April 2 2024 Episode 434 highlights

Krishna Mukunda Murari April 2 2024 Episode 434: భవానీ దేవి ఆదర్శన మాటలు గుర్తుచేసుకొని బాధపడుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి కృష్ణ వచ్చి తన వల్లే ఇదంతా జరిగిందని తన మీద మురారి మీద ఆదర్శ కోపంగా ఉన్నాడని, దీని అంతటికి నేనే కారణం అని భవాని దేవిని క్షమాపణ అడుగుతుంది. సారీ చెప్పాల్సిన అవసరం లేదు కృష్ణ నిన్ను అర్థం చేసుకోలేని వాళ్లే బాధపడాలి కానీ నువ్వు బాధ పడతావ్ ఎందుకు అని అంటుంది భవాని దేవి. ముకుంద గురించి తెలియక ముకుందా ఒక బండరాయి తన గురించి నీవు పూర్తిగా అర్థం చేసుకోలేదు తన మనసు మారింది అనుకొని తీసుకొచ్చావు కానీ తన మనసు మారలేదు చివరికి తను మురారినే కోరుకుంది అది ఇప్పుడు మనకి పెద్ద సమస్య అయింది అని అంటుంది భవాని దేవి. కృష్ణ నేను ఎలా జరుగుతుందని అనుకోలేదు అత్తయ్య వాళ్ళ సంతోషంగా ఉంటే మేము సంతోషంగా ఉండాలి అని అనుకున్నాము వాళ్ళ సంతోషం తర్వాతే మా సంతోషం అనుకున్నాను అని వాళ్ళని కలపాలని ప్రయత్నం చేశానని అంటుంది అయిపోయింది కదా ఇప్పుడు ఏం చేయలేవు కదా అని అంటుంది భవాని దేవి. ఇప్పటికైనా వేరే వాళ్ల గురించి ఆలోచించడం మానే కృష్ణ అని భవానీ దేవి కృష్ణ కి చెప్తుంది. ఇకనుంచి అయినా మీ జీవితాలు మీరు జీవించండి. అని భవానీ దేవి కృష్ణ కి క్లాస్ పీకుతుంది ఇక కృష్ణ బాధగా అక్కడే నుంచొని ఉంటుంది ఇక అప్పుడే కింద నుంచి వదిన అని ఎవరో పిలిచినట్టు వినబడుతుంది ఇద్దరూ కిందకి వస్తారు. ఇక్కడే మనకి ఒక రెండు కొత్త క్యారెక్టర్స్ ని పరిచయం చేస్తారు. రజిని ఆమె కూతురు సంగీత.

Krishna Mukunda Murari Today Episode April 2 2024 Episode 434 highlights
Krishna Mukunda Murari Today Episode April 2 2024 Episode 434 highlights

భవాని దేవిని వదిన అని పిలవడంతో కిందకు వచ్చి ఎవరు అని అంటుంది. తల్లి కూతుర్లు ఇద్దరిని మనకి చూపిస్తారు. ఇంట్లో వాళ్ళందరూ వాళ్ళని చూసి ఒకళ్ళ మొఖాలు ఒకళ్ళు చూసుకుంటారు. వదిన బాగున్నావా అని రేవతి పలకరిస్తుంది. బాగున్నావా అమ్మ ఇన్నాళ్లు ఉన్నామా పోయామా అని పట్టించుకోలేదు కదా ఇప్పుడు మా అంతటమేమీ రావాల్సి వచ్చింది అని అంటారు. ఈవిడ మాటలు మట్టి చూస్తే గయ్యాళి లాగా మీద పడడం, రేవతితో ఇప్పటికైనా మేము ఇక్కడికి వస్తామని మీరు అనుకోలేదు కదా రావాల్సి వచ్చింది అని అంటుంది. పక్కనే ఉన్న భవానీ దేవి రజనీ అని అంటుంది అవును వదిన అని అంటుంది రజిని. నువ్వు ఎటుగూడి మా దగ్గరికి రావడం తెలుసు మా ఆయన మమ్మల్ని వదిలేసి ఎప్పుడో వెళ్లిపోయాడు. తండ్రి లేని పిల్లని ఇన్నాళ్లు పెంచి ఇప్పుడు తిక్కడికి తీసుకు వచ్చాను అని పక్కనే ఉన్న కూతుర్ని పరిచయం చేస్తుంది రజిని. అది కూడా నీ పెద్ద కోడలు ముకుంద పోయిందంట కదా, అది తెలుసుకొని ఇక్కడికి వచ్చాను అని అంటుంది రజిని. వెంటనే ఇంట్లో అందరూ షాక్ అయి చూస్తూ ఉంటారు అదే పరామర్శించడానికి వచ్చాను అని కవర్ చేస్తుంది రజిని. నా కూతురు సంగీతనే నీ కోడలు చేసుకోవాలని ఎప్పటినుంచో చెప్తున్నాను కానీ నువ్వే వినలేదు. నాకు ఆ ముకుందని కోడలుగా చేసుకున్నారు ఇప్పుడు చూడు ఏమైందో అని అంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన మురారి బాగున్నారా అత్తయ్య అని అంటాడు. దీన్ని బట్టి భవానీ దేవికి ఆమె ఆడబడుచు అని అర్థం అవుతుంది. బాగున్నాం బాబు అని అంటుంది ఇక ఇప్పుడు అలాంటి మాటలు అన్ని ఎందుకు అని రేవతి అంటుంది ఇలాంటి సాయం సమయంలోనే మాట్లాడాలి వదిన ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. నీ కొడుక్కి నా కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తే బాగుంటుంది అని భవాని దేవితో అంటుంది రజిని. ఇటికుడి ఆదర్శ్ భార్య చనిపోయింది కాబట్టి నా కూతురు సంగీత ని ఇచ్చి పెళ్లి చేస్తే బాగుంటుంది అని అంటుంది రజిని ఆ మాటలకు భవాని దేవి షాక్ అవుతుంది. ఏంటి రజిని ఇదంతా వచ్చి రాగానే మొదలు పెట్టావా అని అంటుంది భవాని దేవి. ఏం చేయాలో ఎవరిని పెళ్లి చేయాలో నాకు బాగా తెలుసు నువ్వేం చెప్పక్కర్లేదు అని అంటుంది. అవును నీకు బాగా తెలుసు ఇప్పటివరకు నీ ఇష్టం ప్రకారం అయితే ఏం జరిగింది మీకుందా చనిపోయింది. ముకుందని శవం గా మార్చారు. అని అంటే అందరూ షాకే చూస్తూ ఉంటారు అప్పుడే బాగా తాగిన ఆదర్శ్ ని మీరా తీసుకొని వస్తూ ఉంటుంది.

Krishna Mukunda Murari Today Episode April 2 2024 Episode 434 highlights
Krishna Mukunda Murari Today Episode April 2 2024 Episode 434 highlights

ఇక ఆదర్శ్ బాగా తాగి నడవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటాడు భవాని దేవి కోపంగా ఆదర్శ్ వైపు చూస్తుంది. ముకుంద రజిని వాళ్ళని చూసి వీళ్ళు ఎవరు అని అనుకుంటుంది.ఇప్పుడు కొడుకుని తాగుబోతుని చేసావా భవాని అంటుంది రజిని. మాట్లాడు భవాని దేవి నేను అడిగితే సమాధానం చెప్పవేంటి నీ కొడుకుని తాగుబోతు అని చేయడం తప్ప ఏం సాధించావు నువ్వు అని అంటుంది ఇక వెంటనే పక్కనే ఉన్న కృష్ణకి కోపం వస్తుంది పిన్ని మాటలు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి అని అంటుంది. అప్పటికి కృష్ణ ఎవరన్నది రజనీకి తెలియదు ఎవరు నువ్వు అని అడుగుతుంది. ఇది మా అత్త ఇల్లు మా వదిన ఇల్లు అని అంటుంది రజిని. నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను. ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను అని అంటుంది రజిని. మీరు ఎవరైనా కానివ్వండి ఏదైనా మాట్లాడండి. అని ఆవిడకి సమాధానం చెప్పబోతుంటే పక్కనే ఉన్న భవానీ దేవి కృష్ణుని ఆపుతుంది ఏంటి అత్తయ్య వాళ్ళు మిమ్మల్ని అంటున్నారు అని, మా అత్తయ్య నీ పేరు పెట్టి పిలిచే అధికారం ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరికి లేదు అలాంటిది మీరు ఆమెని పేరు పెట్టి సంబోధిస్తున్నారు అని అంటుంది కృష్ణ. మీరు బంధువులు కాబట్టి వదిన అని పిలవండి. అంతేగాని పేరు పెట్టి పిలవాలని చూస్తే ఆవిడ ఊరుకున్నా నేను ఊరుకోను అని అంటుంది అయితే ఏం చేస్తావని మీరు వస్తుంది రజిని వెంటనే రేవతి ఆపుతుంది ఏంటి రేవతి నీ కోడల్ని కంట్రోల్ లో పెట్టుకోవడం చేతకాదు కానీ ఆడపడుచుని అదుపు చేయాలని చూస్తున్నావా అని అంటుంది రజిని. నువ్వు ఉండగానే నీ ఆడపడుచుని ఏమంటుందో వింటున్నావా వార్నింగ్ ఇస్తుంది నీ కోడలు అని అంటుంది రేవతి తో ధరణి పోయే కంపం తీసుకొచ్చిన తిని తగిలించుకుంటే ఇలానే ఉంటుంది అని కృష్ణ గురించి మాట్లాడుతుంటే భవాని దేవి రజిని అని అరుస్తుంది. తనని ఏమీ అనొద్దు అనడానికి వీల్లేదు అని అంటుంది భవాని దేవి. ముందు వచ్చిన ఆడబిడ్డ కన్నా వెనక వచ్చిన కోడలు ఎక్కువ అయిపోయిందా మీకు అని అంటుంది. వెంటనే సుమలత మా పెద్దక్కని ఎవరైనా తక్కువ చేసి మాట్లాడితే మా ఇంట్లో ఎవరు సహించరు అని అంటుంది. అంటే మా వదిన పేరు పెట్టి పిలిచే హక్కు నాకు లేదా అని అంటుంది రజిని. ఇప్పుడు పేరు పెట్టి పిలవద్దంటుంది రేపొద్దున అక్కడ కూర్చోవద్దు ఇక్కడ కూర్చోవద్దు అంటుంది అప్పుడు నేను ఇంటికి రావడం మానేయాలి అని అంటుంది. అలాగని నేను అనలేదు అని కృష్ణ అంటుంది. ప్రేమగా వదినా అని పిలవండి పేరు పెట్టి పిలిస్తే మాత్రం ఊరుకునేది లేదు అని కృష్ణ మళ్ళీ వర్నింగ్ ఇస్తుంది రజనీకి, కృష్ణ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది రజిని. మీరే ఆవిడకి అర్థం అయ్యేటట్టు చెప్పండి అని కృష్ణ పైకి వెళ్ళిపోతుంది. ఇక పదవి మనం వెళ్దాము ఈరోజుకి ఏదో హోటల్లో పడుకుని పొద్దున్నే మన ఊరికి వెళ్ళిపోదామని రజనీ కూతురుతో అంటుంది. ఎక్కడికి వెళ్తారు అని అంటే వెంటనే ఆమెను మీరు కోడళ్ళకి అధికారం ఇచ్చి కుక్కని పెండ్లా పడి ఉండాలంటే నావల్ల కాదు అని అంటే అది అధికారం కాదు రజిని ప్రేమ అని అంటుంది భవాని. బాగా అలసిపోయి వచ్చారు వెళ్లి రెస్ట్ తీసుకోండి రేపు మాట్లాడదాం అని అంటుంది. ఇక అక్కడే ఉన్నాను ముకుందా వీళ్ళ వల్ల మనకు ఏమైనా ప్రమాదం జరుగుతుందా అయినా కృష్ణ మీద కోపడ్డారు అంటే కచ్చితంగా మనం వైపు తిప్పుకొని మన దారిలోకి తెచ్చుకోవచ్చు అని అనుకుంటుంది.

Krishna Mukunda Murari Today Episode April 2 2024 Episode 434 highlights
Krishna Mukunda Murari Today Episode April 2 2024 Episode 434 highlights

ఆదర్శ గదిలో ఉంటే అక్కడికి సంగీత వెళుతుంది ఆదర్శనీ తన వైపు తిప్పుకోవాలని ప్రయత్నిస్తుంది కానీ ఆదర్శ మాత్రం సంగీతం అరిచి కిందకి వెళ్లిపోమంటాడు. అదేంటి బావ నన్ను ఒకసారి చూడు ఈ తాగాల్సిన అవసరం ఉండదు. నిన్ను నా కళ్ళతోనే మత్తెక్కించేలా చేస్తాను అని అంటుంది కానీ ఆదర్శ మాత్రం సంగీత వైపు చూసి ఇక నుంచి వెళ్ళిపో అని గట్టిగా అరుస్తాడు కానీ సంగీత మాత్రం వదలకుండా ముకుంద మధ్యలో వచ్చింది మధ్యలోనే వెళ్లిపోయింది నువ్వు ఏమైనా తనతో జీవితాంతం ఉండాలని అనుకున్నావా నువ్వు పెళ్లి అవ్వగానే వెళ్ళిపోయావు ఇప్పుడు తను వెళ్ళిపోయింది అంతేగానివైతే తిరిగి వచ్చావు తను తిరిగి రాదు అంతే తేడా అని అంటుంది ఆ మాటలకు ఆదర్శ కోపంగా సంగీతని అరుస్తాడు. ఇప్పుడంటే తాగున్నావ్ కాబట్టి ఇలా అరుస్తున్నావు నీ మత్త దిగిన తర్వాత నేనంటే ఎవరో నీకు అర్థం అయ్యేలా చేస్తాను అని సంగీత అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది.

Krishna Mukunda Murari Today Episode April 2 2024 Episode 434 highlights
Krishna Mukunda Murari Today Episode April 2 2024 Episode 434 highlights

ఇక మరోవైపు కృష్ణ కోపంగా ఉంటుంది మురారి ఎందుకు అంత కోపంగా ఉన్నావు అని అడిగితే భవానీ దేవి అత్తయ్య అని పేరు పెట్టి పిలుస్తుందా ఆవిడ అసలు ఆవిడ ఏమనుకుంటుంది అని అంటుంది. రజిని గురించి మాట్లాడుతుంది. ఆవిడతో నీకెందుకు అయినా నీకు పెద్దమ్మ చెప్పింది కదా నీ పనిలో నువ్వు ఉండమని మీ ఆలోచనలు నువ్వు చెయ్యి సంఘసేవ కాదు అని చెప్పింది కదా అని అంటే అందుకు నేను అసలు ఒప్పుకొని చూపిస్తారా అత్తయ్య చెప్పినా నేను వినను, మురారితో చెప్పి, కోపంగా కిందకి వెళుతుంది కృష్ణ. అరే మా రజినీ అత్తయ్యని చూస్తే ఆవిడ కంచు కనుక ఈ కృష్ణుని చూస్తే ఆ కంచు కనుకానికి గంట మోగించేలా ఉంది ఇంకా ఇంట్లో అన్ని గొడవలు జరుగుతాయి అని అనుకుంటాడు. ఇక కృష్ణ కిందికి వస్తూ ఉంటుంది మరోవైపు రజిని వాళ్ళ అమ్మాయితో మాట్లాడుతూ ఉంటుంది. రజిని ఇండ్లు మొత్తం చూసి ఈ ఇంట్లో నుంచి మనం చుట్టాలు లాగా వచ్చాము కానీ ఇంట్లో పాతుకు పోవాలి నువ్వు ఇలా నిద్రపోయి మళ్లీ కాఫీ నన్ను అడిగితే, నీ గురించి ఏం కావాలి ఏమనుకుంటారు మీకు అసలు ఏమీ తెలియదు అని కూతుర్ని తిడుతూ ఉంటుంది అప్పుడే కృష్ణ కిందకి రావడం చూసి మీకు కాఫీ కావాలంటే ఇంట్లో పని వాళ్ళు ఉన్నారు వాళ్ళని అడుగు అని కృష్ణ నీ పనిమనిషి లాగా మాట్లాడుతుంది రజిని ఆ మాటలు కృష్ణ కోపం వచ్చి, వాళ్లని ఏమీ అనకుండా అటుగా వెళుతూ ఉంటే ఇదేనా మీరు ఈ ఇంట్లో చుట్టాలకి ఇచ్చే మర్యాద అని అంటుంది. అయ్యో మీరే కదా రాత్రి ఇంట్లో మనుషులం మేము అని అన్నారు మీరు చుట్టాలని తెలిసినట్లయితే కచ్చితంగా మర్యాద చేసేదాన్ని ఇప్పుడు చెప్పండి ఏం కావాలి అని అంటే సంగీత కాఫీ అని అంటుంది. వెంటనే ఇప్పుడే తీసుకొస్తాను అని కృష్ణ వెళ్లి కాఫీ తీసుకొని వస్తుంది ఇందు త్వరగా తీసుకొచ్చావేంటి అని అంటే మీరు ఏంటి చుట్టాలు కదా మరి అది కొంచెం లోపమే జరిగినా బాగోదు అని తొందరగా తీసుకొచ్చాను అని అంటుంది కృష్ణ. ఇక పక్కనే ఉన్న సంగీత అమ్మ నువ్వేమో కృష్ణుని పనిమనిషి చేద్దాం అనుకుంటే అది మనల్ని ఇంటికి చుట్టాలు చేసింది అని అంటుంది. చూస్తాను నేను ఏంటి అధికారం కోసం వచ్చాను నిన్ను ఇంట్లో పర్మినెంట్గా సెటిల్ చేసి నేను ఇంటి అధికారాన్ని చేతిలో పట్టుకొని అప్పుడు కృష్ణ ని ఆట ఆడిస్తాను. అప్పుడు ఎవరు పనిమనిషి తెలుస్తుంది అని అంటుంది రజిని.

Krishna Mukunda Murari Today Episode April 2 2024 Episode 434 highlights
Krishna Mukunda Murari Today Episode April 2 2024 Episode 434 highlights

రేపటి ఎపిసోడ్ లో మీరా, శ్రీనివాస్ కి ఫోన్ చేసి ఇల్లు అమ్మమని చెప్పాను కదా నాన్న ఎంత వాడికి వచ్చింది అని అంటుంది. ఇంకా బేరం రాలేదని చెప్తాడు నువ్వు ఏదో చెప్తావు కనీసం ఇల్లు కూడా అమ్మడం చేతకాదు నాన్న అని శ్రీనివాస్ మీద కోపంగా మాట్లాడుతుంది. అదంతా వెనక ఉన్న కృష్ణ వింటుంది. ఈ అమ్మాయికి ఎవరూ లేరని చెప్పారు కదా మరి నాన్న అని ఎవరిని పిలుస్తుంది ఫోన్లో అని అనుమాన పడుతుంది వెంటనే దగ్గరికి వెళ్లి నీకు ఎవరూ లేరని చెప్పావు కదా మరి నాన్న అని ఎవరిని పిలుస్తున్నావని అడుగుతుంది మీరా షాక్ అవుతుంది.. ముకుందే మీరా నీ కృష్ణ కనిపెడుతుందేమో చూడాలి..

author avatar
bharani jella

Related posts

Nara Brahmani: అమ్మ దీనమ్మ.. కాలేజ్ టైంలో నారా బ్రాహ్మణి అటువంటి పనులు చేసేదా.. పాప మంచి గడుసరిదే..!

Saranya Koduri

Kanchana: కోట్లాది ఆస్తిని గుడికి రాసి ఇచ్చేసిన అర్జున్ రెడ్డి ఫేమ్ కాంచన.. కారణం ఏంటంటే..!

Saranya Koduri

OTT: ఓటీటీలోకి వచ్చేసిన మరో క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Priyanka Jain: పెళ్లికి ముందే పిల్లల గురించి తెగ ఆలోచిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక.. ఎందుకో తెలిస్తే పక్కా షాక్..!

Saranya Koduri

Hello Brother: 30 ఏళ్ళు పూర్తి చేసుకున్న హ‌లో బ్ర‌ద‌ర్.. అప్పట్లో ఈ సినిమా ఎన్ని కోట్లు రాబ‌ట్టిందో తెలుసా?

kavya N

Sreeja Konidela: గుడ్‌న్యూస్ చెప్పిన చిరంజీవి చిన్న కూతురు.. మొద‌లైన శ్రీ‌జ కొత్త ప్ర‌యాణం!

kavya N

Thiruveer: సైలెంట్ గా పెళ్లి పీట‌లెక్కేసిన మసూద న‌టుడు.. అమ్మాయి ఎంత అందంగా ఉందో చూశారా?

kavya N

Jagadhatri April 22 2024 Episode 211: మాధురి మెడలో  తాళి కట్టాలనుకుంటున్న భరత్  ని జగదాత్రి పట్టుకుంటుందా లేదా..

siddhu

Trinayani  April 22 2024 Episode 1219: నైని చేసే పూజని తనకి అనుకూలంగా మార్చుకోవాలనుకుంటున్న సుమన..

siddhu

Nuvvu Nenu Prema April 22 2024 Episode 604: ఇంటికి చేరిన విక్కీ పద్మావతి..కృష్ణ నిజస్వరూపం బయట పెట్టాలనుకున్న పద్మావతి..

bharani jella

Brahmamudi April 22 2024 Episode 390: మీడియా ముందుకి రాజ్ కొడుకు? సమాధానం చెప్పలేని సుభాష్.. కోటి రూపాయలతో కోడలికి చెక్ పెట్టాలనుకున్న రుద్రాణి..

bharani jella

Krishna Mukunda Murari April 22 2024 Episode 450: పిల్లల్ని కంటానన్న కృష్ణ. నిజం చెప్పలేని మురారి. భవాని ఫైర్..

bharani jella

Trinayani: త్రినయని సీరియల్ ఫేమ్ పరశు రియల్ లైఫ్ అండ్ ఫ్యామిలీ..!

Saranya Koduri

Jamuna: ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తో గొడవలు పెట్టుకున్న జమున.. కారణమేంటో తెలిస్తే పక్కా షాక్..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: ఆద్య లేటెస్ట్ ఫోటోస్ ను చూశారా?.. అందమంటే ఇది కదా…!

Saranya Koduri